అధ్యయన ఆర్టికల్ 6
మన తండ్రైన యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు
‘కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: “మా తండ్రీ.”’—మత్త. 6:9.
పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’
ఈ ఆర్టికల్లో . . . *
1. పారసీక దేశపు రాజుతో మాట్లాడాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి?
మీరు దాదాపు 2,500 సంవత్సరాల క్రితం పారసీక రాజ్యంలో ఉన్నట్టు ఊహించుకోండి. ఒక విషయం గురించి మీరు ఆ దేశంలోని రాజుతో మాట్లాడాలని, రాజభవనం ఉండే షూషను నగరం వరకు ప్రయాణం చేసి వెళ్లారు. చక్రవర్తిని కలవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆయన అనుమతి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా ఆయన దగ్గరకెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తే, మీ ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సిందే!—ఎస్తే. 4:11.
2. యెహోవాతో మాట్లాడే విషయంలో మనం ఎలా భావించాలని ఆయన కోరుతున్నాడు?
2 యెహోవా ఆ పారసీక రాజులా లేనందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! యెహోవా మానవ పాలకులందరికన్నా ఎంతో గొప్పస్థానంలో ఉన్నాడు, అయినా ఆయనతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం సంకోచించకుండా ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకు, యెహోవాకు గొప్ప సృష్టికర్త, సర్వశక్తుడు, సర్వోన్నత ప్రభువు వంటి బిరుదులున్నా, ఆప్యాయతతో కూడిన “తండ్రి” అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. (మత్త. 6:9) మనం ఆయనకు సన్నిహితంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు; అది తెలుసుకోవడం మనకెంత సంతోషాన్నిస్తుందో కదా!
3. మనం యెహోవాను “తండ్రి” అని ఎందుకు పిలవవచ్చు? ఈ ఆర్టికల్లో ఏం పరిశీలిస్తాం?
3 మన ప్రాణానికి మూలాధారం యెహోవానే కాబట్టి ఆయన్ని “తండ్రి” అని పిలవడం సరైనది. (కీర్త. 36:9) ఆయన మన తండ్రి కాబట్టి ఆయనకు విధేయత చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆయన చెప్పింది చేస్తే మనం అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుతాం. (హెబ్రీ. 12:9) ఆ ఆశీర్వాదాల్లో ఒకటి శాశ్వత జీవితం, అది పరలోకంలో గానీ, భూమ్మీద గానీ. మనం ఇప్పుడు కూడా కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాం. యెహోవా నేడు ఒక ప్రేమగల తండ్రిగా ఎలా ఉన్నాడో, రానున్న రోజుల్లో ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో ఈ ఆర్టికల్లో పరిశీలిస్తాం. ముందుగా, మన ప్రేమగల పరలోక తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని, మనపట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడని ఎందుకు నమ్మవచ్చో పరిశీలిద్దాం.
యెహోవా ఒక ప్రేమగల, శ్రద్ధగల తండ్రి
4. యెహోవాను తమ తండ్రిగా చూడ్డానికి కొంతమందికి ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?
4 దేవున్ని మీ తండ్రిగా చూడడం మీకు కష్టంగా అనిపిస్తోందా? యెహోవా ఎంతో గొప్పవాడు కాబట్టి ఆయనకు మనం లెక్కలోకి రామని కొందరు అనుకుంటారు. సర్వశక్తిగల దేవుడు తమలో ఒక్కొక్కరి పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటాడనే విషయాన్ని వాళ్లు సందేహిస్తారు. కానీ మనం అలా అనుకోవాలని మన ప్రేమగల తండ్రి కోరుకోవట్లేదు. ఆయన మనకు జీవాన్నిచ్చాడు; మనం ఆయనతో ఒక మంచి బంధాన్ని ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత, ఏథెన్సులోని తన శ్రోతలకు ఇలా వివరించాడు, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొ. 17:24-29) సహజంగా ఒక పిల్లవాడు ప్రేమగల, శ్రద్ధగల తండ్రి దగ్గరకు ఎలా వెళ్తాడో, అలా మనలో ప్రతీ ఒక్కరం తన దగ్గరకు రావాలని దేవుడు కోరుతున్నాడు.
5. ఒక సహోదరి అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
5 ఇంకొంతమందికి తమ కన్నతండ్రి ప్రేమాప్యాయతల్ని సరిగ్గా చూపించకపోవడం వల్ల, యెహోవాను తమ తండ్రిగా చూడడం కష్టంగా అనిపించవచ్చు. ఒక సహోదరి చెప్పే ఈ మాటల్ని పరిశీలించండి: “మా నాన్న చాలా కోపిష్ఠి. నేను బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టిన కొత్తలో పరలోక తండ్రికి సన్నిహితమవ్వడం అనే ఆలోచన కష్టంగా అనిపించేది. కానీ యెహోవా గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచన పూర్తిగా మారిపోయింది.” ఆ సహోదరికి కొత్తలో అనిపించినట్టు మీకు కూడా అనిపిస్తుందా? అయితే నిరుత్సాహపడకండి. మెల్లిమెల్లిగా మీకు కూడా యెహోవా చాలా గొప్ప తండ్రి అని అనిపిస్తుంది.
6. మత్తయి 11:27 ప్రకారం, తనను ఒక ప్రేమగల తండ్రిలా చూడడానికి యెహోవా మనకు సహాయం చేసిన ఒక విధానమేమిటి?
6 తనను ఒక ప్రేమగల తండ్రిలా చూడడానికి యెహోవా మనకు సహాయం చేసిన ఒక విధానమేమిటంటే, యేసు మాటల్ని, పనుల్ని బైబిల్లో రాయించి పెట్టడం. (మత్తయి 11:27 చదవండి.) యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని ఎంతో పరిపూర్ణంగా అనుకరించాడు, అందుకే ఆయనిలా చెప్పగలిగాడు, “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” (యోహా. 14:9) ఒక తండ్రిగా యెహోవాకున్న పాత్ర గురించి యేసు ఎప్పుడూ మాట్లాడుతుండేవాడు. కేవలం నాలుగు మంచివార్త వృత్తాంతాల్లోనే యేసు యెహోవా గురించి మాట్లాడుతూ “తండ్రి” అనే పదాన్ని దాదాపు 165 సార్లు ఉపయోగించాడు. యేసు యెహోవా గురించి ఎందుకు అంతలా మాట్లాడాడు? ఒక కారణమేమిటంటే, యెహోవా ఒక ప్రేమగల తండ్రి అని ప్రజల్ని ఒప్పించడానికి ఆయన అలా చేసివుంటాడు.—యోహా. 17:25, 26.
7. తన కుమారుడైన యేసుతో యెహోవా వ్యవహరించిన తీరు నుండి మనం ఆయన గురించి ఏం నేర్చుకుంటాం?
7 తన కుమారుడైన యేసుతో యెహోవా వ్యవహరించిన తీరు నుండి మనం ఆయన గురించి ఏం నేర్చుకోవచ్చో పరిశీలించండి. యేసు ప్రార్థన చేసిన ప్రతీసారి యెహోవా విన్నాడు. ఆయన వినడమే కాదు వాటికి జవాబులు కూడా ఇచ్చాడు. (యోహా. 11:41, 42) యేసు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నా, తన తండ్రి ప్రేమను, మద్దతును చవిచూశాడు.—లూకా 22:42, 43.
8. యేసుకు అవసరమైన ఏవేవి యెహోవా ఇచ్చాడు?
8 “ఆయనవల్ల నేను జీవిస్తున్నాను” అని యేసు చెప్పినప్పుడు, తన జీవానికి మూలాధారం, జీవించివుండడానికి కారణం తన తండ్రి అని ఆయన ఒప్పుకున్నాడు. (యోహా. 6:57) యేసు తన తండ్రిమీద పూర్తిగా నమ్మకం ఉంచాడు, యెహోవా ఆయన భౌతిక అవసరాలు తీర్చాడు. మరి ముఖ్యంగా యెహోవా ఆధ్యాత్మిక విషయాల్లో యేసు పట్ల శ్రద్ధ తీసుకున్నాడు.—మత్త. 4:4.
9. యెహోవా యేసును ఎంతో ప్రేమించే ఒక ప్రేమగల తండ్రి అని ఎలా చూపించాడు?
9 యెహోవా ప్రేమగల తండ్రి కాబట్టి, తన మద్దతు యేసుకు ఉందని యేసు అర్థంచేసుకునేలా ఆయన రూఢిపర్చుకున్నాడు. (మత్త. 26:53; యోహా. 8:16) యేసుకు హానిచేసే వాటన్నిటి నుండి యెహోవా ఆయన్ని కాపాడలేదు కానీ ఆ కష్టాలను తట్టుకోవడానికి సహాయం చేశాడు. తనకు కలిగే ఏ హాని అయినా అది కొంతకాలమేనని యేసుకు తెలుసు. (హెబ్రీ. 12:2) యేసు ప్రార్థనలు వినడం ద్వారా, ఆయన అవసరాలు తీర్చడం ద్వారా, ఆయనకు శిక్షణ ఇవ్వడం ద్వారా, ఆయనకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన్ని ప్రేమించాడని యెహోవా చూపించాడు. (యోహా. 5:20; 8:28) మన పరలోక తండ్రి మనపట్ల కూడా అలాంటి శ్రద్ధను ఎలా చూపిస్తున్నాడో ఇప్పుడు పరిశీలిద్దాం.
మన ప్రేమగల తండ్రి మన విషయంలో ఎలా శ్రద్ధ తీసుకుంటాడు?
10. కీర్తన 66:19, 20 ప్రకారం యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా చూపిస్తున్నాడు?
10 యెహోవా మన ప్రార్థనలు వింటాడు. (కీర్తన 66:19, 20 చదవండి.) ప్రార్థన విషయంలో యెహోవా మనల్ని నియంత్రించాలని అనుకోవట్లేదు, బదులుగా తరచూ ప్రార్థించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 థెస్స. 5:17) మనం ఎప్పుడైనా, ఎక్కడైనా గౌరవపూర్వకంగా మన దేవునికి ప్రార్థించవచ్చు. మన ప్రార్థనలను వినలేనంత తీరికలేకుండా ఆయన ఎప్పుడూ ఉండడు. ఆయన అన్నిసమయాల్లో అందుబాటులో ఉంటాడు, మన ప్రార్థనలను జాగ్రత్తగా వింటాడు. యెహోవా మన ప్రార్థనలను వింటాడని మనం గ్రహిస్తే, ఆయన్ని మనం ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. కీర్తనకర్త ఇలా అన్నాడు, ‘నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా స్వరాన్ని వింటాడు.’—కీర్త. 116:1.
11. యెహోవా మన ప్రార్థనలకు ఎలా స్పందిస్తాడు?
11 మన తండ్రి మన ప్రార్థనలు వినడమే కాదు వాటికి జవాబులు కూడా ఇస్తాడు. అపొస్తలుడైన యోహాను ఈ భరోసా ఇస్తున్నాడు, “మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.” (1 యోహా. 5:14, 15) అయితే, మన ప్రార్థనలకు మనం ఊహించినట్టు యెహోవా జవాబు ఇవ్వకపోవచ్చు. మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు, అందుకే ఆయన జవాబు కొన్నిసార్లు కాదనే విధంగా లేదా మనం కొంతకాలం ఓపిక పట్టాలనే విధంగా ఉండవచ్చు.—2 కొరిం. 12:7-9.
12-13. మన పరలోక తండ్రి ఏయే విధాలుగా మనకు అవసరమైనవి ఇస్తున్నాడు?
12 యెహోవా మనకు అవసరమైనవాటిని ఇస్తాడు. తండ్రులందరూ ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో ఆయన కూడా అదే చేస్తాడు. (1 తిమో. 5:8) తన పిల్లలు జీవించడానికి అవసరమైన వాటిని ఆయన ఇస్తాడు. ఆహారం గురించి, బట్టల గురించి, నివాసం గురించి మనం ఆందోళనపడడం ఆయనకు ఇష్టం లేదు. (మత్త. 6:32, 33; 7:11) ఒక ప్రేమగల తండ్రిగా యెహోవా మన భవిష్యత్తు అవసరాలన్నిటిని తీర్చే ఏర్పాటు కూడా చేశాడు.
13 మరి ముఖ్యంగా, యెహోవా మన ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తున్నాడు. తన వాక్యంలో తన గురించిన సత్యాన్ని, తన సంకల్పాన్ని, జీవితానికి ఉన్న అర్థాన్ని, భవిష్యత్తులో జరగబోయేదాన్ని వెల్లడిచేశాడు. మనం మొట్టమొదట సత్యం నేర్చుకున్నప్పుడు ఆయన మనపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు; ఆయన గురించి తెలుసుకునేలా సహాయం చేయడానికి మన తల్లిదండ్రుల్ని లేదా మరో వ్యక్తిని ఉపయోగించడం ద్వారా అలా చేశాడు. మనం ఆయన స్నేహితులుగా ఉండేలా సహాయం చేయడానికి సంఘంలోని ప్రేమగల పెద్దలను, పరిణతిగల ఇతర సహోదరసహోదరీలను ఉపయోగిస్తున్నాడు. అంతేకాదు, యెహోవా సంఘ కూటాల ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు; అక్కడ మనం మన సహోదరసహోదరీలతో కలిసి నేర్చుకుంటాం. ఈ విధంగా అలాగే మరితర విధాలుగా యెహోవా మనందరిపట్ల తండ్రిలాంటి శ్రద్ధ చూపిస్తున్నాడు.—కీర్త. 32:8.
14. యెహోవా మనకు ఎందుకు శిక్షణ ఇస్తాడు? దాన్ని ఆయన ఎలా ఇస్తాడు?
14 యెహోవా మనకు శిక్షణ ఇస్తున్నాడు. మనం యేసులా పరిపూర్ణులం కాదు. కాబట్టి మన శిక్షణలో భాగంగా మన పరలోక తండ్రి అవసరమైనప్పుడు మనకు క్రమశిక్షణ ఇస్తాడు. ఆయన వాక్యం మనకు ఇలా గుర్తుచేస్తుంది: “యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు.” (హెబ్రీ. 12:6, 7) యెహోవా మనకు ఎన్నో విధాలుగా క్రమశిక్షణ ఇస్తున్నాడు. ఉదాహరణకు, కొన్నిసార్లు ఆయన వాక్యంలో చదివిన వాటినిబట్టి లేదా కూటాల్లో విన్న వాటినిబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలని గ్రహిస్తాం. లేదా అవసరమైన సహాయం పెద్దలు మనకు అందించవచ్చు. యెహోవా క్రమశిక్షణ ఏ రూపంలో ఇచ్చినా ఆయన దాన్ని ఎప్పుడూ మనమీద ఉన్న ప్రేమతోనే ఇస్తాడు.—యిర్మీ. 30:11.
15. యెహోవా మనల్ని ఏయే విధాలుగా కాపాడతాడు?
15 కష్టాల్లో యెహోవా మనకు మద్దతిస్తాడు. కష్టసమయాల్లో ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలకు మద్దతు ఇచ్చినట్టే మన పరలోక తండ్రి కూడా కష్టాలను తట్టుకోవడానికి మనకు సహాయం చేస్తాడు. ఆధ్యాత్మిక హాని కలగకుండా మనల్ని కాపాడడానికి తన పవిత్రశక్తిని లూకా 11:13) మనం మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు, ఆయన మనకు అద్భుతమైన నిరీక్షణ ఇస్తున్నాడు. భవిష్యత్తుకు సంబంధించిన ఆ నిరీక్షణ కష్టాలను తట్టుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దీన్ని పరిశీలించండి: మనకు ఎలాంటి చెడు సంఘటనలు జరిగినా, మన ప్రేమగల తండ్రి మనం అనుభవించే గాయాల్ని పూర్తిగా మాన్పేస్తాడు. మనం ఎదుర్కొంటున్న ఎలాంటి కష్టమైనా అది తాత్కాలికమే, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వతం.—2 కొరిం. 4:16-18.
ఉపయోగిస్తాడు. (మన ప్రేమగల తండ్రి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు
16. ఆదాము తన ప్రేమగల తండ్రికి అవిధేయత చూపించినప్పుడు ఏం జరిగింది?
16 ఆదాము యెహోవాకు అవిధేయత చూపించినప్పుడు యెహోవా చేసినదాన్ని ఆలోచిస్తే ఆయన ప్రేమకు రుజువును చూస్తాం. ఆదాము తన పరలోక తండ్రికి అవిధేయత చూపించినప్పుడు తను, తన సంతానం యెహోవా సంతోషకరమైన కుటుంబంలో స్థానం పోగొట్టుకున్నారు. (రోమా. 5:12; 7:14) కానీ యెహోవా ఆదాము పిల్లలకు సహాయం చేయడానికి నడుం బిగించాడు.
17. ఆదాము తిరుగుబాటు చేశాక యెహోవా వెంటనే ఏం చేశాడు?
17 యెహోవా ఆదామును శిక్షించాడు; కానీ ఇంకా పుట్టని ఆదాము పిల్లలకు ఏ నిరీక్షణ లేకుండా చేయలేదు. విధేయత చూపించే మనుషులను తన కుటుంబంలోకి మళ్లీ చేర్చుకుంటానని ఆయన వెంటనే వాగ్దానం చేశాడు. (ఆది. 3:15; రోమా. 8:20, 21) యెహోవా తన కుమారుడైన యేసు విమోచనా క్రయధన బలి ఆధారంగా దాన్ని సాధ్యం చేశాడు. తన కుమారుణ్ణి మనకోసం బలి అర్పించడం ద్వారా, యెహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు.—యోహా. 3:16.
18. తన మార్గాల నుండి తప్పిపోయినా యెహోవా మనల్ని తిరిగి ఆహ్వానిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండొచ్చు?
18 మనం అపరిపూర్ణులమైనా, మనం తన కుటుంబంలో ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు; మనం తనకు భారమని ఆయన ఎప్పుడూ అనుకోడు. మనం ఆయన్ని నిరుత్సాహపరుస్తుంటాం లేదా కొంతకాలం ఆయన మార్గాల నుండి తప్పిపోతుంటాం కానీ యెహోవా మన మీద ఎప్పుడూ ఆశలు వదులుకోడు. యెహోవాకున్న తండ్రిలాంటి ప్రేమ ఎంత గాఢమైనదో లూకా 15:11-32) ఆ ఉదాహరణలోని తండ్రి తన కొడుకు తిరిగి వస్తాడనే ఆశను ఎప్పుడూ వదులుకోలేదు. తన కొడుకు ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆయన పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని ఆహ్వానించాడు. మనం యెహోవా మార్గాల నుండి తప్పిపోయినా పశ్చాత్తాపపడితే, మన ప్రేమగల తండ్రి మనల్ని తిరిగి ఆహ్వానించడానికి సిద్ధంగా, సుముఖంగా ఉన్నాడనే నమ్మకంతో ఉండొచ్చు.
వివరించడానికి యేసు తప్పిపోయిన కుమారుని కథ చెప్పాడు. (19. ఆదాము చేసిన నష్టాన్ని యెహోవా ఎలా పూరిస్తాడు?
19 ఆదాము ద్వారా జరిగిన నష్టాన్నంతా మన తండ్రి పూరిస్తాడు. ఆదాము తిరుగుబాటు తర్వాత, మనుషుల్లో నుండి 1,44,000 మందిని దత్తత తీసుకోవాలని యెహోవా నిర్ణయించుకున్నాడు; వాళ్లు తన కుమారునితో పాటు రాజులుగా, యాజకులుగా సేవచేస్తారు. కొత్తలోకంలో, విధేయులైన మానవులు పరిపూర్ణులు అవ్వడానికి యేసు, ఆయన సహ-పరిపాలకులు సహాయం చేస్తారు. విధేయతకు సంబంధించి చివరి పరీక్షలో నెగ్గితే, దేవుడు వాళ్లకు శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు భూమంతా తన పరిపూర్ణ కుమారులతో, కుమార్తెలతో నిండివుండడం చూసి మన తండ్రి సంతోషిస్తాడు. అది ఎంత మహనీయమైన సమయమో కదా!
20. యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని ఏయే విధాలుగా చూపించాడు? తర్వాతి ఆర్టికల్లో మనం ఏం చర్చిస్తాం?
20 యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని చూపించాడు. ఆయన లాంటి తండ్రి ఇంకెవ్వరూ లేరు. ఆయన మన ప్రార్థనలు వింటాడు. మనకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అవసరమైనవి ఇస్తాడు. ఆయన మనకు శిక్షణ ఇస్తాడు, మద్దతిస్తాడు. మన భవిష్యత్తు కోసం ఆయన అద్భుతమైన దీవెనలు దాచివుంచాడు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడని, మనపట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుసుకోవడం మనకు సంతోషాన్నిస్తుంది! ఆయన పిల్లలుగా మనం ఆయన ప్రేమకు కృతజ్ఞత ఎలా చూపించవచ్చో తర్వాతి ఆర్టికల్లో చర్చిస్తాం.
పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ
^ పేరా 5 మనం యెహోవాను తరచూ మన సృష్టికర్తగా, సర్వోన్నత పరిపాలకుడిగా చూస్తాం. కానీ ఆయన్ని ప్రేమగల, శ్రద్ధగల తండ్రిగా చూడ్డానికి మనకు మంచి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేమిటో ఈ ఆర్టికల్లో పరిశీలిస్తాం. యెహోవా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో కూడా తెలుసుకుంటాం.
^ పేరా 59 చిత్రాల వివరణ: నాలుగు చిత్రాల్లో తండ్రి తన బిడ్డతో ఉన్నట్టు చూపించబడింది: ఒక తండ్రి తన కొడుకు చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు, ఒక తండ్రి తన కూతురుకు అవసరమైన వాటిని ఇస్తున్నాడు, ఒక తండ్రి తన కొడుకుకు శిక్షణ ఇస్తున్నాడు, ఒక తండ్రి తన కొడుకును ఓదారుస్తున్నాడు. నాలుగు చిత్రాల వెనుక ఉన్న యెహోవా చెయ్యి, మన విషయంలో ఆయన అదేవిధమైన శ్రద్ధ తీసుకుంటాడని గుర్తుచేస్తుంది.