కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం చేయడానికి ఐడియాలు

మంచి పరిసరాలు ఉండేలా చూసుకోండి

మంచి పరిసరాలు ఉండేలా చూసుకోండి

మీకు వ్యక్తిగత అధ్యయనం ఇంకా చక్కగా చేయాలని ఉందా? అయితే మనసుపెట్టి చదవడానికి కింద ఇచ్చిన ఈ ఐడియాల్ని పాటించి చూడండి.

  • ప్రశాంతమైన చోట చదవండి. వీలైతే, చిందరవందరగా లేకుండా నీట్‌గా ఉండే చోటును ఎంచుకోండి. సరిపడా వెలుతురు కూడా ఉండేలా చూసుకోండి. మీరు టేబుల్‌ దగ్గర కూర్చోవచ్చు లేదా బయట ప్రశాంతంగా ఉండే చోట కూడా కూర్చోవచ్చు.

  • ఎవ్వరూ లేని చోట చదవండి. యేసు “తెల్లవారుజామున . . . ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లి” ప్రార్థించాడు. (మార్కు 1:35) అలా వీలవ్వకపోతే మీరు ఎప్పుడు అధ్యయనం చేయాలనుకుంటున్నారో మీ ఇంట్లోవాళ్లకు ముందే చెప్పి, ఆ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయొద్దని చెప్పండి.

  • మీ దృష్టి పక్కకు వెళ్లకుండా చూసుకోండి. దృష్టిని పక్కకు మళ్లించే వాటికి దూరంగా ఉండండి. అధ్యయనం చేయడానికి మీరు ఫోన్‌ లేదా ట్యాబ్‌ ఉపయోగిస్తే, నోటిఫికేషన్‌లను ఆఫ్‌ చేసుకోండి లేదా ఫోన్‌ని ఫ్లయిట్‌ మోడ్‌లో పెట్టుకోండి. మధ్యలో మీకు ఏదైనా పని గుర్తొస్తే, దాన్ని ఎక్కడైనా రాసి పెట్టుకుని తర్వాత చేయండి. మీరు అస్సలు మనసు పెట్టలేకపోతుంటే కాసేపు అటూఇటూ నడవండి లేదా లైట్‌గా ఎక్సర్‌సైజ్‌ చేయండి.