కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు మాటల అర్థం

విమోచన క్రయధనం చెల్లించక ముందు క్షమాపణ

విమోచన క్రయధనం చెల్లించక ముందు క్షమాపణ

యేసు చెల్లించిన విమోచన క్రయధనం ఆధారంగానే మన పాపాలు క్షమించబడతాయి. (ఎఫె. 1:7) కానీ బైబిలు ఇలా చెప్తుంది: దేవుడు సహనంతో, ‘గతంలో ప్రజలు చేసిన పాపాల్ని క్షమిస్తూ వచ్చాడు,’ అంటే విమోచన క్రయధనం చెల్లించడానికి ముందే యెహోవా అలా క్షమించాడు. (రోమా. 3:25) ఆయన తన న్యాయ ప్రమాణాల్ని పక్కన పెట్టకుండానే దీన్ని ఎలా చేయగలిగాడు?

తన మీద, తన వాగ్దానాల మీద నమ్మకం ఉంచేవాళ్లను కాపాడే ఒక ‘సంతానం’ వస్తుందని యెహోవా మాటిచ్చాడు. ఆ మాట ఇచ్చినప్పుడే యెహోవా దృష్టిలో విమోచన క్రయధనం చెల్లించబడినట్టు. (ఆది. 3:15; 22:18) తను నిర్ణయించిన సమయంలో, తన కుమారుడు విమోచన క్రయధనం ఇవ్వడానికి ఇష్టంగా ముందుకొస్తాడని యెహోవాకు తెలుసు. (గల. 4:4; హెబ్రీ. 10:7-10) యేసు భూమ్మీదున్నప్పుడు విమోచన క్రయధనం చెల్లించడానికి ముందే, ఇతరుల పాపాల్ని క్షమించే అధికారం యెహోవా ఆయనకు ఇచ్చాడు. తన మీద విశ్వాసం ఉంచేవాళ్లందరికీ భవిష్యత్తులో తను చెల్లించబోయే విమోచన క్రయధన విలువను అన్వయించడం ద్వారా యేసు అలా క్షమించాడు.—మత్త. 9:2-6.