నేడు యెహోవా ఇస్తున్న నిర్దేశం నుండి ప్రయోజనం పొందండి
తెలివైన ఎంపిక చేసుకున్న పోలండ్‌లోని అమ్మాయి
నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను, ఆరునెలల తర్వాత సహాయ పయినీరు సేవ మొదలుపెట్టాను. ఒక సంవత్సరం తర్వాత క్రమ పయినీరు సేవ చేయడానికి అప్లికేషన్ నింపాను. నా స్కూల్ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత, నేను అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి సేవ చేస్తానని అడిగాను. మా సొంత ఊరు నుండి, మా అమ్మమ్మ నుండి దూరంగా వెళ్లాలనుకున్నాను. నేను యెహోవాసాక్షికాని మా అమ్మమ్మతో ఉండేదాన్ని. అయితే, మా ప్రాంతీయ పర్యవేక్షకుడు నన్ను మా ఊరిలోనే సేవ చేయమని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కానీ ఆ విషయం నేను అతనికి తెలియనివ్వలేదు. తల వంచుకొని ప్రాంతీయ పర్యవేక్షకుడు చెప్పిన మాటలు ఆలోచిస్తూ అక్కడనుండి వచ్చేశాను. నాతోపాటు పయినీరు సేవ చేస్తున్న సహోదరితో ఇలా అన్నాను, ‘నేను యోనాలా ప్రవర్తిస్తున్నాను అనుకుంట. కానీ యోనా చివరికి నీనెవె వెళ్లాడు. కాబట్టి నేను కూడా నన్ను ఎక్కడ సేవ చేయమన్నారో అక్కడే సేవ చేస్తాను.’
“నేను నాలుగేళ్లుగా మా ఊరిలోనే పయినీరు సేవ చేస్తున్నాను, ఇచ్చిన నిర్దేశాన్ని పాటించడం ఎంత తెలివైన పనో నాకు అర్థమైంది. నాలో ఉన్న ప్రతికూల దృక్పథమే అసలైన సమస్యగా ఉండేది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్క నెలలోనే 24 బైబిలు స్టడీలు మొదలుపెట్టగలిగాను. ఒకప్పుడు నన్ను వ్యతిరేకించిన మా అమ్మమ్మతో కూడా బైబిలు స్టడీ మొదలుపెట్టగలిగాను. ఆ విషయంలో యెహోవాకు కృతజ్ఞతలు.”
ఫిజిలో వచ్చిన మంచి ఫలితం
ఫిజిలో ఉంటున్న ఓ బైబిలు విద్యార్థి, సమావేశానికి వెళ్లాలా లేదా తన భర్తతో బంధువుల పుట్టిన రోజుకు వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఆమె సమావేశానికి వెళ్లడానికి భర్త ఒప్పుకున్నాడు. అయితే, ఆమె ఆ పార్టీకి తర్వాత వస్తానని తన భర్తకు చెప్పింది. ఆమె సమావేశం నుండి ఇంటికి వచ్చాక, తనకు దేవునితో ఉన్న స్నేహాన్ని పాడుచేసే ఎలాంటి పరిస్థితికైనా దూరంగా ఉండడం మంచిదని ఆమెకు అనిపించింది. అందుకే ఆ పార్టీకి వెళ్లలేదు.
ఇంతలో ఆమె భర్త, తన అనుమతితోనే ఆమె “సాక్షుల మీటింగ్‌కి” వెళ్లిందనీ అది అయిపోయాక పార్టీకి వస్తానందనీ బంధువులతో చెప్పాడు. అప్పుడు వాళ్లు, “ఆమె రాదు. ఎందుకంటే యెహోవాసాక్షులు పుట్టినరోజులు జరుపుకోరు” అని అన్నారు. a
తన భార్య ఆమె నమ్మకాలకు, మనస్సాక్షికి కట్టుబడి సరైన నిర్ణయం తీసుకున్నందుకు అతను చాలా గర్వపడ్డాడు. ఆమె నమ్మకంగా ఉన్నందువల్ల తన భర్తకు అలాగే ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలిగింది. దాని ఫలితం? ఆమె భర్త బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు, ఆమెతోపాటు మీటింగ్స్‌కి కూడా రావడం మొదలుపెట్టాడు.
a 2001, డిసెంబరు 15 కావలికోట సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.