కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాలా కనికరం చూపించండి

యెహోవాలా కనికరం చూపించండి

‘యెహోవా, యెహోవా, ఆయన కరుణ, కనికరం గల దేవుడు.’నిర్గ. 34:6, NW.

పాటలు: 57, 147

1. తాను ఎలాంటివాడినో తెలియజేస్తూ యెహోవా మోషేకు ఏమి చెప్పాడు? అది ఎందుకు ప్రాముఖ్యమైనది?

 యెహోవా ఒక సందర్భంలో, తాను ఎలాంటివాడినో తెలియజేస్తూ తన పేరు గురించి, తనకున్న కొన్ని లక్షణాల గురించి మోషేకు చెప్పాడు. యెహోవా కావాలనుకుంటే తనకున్న శక్తి గురించి లేదా జ్ఞానం గురించి గొప్పగా చెప్పొచ్చు, కానీ ఆయన అన్నిటికన్నా ముందుగా తనకున్న దయ, కనికరం గురించి చెప్పాడు. (నిర్గమకాండము 34:5-7 చదవండి.) యెహోవా తనకు సహాయం చేస్తాడో లేదో మోషే తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే తన సేవకులకు సహాయం చేయాలనే కోరిక ఉందని చూపించడానికి యెహోవా తనకున్న లక్షణాల గురించి ప్రస్తావించాడు. (నిర్గ. 33:13) మనమంటే యెహోవాకు చాలా పట్టింపు ఉందని తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఈ ఆర్టికల్‌లో ముఖ్యంగా కనికరం గురించి పరిశీలిస్తాం. కనికరం అంటే ఇతరులపట్ల సానుభూతి చూపించడం, వాళ్లకు సహాయం చేయాలనే కోరిక కలిగివుండడం.

2, 3. (ఎ) మనుషులు సహజంగానే కనికరం చూపిస్తారని దేన్నిబట్టి చెప్పవచ్చు? (బి) మనం కనికరం గురించి ఎందుకు తెలుసుకోవాలి?

2 యెహోవా కనికరంగల దేవుడు. ఆయన మనుషుల్ని తన స్వరూపంలో సృష్టించాడు. అందుకే యెహోవా అంటే ఎవరో తెలియని ప్రజలు కూడా సహజంగానే ఇతరులపట్ల కనికరం చూపిస్తారు. (ఆది. 1:27) కనికరం చూపించిన ఎంతోమంది గురించి బైబిల్లో చదువుతాం. ఉదాహరణకు, ఒక సందర్భంలో తన దగ్గరకు వచ్చిన ఇద్దరు స్త్రీలలో, బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరో సొలొమోను తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే వాళ్లను పరీక్షించడానికి ఆ బిడ్డను రెండుగా నరకమని ఆజ్ఞాపించాడు. అప్పుడు కన్నతల్లి మమకారంతో తన బిడ్డను రెండో స్త్రీకే ఇచ్చేయమని వేడుకుంది. (1 రాజు. 3:23-27) కనికరం చూపించిన మరో స్త్రీ, ఫరో కూతురు. పసివాడైన మోషే కనిపించినప్పుడు అతను హెబ్రీయుడనీ, అతన్ని ఎవరైనా చూస్తే చంపేస్తారనీ ఆమెకు తెలుసు. కానీ ‘ఆమెకు ఆ బిడ్డ మీద కనికరం కలిగింది,’ అందుకే అతన్ని సొంత కొడుకులా పెంచుకోవాలని నిర్ణయించుకుంది.—నిర్గ. 2:5-6, NW.

3 మనం కనికరం గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మనం తనను అనుకరించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 5:1) కనికరం అనే లక్షణంతో సృష్టించబడినప్పటికీ అపరిపూర్ణులైన మనం స్వార్థంగా ఆలోచించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయాలో లేక మన గురించే ఆలోచించుకోవాలో నిర్ణయించుకోవడం కష్టంగా ఉండవచ్చు. ఇతరులపట్ల మరింత శ్రద్ధ చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది? మొదటిగా, యెహోవా అలాగే ఇతరులు ఎలా కనికరం చూపించారో పరిశీలిద్దాం. రెండవదిగా, దేవుడు చూపించినలాంటి కనికరాన్ని మనమెలా చూపించవచ్చో, అలా చూపించడం మనకెలా మేలు చేస్తుందో పరిశీలిద్దాం.

యెహోవా కనికరం చూపించే విషయంలో పరిపూర్ణ ఆదర్శం

4. (ఎ) యెహోవా తన దూతల్ని సొదొమకు ఎందుకు పంపించాడు? (బి) లోతు కుటుంబానికి ఎదురైన పరిస్థితి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

4 యెహోవా కనికరం చూపించిన ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకు, ఆయన లోతు విషయంలో ఏమి చేశాడో చూడండి. నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లోని ప్రజల అనైతికతను చూసి “చాలా బాధపడ్డాడు.” ఆ ప్రజలకు దేవుడంటే గౌరవం లేదు. అందుకే వాళ్లను నాశనం చేయాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. (2 పేతు. 2:7, 8) సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతాయని, లోతు అక్కడినుండి పారిపోవాలని చెప్పడానికి యెహోవా తన దూతల్ని పంపించాడు. బైబిలు ఇలా చెప్తుంది, ‘లోతు ఆలస్యం చేస్తుండడంతో, అతని మీద యెహోవాకు ఉన్న కనికరం వల్ల, ఆ దేవదూతలు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కూతుళ్ల చేతుల్ని పట్టుకొని వాళ్లను బయటికి తీసుకొచ్చి, నగరం బయట నిలబెట్టారు.’ (ఆది. 19:16, NW) యెహోవా లోతు పరిస్థితిని అర్థంచేసుకున్నట్లే, మనం ఎదుర్కొంటున్న కష్టపరిస్థితుల్ని కూడా అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెష. 63:7-9; యాకో. 5:11, అధస్సూచి; 2 పేతు. 2:9.

5. కనికరాన్ని ఎలా చూపించాలని బైబిలు చెప్తోంది?

5 యెహోవా కనికరం చూపించడం మాత్రమే కాదు, తన ప్రజలు కూడా ఇతరులపట్ల కనికరం చూపించాలని నేర్పించాడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ఒక నియమం గురించి ఆలోచించండి. ఒకవ్యక్తి ఎవరికైనా అప్పు ఇస్తే, హామీగా అతని దగ్గరున్న వస్త్రాన్ని అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకోవచ్చు. (నిర్గమకాండము 22:26, 27 చదవండి.) కానీ ఆ వస్త్రాన్ని సాయంత్రం లోపు తిరిగి ఇచ్చేయాలి, ఎందుకంటే రాత్రి చలిని తట్టుకోవడానికి ఆ వస్త్రం అతనికి ఉపయోగపడుతుంది. కనికరంలేని కొంతమంది ఆ వస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ తన ప్రజలు కనికరాన్ని చూపించాలని యెహోవా నేర్పించాడు. ఈ నియమం వెనుకున్న సూత్రం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? తోటి క్రైస్తవుల అవసరాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కష్టాల్లో ఉన్న సహోదరునికి లేదా సహోదరికి సహాయం చేయగలిగే స్థితిలో మనం ఉంటే తప్పకుండా సహాయం చేయాలి.—కొలొ. 3:12; యాకో. 2:15, 16; 1 యోహాను 3:17 చదవండి.

6. పాపం చేసిన ఇశ్రాయేలీయులపట్ల యెహోవా చూపించిన కనికరం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6 ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు కూడా యెహోవా వాళ్లపట్ల కనికరం చూపించాడు. బైబిలు ఇలా చెప్తుంది, ‘వాళ్ల పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాస స్థలం మీద కనికరపడ్డాడు కాబట్టి ఆయన తన సందేశకుల ద్వారా వాళ్లను హెచ్చరిస్తూ ఉన్నాడు; ఆయన పదేపదే వాళ్లను హెచ్చరించాడు.’ (2 దిన. 36:15, NW) అదేవిధంగా, మనం కూడా యెహోవా గురించి ఇంకా తెలుసుకోని వాళ్లపట్ల కనికరం చూపించాలి. ఎందుకంటే వాళ్లు పశ్చాత్తాపపడి, ఆయనకు స్నేహితులయ్యే అవకాశం ఉంది. రాబోయే తీర్పు రోజున ఎవ్వరూ నాశనం కావడం యెహోవాకు ఇష్టంలేదు. (2 పేతు. 3:9) కాబట్టి ఇంకా సమయం ఉన్నప్పుడే దేవుని హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తూ ఆయన కనికరం నుండి వీలైనంత ఎక్కువమంది ప్రయోజనం పొందేలా సహాయం చేయాలి.

7, 8. యెహోవా తమపట్ల కనికరం చూపించాడని ఓ కుటుంబం ఎందుకు నమ్మింది?

7 నేడు, చాలామంది యెహోవా సేవకులు ఆయన కనికరాన్ని రుచిచూశారు. ఉదాహరణకు, 1990లలో బోస్నియా దేశంలోని వివిధ తెగల మధ్య గొడవలు, హత్యలు జరిగాయి. మలాన్‌  a అనే 12 ఏళ్ల అబ్బాయి, అతని కుటుంబం ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. మలాన్‌, అతని తమ్ముడు, అమ్మానాన్నలు, తోటి సహోదరసహోదరీలు అందరూ కలిసి సర్బియాలో జరిగే సమావేశానికి బస్సులో వెళ్తున్నారు. ఆ సమావేశంలోనే మలాన్‌ వాళ్ల అమ్మానాన్నలు బాప్తిస్మం తీసుకోబోతున్నారు. అయితే ఆ దేశ సరిహద్దు దగ్గర కొంతమంది సైనికులు మలాన్‌ కుటుంబం వేరే జాతికి చెందినవాళ్లని గుర్తుపట్టి, వాళ్లను బస్సు నుండి దింపేశారు. కానీ మిగతా సహోదరులను వెళ్లనిచ్చారు. రెండు రోజులపాటు సైనికులు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. చివరికి అక్కడి అధికారి, ఉన్నతాధికారిని పిలిచి వీళ్లను ఏమి చేయమంటారని అడిగాడు. “బయటకు తీసుకెళ్లి కాల్చి చంపేయండి!” అని ఆ అధికారి చెప్పడం అక్కడే ఉన్న మలాన్‌ కుటుంబం చెవినపడింది.

8 సైనికులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు అపరిచితులు మలాన్‌ కుటుంబం దగ్గరకు వచ్చారు. తాము కూడా యెహోవాసాక్షులమేననీ, జరిగిందంతా బస్సులో ఉన్న సహోదరులు చెప్పారనీ అన్నారు. సైనికులు పిల్లల దగ్గరుండే ఆధారాల్ని పరిశీలించట్లేదు కాబట్టి సరిహద్దు దాటేందుకు మలాన్‌ని, అతని తమ్ముణ్ణి తమ కారులో ఎక్కమని ఆ ఇద్దరు సాక్షులు చెప్పారు. తర్వాత మలాన్‌ వాళ్ల అమ్మానాన్నల్ని మెల్లగా సరిహద్దు వెనకనుండి అవతలి వైపుకు రమ్మని ఆ ఇద్దరు సాక్షులు చెప్పారు. మలాన్‌కు చాలా భయమేసింది, ఆ పరిస్థితిలో నవ్వాలో ఏడ్వాలో అతనికి తెలియలేదు. అతని అమ్మనాన్నలు ఆ సహోదరుల్ని ఇలా అడిగారు, “వాళ్లు మమ్మల్ని వెళ్లనిస్తారని అనుకుంటున్నారా?” కానీ వాళ్లు అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లినప్పుడు సైనికులు అసలు వాళ్లను గమనించనే లేదు. మలాన్‌, అతని తమ్ముడు వాళ్ల అమ్మానాన్నల్ని సరిహద్దు అవతల కలుసుకుని, అందరూ కలిసి సమావేశానికి వెళ్లారు. యెహోవా తమ ప్రార్థనలకు జవాబిచ్చాడని వాళ్లకు అనిపించింది. యెహోవా అన్నిసార్లూ తన సేవకుల్ని అలా అద్భుతరీతిలో కాపాడడని బైబిలు చెప్తుంది. (అపొ. 7:58-60) కానీ ఈ సందర్భంలో మలాన్‌ ఇలా అన్నాడు, “దేవదూతలు సైనికుల కళ్లు కప్పినట్లు అనిపించింది, యెహోవాయే మమ్మల్ని కాపాడాడు.”—కీర్త. 97:10.

9. తనను వెంబడించే ప్రజలపట్ల యేసుకు ఎలాంటి వైఖరి ఉండేది? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 కనికరం చూపించే విషయంలో యేసు చక్కని ఆదర్శం. ఆయన ప్రజలపట్ల కనికరాన్ని చూపించాడు, “ఎందుకంటే వాళ్లు చర్మం ఒలిచేయబడి, విసిరేయబడిన కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.” కాబట్టి యేసు ఏమి చేశాడు? ఆయన “వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.” (మత్త. 9:36; మార్కు 6:34 చదవండి.) మరోవైపు, పరిసయ్యులు అస్సలు కనికరం చూపించేవాళ్లు కాదు, ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశం కూడా వాళ్లకు ఉండేది కాదు. (మత్త. 12:9-14; 23:4; యోహా. 7:49) యేసులా మీరూ ప్రజలకు సహాయం చేయాలని, వాళ్లకు యెహోవా గురించి బోధించాలని కోరుకుంటున్నారా?

10, 11. మనం ప్రతీ సందర్భంలో కనికరం చూపించాలా? వివరించండి.

10 అయితే మనం ప్రతీ సందర్భంలో కనికరం చూపించాలని కాదు. ఉదాహరణకు రాజైన సౌలు చేసినదాన్ని పరిశీలించండి. అమాలేకీయుల రాజూ, దేవుని ప్రజల శత్రువూ అయిన అగగును చంపకుండా కనికరం చూపిస్తున్నానని సౌలు అనుకునివుంటాడు. అంతేకాదు సౌలు అమాలేకీయుల పశువులన్నిటినీ చంపలేదు. కానీ అమాలేకీయులందర్నీ, వాళ్ల పశువులన్నిటినీ చంపమని యెహోవా సౌలుకు చెప్పాడు. సౌలు ఆ మాటవినలేదు కాబట్టి యెహోవా అతన్ని రాజుగా తిరస్కరించాడు. (1 సమూ. 15:3, 9, 15) యెహోవా నీతిమంతుడైన న్యాయాధిపతి, ప్రజల హృదయాలను ఆయన చదవగలడు, ఎప్పుడు కనికరం చూపించాలో ఆయనకు బాగా తెలుసు. (విలా. 2:17; యెహె. 5:11) తనకు విధేయత చూపించని వాళ్లందర్నీ యెహోవా త్వరలోనే నాశనం చేస్తాడు. (2 థెస్స. 1:6-10) ఆ సమయంలో ఆయన దుష్టులపై కనికరం చూపించడు. బదులుగా, దుష్టులను నాశనం చేయడం ద్వారా నీతిమంతుల పట్ల కనికరం చూపిస్తాడు, వాళ్లను కాపాడతాడు.

11 నిజానికి ఎవరు బ్రతికివుండాలో, ఎవరు చనిపోవాలో తీర్పుతీర్చడం మన పనికాదు. బదులుగా, ప్రజలకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. అయితే ఇతరులపట్ల కనికరం చూపించే కొన్ని మార్గాలు ఏమిటి? దానికి సంబంధించిన కొన్ని సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనమెలా కనికరం చూపించవచ్చు?

12. ఇతరులపట్ల మనమెలా కనికరం చూపించవచ్చు?

12 రోజూవారి పనుల్లో సహాయం చేయండి. ఇరుగుపొరుగు వాళ్లపట్ల, తోటి సహోదరులపట్ల క్రైస్తవులు కనికరం చూపించాలని యెహోవా ఆశిస్తున్నాడు. (యోహా. 13:34, 35; 1 పేతు. 3:8) కనికరానికి ఉన్న ఒక అర్థమేమిటంటే, “బాధను పంచుకోవడం.” అవును, కనికరంగల వ్యక్తి కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయగల అవకాశాల కోసం చూడాలి, బహుశా వాళ్ల రోజూవారి పనుల్లో మనం సహాయం చేయవచ్చు.—మత్త. 7:12.

ఇతరులకు అవసరమైన సహాయం చేయడం ద్వారా వాళ్లపట్ల కనికరం చూపించండి (12వ పేరా చూడండి)

13. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు యెహోవాసాక్షులు ఏమి చేస్తారు?

13 విపత్తు సహాయక పనులు చేయండి. ఏదైనా విపత్తువల్ల కష్టాలు పడుతున్న వాళ్లపట్ల మనం కనికరం చూపించాలనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు సహాయం చేస్తారనే మంచిపేరు యెహోవాసాక్షులకు ఉంది. (1 పేతు. 2:17) ఉదాహరణకు, జపాన్‌లో ఒక సహోదరి ఉంటున్న చోట 2011⁠లో భూకంపం, సునామీ వచ్చాయి. ఆ విపత్తు వల్ల పాడైన ఇళ్లను, రాజ్యమందిరాలను బాగుచేయడానికి జపాన్‌ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అలాగే వేరే దేశాలనుండి స్వచ్ఛందంగా వచ్చినవాళ్లను చూసి “చాలా ప్రోత్సాహం, ఓదార్పు” పొందానని ఆమె చెప్పింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, “యెహోవా అలాగే తోటిసాక్షులు ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తారని, భూవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సహోదరసహోదరీలు మాకోసం ప్రార్థిస్తున్నారని గుర్తించగలిగాను.”

14. అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు?

14 అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లకు సహాయం చేయండి. ప్రజలు అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడడం చూసినప్పుడు మనకు జాలేస్తుంది. ఈ సమస్యలన్నీ లేకుండా పోయే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాం, అందుకే దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తాం. ఈలోగా అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం. వృద్ధాప్యంతో అలాగే అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న తన తల్లి ఓ రోజు ఒంటి మీదున్న బట్టల్ని బాగా మురికి చేసుకుందని ఒక రచయిత చెప్పాడు. ఆమె బట్టల్ని శుభ్రం చేసుకుంటున్నప్పుడు వాళ్ల ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. ఆమె దగ్గరకు ఎప్పుడూ వచ్చే ఇద్దరు సాక్షులు వచ్చారు. బట్టలు శుభ్రం చేసుకుంటున్న ఆమెను చూసి ఆ ఇద్దరు సహోదరీలు సహాయం చేస్తామని అడిగారు. ఆ రచయిత తల్లి, “కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ పర్వాలేదు సహాయం చేయండి” అని అంది. సహోదరీలు ఆమెకు సహాయం చేశారు. తర్వాత ఆమె కోసం టీ పెట్టి, కాసేపు మాట్లాడుకున్నారు. అలా చేసినందుకు ఆ రచయిత ఎంతో కృతజ్ఞతతో, యెహోవాసాక్షులు “ఏమి చెప్తారో అదే చేస్తారు” అని అన్నాడు. అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లపట్ల కనికరంతో సహాయం చేయడానికి మీరు చేయగలిగినదంతా చేయాలని మీకు అనిపిస్తుందా?—ఫిలి. 2:3, 4.

15. మన పరిచర్య ఇతరులకు ఎలా సహాయం చేస్తుంది?

15 యెహోవాను తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయండి. ప్రజలకు మనం సహాయం చేయగల శ్రేష్ఠమైన మార్గమేమిటంటే, వాళ్లకు దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి బోధించడమే. మరో మార్గమేమిటంటే, యెహోవా పెట్టిన ప్రమాణాల్ని పాటించడం మంచిదని అర్థంచేసుకునేలా సహాయం చేయడం. (యెష. 48: 17, 18) యెహోవాను ఘనపర్చడానికి, ఇతరులపట్ల కనికరం చూపించడానికి పరిచర్య అద్భుతమైన మార్గం. కాబట్టి మీరు మరింత ఎక్కువగా పరిచర్య చేయగలరా?—1 తిమో. 2:3, 4.

కనికరం చూపించడం మీకు మేలు చేస్తుంది

16. కనికరం చూపించడం మనకు ఎందుకు మంచిది?

16 కనికరం చూపించడం ద్వారా మన ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు బలపడతాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసినప్పుడు మీ సంతోషం రెట్టింపు అవుతుంది, మరింత ఆశాజనకంగా ఉంటారు, ఒంటరితనం దూరమౌతుంది, ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. కనికరం చూపించడం మీకే మంచిది. (ఎఫె. 4:31, 32) ప్రేమతో ఇతరులకు సహాయం చేస్తే మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది, ఎందుకంటే అలాచేస్తే యెహోవా కోరేది చేసినట్లు అవుతుంది. కనికరం చూపించినప్పుడు మనం మంచి తల్లిదండ్రుల్లా, మంచి వివాహజతలా, మంచి స్నేహితుల్లా ఉండడానికి వీలౌతుంది. అంతేకాదు, కనికరం చూపించేవాళ్లకు ఇతరులు కూడా అవసరమైనప్పుడు సహాయం చేస్తారు.—మత్తయి 5:7; లూకా 6:38 చదవండి.

17. మీరెందుకు కనికరం చూపించాలనుకుంటున్నారు?

17 కేవలం మనకు మంచి జరుగుతుందనే స్వార్థంతోనే ఇతరులపట్ల కనికరం చూపిస్తామని కాదు. మనం యెహోవాను అనుకరించాలనుకుంటాం, ఆయనకు ఘనత తీసుకురావాలనుకుంటాం కాబట్టి కనికరం చూపిస్తాం. యెహోవాయే ప్రేమకు, కనికరానికి మూలం. (సామె. 14:31) ఆయన మనకు పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు కాబట్టి యెహోవాను అనుకరిస్తూ కనికరం చూపించడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం. అప్పుడు మనం తోటి సహోదరసహోదరీలకు మరింత దగ్గరౌతాం, మన చుట్టూ ఉన్నవాళ్లతో మంచి సంబంధాలు కలిగివుంటాం.—గల. 6:10; 1 యోహా. 4:16.

a అసలు పేర్లు కావు.