కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?

మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?

ఒకసారి యేసు ఇలా అన్నాడు, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) ఈ సూత్రం, యెహోవాతో మనకున్న సంబంధం విషయంలో కూడా వర్తిస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మనం సంతోషంగా ఉండడానికి యెహోవా ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అయితే, ఆయనకు తిరిగి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ సంతోషిస్తాం. మరి ఆయనకు మనం ఏ బహుమానం ఇవ్వవచ్చు? ‘నీకున్న విలువైన వాటితో యెహోవాను ఘనపర్చు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 3:9, NW) ఆ ‘విలువైన వాటిలో’ మన సమయం, సామర్థ్యాలు, బలం, ఆర్థిక వనరులు ఉన్నాయి. సత్యారాధన కోసం వాటిని ఉపయోగించినప్పుడు, మనం యెహోవాకు బహుమానం ఇచ్చిన వాళ్లమౌతాం. అంతేకాదు దానివల్ల చాలా సంతోషం కలుగుతుంది.

యెహోవాకు బహుమానం ఇవ్వడానికి మన ఆర్థిక వనరుల్ని ఎలా ఉపయోగించవచ్చు? విరాళం కోసం ‘కొంత తీసి పక్కకు పెట్టమని’ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పాడు. (1 కొరిం. 16:2) మీ ప్రాంతంలో ఏయే విధాలుగా విరాళం ఇవ్వవచ్చో తెలుసుకోవడానికి దయచేసి కిందున్న బాక్సు చూడండి.

ఆన్‌లైన్‌లో విరాళం ఇచ్చే ఏర్పాటు అన్నిదేశాల్లో లేదు. కానీ విరాళం ఇచ్చే ఇతర మార్గాల గురించిన సమాచారం “ప్రపంచవ్యాప్త పని కోసం విరాళం ఇవ్వడమెలా” అనే వెబ్‌ పేజీలో ఉంది. కొన్ని దేశాల్లో, విరాళాలకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులు ఉన్న డాక్యుమెంట్‌ని jw.org హోమ్‌ పేజీలో ఉంచారు.