కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశోధన చేయడానికి చిట్కా

పరిశోధన చేయడానికి చిట్కా

పిల్లల కోసం

యెహోవా గురించి పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత అమ్మానాన్నలకు ఉంది. (ఎఫె. 6:4) అమ్మానాన్నలకు సహాయం చేయడానికి యెహోవా సంస్థ చాలా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీ పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చు?

  • సమాచారం వెతకండి. JW.ORGలో పిల్లల కోసం, టీనేజర్ల కోసం వీడియోలు, యాక్టివిటీలు కోకొల్లలు. a వాటిని వెతకడానికి, “వెతుకు” అనే బాక్సులో “పిల్లలు” లేదా “టీనేజర్లు” అని టైప్‌ చేయండి.

  • మీ పిల్లలకు సరిపోయే వాటిని ఎంచుకోండి. దానికోసం “పిల్లలు” అనే సెక్షన్‌ కిందున్న సమాచారాన్ని చూడండి. లేదా, “వెతుకు” అనే బాక్సులో “కుటుంబ ఆరాధన కోసం” అని టైప్‌ చేయండి.

  • యాక్టివిటీలను మీ పిల్లలతో కలిసి చేయండి. కేవలం మీ పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి, లేదా వాళ్ల ధ్యాసను పక్కకు మళ్లించడానికి వాటిని ఉపయోగించకండి. బదులుగా వాటిని వాళ్లతో చర్చించి, వాళ్లకూ-యెహోవాకూ మధ్య స్నేహం ఏర్పడేలా చేయండి.

a ప్రస్తుతం JW లైబ్రరీలో పిల్లల కోసం, టీనేజర్ల కోసం అన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ యాక్టివిటీలు కొన్నే ఉన్నాయి.