అధ్యయనం చేయడానికి ఐడియాలు
అన్యాయాన్ని సహించడం
యోసేపు అన్యాయాన్ని ఎలా సహించాడో తెలుసుకోవడానికి ఆదికాండం 37:23-28; 39:17-23 చదవండి.
సందర్భాన్ని లోతుగా తవ్వడం. వేరేవాళ్లు యోసేపుకు ఎందుకు అన్యాయం చేశారు? (ఆది. 37:3-11; 39:1, 6-10) యోసేపు ఎంతకాలం అన్యాయాన్ని సహించాడు? (ఆది. 37:2; 41:46) ఆ సమయమంతటిలో యోసేపు కోసం యెహోవా ఏం చేశాడు? ఏం చేయలేదు?—ఆది. 39:2, 21; w23.01 17వ పేజీ, 13వ పేరా.
ఇంకాస్త లోతుగా వెళ్లండి. తన మీద పోతీఫరు భార్య నిందవేసినప్పుడు యోసేపు తను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఇక్కడిచ్చిన లేఖనాల్ని బట్టి ఇలా ఆలోచించండి: యోసేపు ఎందుకు మౌనంగా ఉండివుంటాడు? లేదా బైబిలు అన్ని వివరాల్ని చెప్పాలని ఎందుకు ఆశించకూడదు? (సామె. 20:2; యోహా. 21:25; అపొ. 21:37) అన్యాయాన్ని సహించడానికి యోసేపుకు ఏ లక్షణాలు సహాయం చేసుంటాయి?—మీకా 7:7; లూకా 14:11; యాకో. 1:2, 3.
ఏం నేర్చుకోవచ్చు? ఇలా ప్రశ్నించుకోండి:
-
‘యేసు శిష్యునిగా ఉన్నందుకు నేను ఎలాంటి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన రావచ్చు?’ (లూకా 21:12, 16, 17; హెబ్రీ. 10:33, 34.)
-
‘అన్యాయాన్ని సహించడానికి నేను ఇప్పటినుండే ఏం చేయవచ్చు?’ (కీర్త. 62:7, 8; 105:17-19; w19.07 2-7 పేజీలు)