అధ్యయన ఆర్టికల్ 52
మీరు నిరుత్సాహంతో పోరాడగలరు
“నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు.”—కీర్త. 55:22.
పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి
ఈ ఆర్టికల్‌లో . . . *
1. నిరుత్సాహం వల్ల ఏం జరగవచ్చు?
ప్రతీరోజు మనం సమస్యల్ని ఎదుర్కొంటాం, వాటితో పోరాడడానికి శాయశక్తులా కృషిచేస్తాం. సమస్యలతో ఎప్పుడు సరిగ్గా పోరాడగలం, నిరుత్సాహంలో ఉన్నప్పుడా? నిరుత్సాహంలో లేనప్పుడా? నిరుత్సాహంలో లేనప్పుడే అని మీరు ఒప్పుకుంటారు. నిరుత్సాహం అనేది పిలవకుండానే వచ్చే అతిథి లాంటిదనీ అది మన నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని దోచుకెళ్లవచ్చనీ మనం గుర్తుంచుకోవాలి. సామెతలు 24:10 లో ఇలా ఉంది: “కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే నీ శక్తి తగ్గిపోతుంది.” నిరుత్సాహం మన శక్తిని తినేస్తుంది, దానివల్ల సమస్యలతో పోరాడడానికి కావల్సిన బలం మన దగ్గర ఉండకపోవచ్చు.
2. ఎలాంటి విషయాల వల్ల మనం నిరుత్సాహపడవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
2 చాలా విషయాల వల్ల మనకు నిరుత్సాహం కలగవచ్చు. ఉదాహరణకు, మన పొరపాట్లు, బలహీనతలు, అనారోగ్య సమస్యలు, యెహోవా సేవలో మనం కోరుకున్న నియామకం రాకపోవడం, మన ప్రాంతంలోని ప్రజలు రాజ్య సందేశాన్ని వినకపోవడం వంటివి. నిరుత్సాహం నుండి బయటపడడానికి మనం చేయగల కొన్ని పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
మన పొరపాట్లు, బలహీనతలు
3. మన గురించి, మన పొరపాట్ల గురించి సరిగ్గా ఆలోచించడానికి ఏది సహాయం చేస్తుంది?
3 మన గురించి, మన పొరపాట్ల గురించి మనం అతిగా బాధపడే అవకాశం ఉంది. మనం చేసే పొరపాట్లను బట్టి యెహోవా మనల్ని కొత్తలోకంలోకి తీసుకెళ్లడని కూడా మనకు అనిపించవచ్చు. కానీ అలా ఆలోచించడం ప్రమాదకరం. మరి మన పొరపాట్ల గురించి ఎలా భావించాలి? యేసుక్రీస్తు తప్ప మనుషులందరూ “పాపం చేశారు” అని బైబిలు చెప్తోంది. (రోమా. 3:23) యెహోవా మన పొరపాట్ల మీద మనసుపెట్టడు లేదా మన నుండి పరిపూర్ణతను ఆశించడు. బదులుగా ఒక ప్రేమగల తండ్రిలా ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు, మన విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. బలహీనతలతో పోరాడడానికి, మన గురించి మనం సరిగ్గా ఆలోచించడానికి ఎంత కృషి చేస్తున్నామో ఆయన గమనిస్తున్నాడు. అంతేకాదు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.—రోమా. 7:18, 19.
4-5. మొదటి యోహాను 3:19, 20 ప్రకారం, నిరుత్సాహం నుండి బయటపడడానికి ఇద్దరు సహోదరీలకు ఏది సహాయం చేసింది?
4 దెబోరా, మరీయల * అనుభవాలు పరిశీలించండి. చిన్నప్పుడు దెబోరా కుటుంబ సభ్యులు ఆమెను ప్రేమగా చూసుకునే వాళ్లు కాదు, అస్సలు మెచ్చుకునే వాళ్లు కాదు. దానివల్ల వయసు పెరుగుతుండగా ఆమె తనమీద తాను ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకుంది. ఒక చిన్న పొరపాటు చేసినా, ఇక తాను ఏదీ సరిగ్గా చేయలేనని అనుకునేది. మరీయకు కూడా అలాంటి సమస్యే ఉంది. ఆమె బంధువులు ఆమెను హీనంగా చూసేవాళ్లు. దానివల్ల తాను ఎందుకూ పనికిరానిదాన్ని అనే భావాలతో ఆమె నలిగిపోయేది. సత్యంలోకి వచ్చాక, దేవుని పేరు ధరించే అర్హత కూడా తనకు లేదు అనుకుంది.
5 అయినా దెబోరా, మరీయ యెహోవాను సేవించడం ఆపలేదు. నిరుత్సాహం నుండి బయటపడడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది? వాళ్లు పట్టుదలగా ప్రార్థించడం ద్వారా తమ భారాన్ని యెహోవా మీద వేశారు. (కీర్త. 55:22) జీవితంలోని చేదు అనుభవాల వల్లే తమలో ఇలాంటి భావాలు ఉన్నాయనే విషయం యెహోవాకు తెలుసని వాళ్లు గ్రహించారు. మనలో మనం చూడలేని మంచి లక్షణాల్ని కూడా యెహోవా చూడగలడని వాళ్లు అర్థం చేసుకున్నారు.—1 యోహాను 3:19, 20 చదవండి.
6. గతంలో చేసిన తప్పునే మళ్లీ చేసినప్పుడు ఒక వ్యక్తికి ఎలా అనిపించవచ్చు?
6 ఒక వ్యక్తి తనలో బలంగా పాతుకుపోయిన చెడు అలవాటును మానుకోవడానికి కృషి చేస్తుండవచ్చు. అయితే ఆ తప్పును మళ్లీ చేసి నిరుత్సాహపడుతుండవచ్చు. ఏదైనా పాపం చేసినప్పుడు అపరాధ భావాలు కలగడం సహజమే. (2 కొరిం. 7:10) అయితే, విపరీతమైన అపరాధ భావాలతో నలిగిపోతూ ‘నేను ఎందుకూ పనికిరాను, యెహోవా ఎప్పటికీ నన్ను క్షమించడు’ అని మనల్ని మనం నిందించుకోకూడదు. ఎందుకంటే అలాంటి ఆలోచన సరైనది కాదు, దానివల్ల మనం యెహోవా సేవను ఆపేసే ప్రమాదం ఉంది. సామెతలు 24:10 ఏం చెప్తుందో గుర్తుందా? నిరుత్సాహపడితే మన శక్తి తగ్గిపోతుంది. యెహోవాకు ప్రార్థించడం ద్వారా, క్షమించమని అడగడం ద్వారా మీ ‘వివాదాన్ని పరిష్కరించుకోండి.’ (యెష. 1:18) మీరు నిజంగా పశ్చాత్తాపపడితే యెహోవా క్షమిస్తాడు. సంఘపెద్దల సహాయం కూడా తీసుకోండి. దేవునితో తిరిగి మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి వాళ్లు మీకు ఓపిగ్గా సహాయం చేస్తారు.—యాకో. 5:14, 15.
7. ఏదైనా బలహీనతతో పోరాడుతున్నప్పుడు మనం ఎందుకు నిరుత్సాహపడకూడదు?
7 ఫ్రాన్స్‌లోని జీన్-లూక్ అనే సంఘపెద్ద బలహీనతలతో పోరాడేవాళ్లకు ఈ మాట చెప్తున్నాడు: రోమా. 7:21-25) కాబట్టి మీరు ఏదైనా బలహీనతతో పోరాడుతుంటే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మనందరం పొరపాట్లు చేస్తాం, కాబట్టి విమోచన క్రయధనం ద్వారా దేవుని అపారదయ మనందరికీ అవసరం.—ఎఫె. 1:7; 1 యోహా. 4:10.
“యెహోవా దృష్టిలో నీతిమంతుడు అంటే ఎన్నడూ తప్పు చేయని వ్యక్తి కాదుగానీ తప్పు చేసినా పశ్చాత్తాపపడి, క్షమించమని దేవున్ని వేడుకునే వ్యక్తి.” (8. నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం ఎవరి సహాయం తీసుకోవచ్చు?
8 సంఘంలోని సహోదర సహోదరీల నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు! మనం ఏదైనా చెప్పుకుంటున్నప్పుడు వాళ్లు శ్రద్ధగా వింటారు, ఊరటనిచ్చేలా మాట్లాడతారు. (సామె. 12:25; 1 థెస్స. 5:14) నిరుత్సాహంతో పోరాడిన నైజీరియాలోని జాయ్ అనే సహోదరి ఇలా అంటోంది: “సహోదర సహోదరీలు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. యెహోవా నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు అనడానికి వాళ్లే రుజువు. వాళ్లు ఇచ్చిన మద్దతు వల్ల నేను కూడా నిరుత్సాహంలో ఉన్నవాళ్లను ప్రోత్సహించగలుగుతున్నాను.” అయితే మనకు ఎప్పుడు ప్రోత్సాహం అవసరమో అన్నిసార్లూ మన సహోదరులకు తెలియకపోవచ్చని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనమే అనుభవంగల సహోదర సహోదరీల దగ్గరికి వెళ్లి, మనకు సహాయం అవసరమని చెప్పాల్సి రావచ్చు.
అనారోగ్య సమస్యలు
9. కీర్తన 41:3; 94:19 మనల్ని ఎలా ప్రోత్సహిస్తాయి?
9 యెహోవా సహాయం తీసుకోండి. మనకు ఒంట్లో బాలేనప్పుడు, మరిముఖ్యంగా ఏదైనా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేకపోవచ్చు. యెహోవా మనల్ని అద్భుతరీతిలో బాగుచేయకపోయినా మనల్ని ఓదార్చగలడు, ఆ సమస్యను తట్టుకోవడానికి కావల్సిన శక్తిని ఇవ్వగలడు. (కీర్తన 41:3; 94:19 చదవండి.) ఉదాహరణకు ఇంటి పనుల్లో, సరుకులు కొనడంలో మనకు సహాయం చేసేలా తోటి క్రైస్తవుల్ని ఆయన కదిలించగలడు. మన సహోదరులు మనతో కలిసి ప్రార్థించేలా ఆయన వాళ్లను పురికొల్పగలడు. లేదా దేవుని వాక్యంలోని ఓదార్పుకరమైన విషయాల్ని మనకు గుర్తుచేయగలడు. ఉదాహరణకు మనకున్న అద్భుతమైన నిరీక్షణను, అంటే కొత్తలోకంలో అనారోగ్యం, నొప్పి లేని పరిపూర్ణ జీవితాన్ని మనకు గుర్తుచేయగలడు.—రోమా. 15:4.
10. నిరుత్సాహంలోనే ఉండిపోకుండా ఈసాంగ్‌కు ఏది సహాయం చేసింది?
10 నైజీరియాలో నివసించే ఈసాంగ్‌కు ఒక ఆక్సిడెంట్ వల్ల కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇక ఆయన ఎప్పటికీ నడవలేడని డాక్టర్ చెప్పాడు. అప్పుడు “నా మనసు విరిగిపోయినట్టు అనిపించింది, నేను చాలా నిరుత్సాహపడ్డాను” అని ఈసాంగ్ అంటున్నాడు. మరి ఆయన నిరుత్సాహంలోనే ఉండిపోయాడా? లేదు. ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయన ఇలా వివరిస్తున్నాడు: “నేను, నా భార్య యెహోవాకు ప్రార్థించడం, బైబిలు చదవడం ఎన్నడూ మానలేదు. యెహోవా మాకు చేస్తున్న మేలుల మీద, కొత్తలోకంలో జీవించే నిరీక్షణ మీద మనసుపెట్టాలని మేము నిర్ణయించుకున్నాం.”
11. తీవ్రమైన అనారోగ్యంలో కూడా సిండీ ఆనందంగా ఎలా ఉండగలిగింది?
11 మెక్సికోలో ఉంటున్న సిండీ అనే సహోదరికి ఒక ప్రాణాంతకమైన జబ్బు ఉందని తేలింది. మరి ఆ సమస్యను ఆమె ఎలా తట్టుకోగలిగింది? చికిత్స తీసుకునే సమయంలో ప్రతీరోజు ఒక్కరికైనా సాక్ష్యమివ్వాలనే లక్ష్యం ఆమె పెట్టుకుంది. ఆమె ఇలా రాసింది: “దానివల్ల నా ఆపరేషన్ గురించి, నొప్పి గురించి, అనారోగ్యం గురించి ఆలోచించే బదులు ఇతరుల మీద మనసుపెట్టగలిగాను. నేను ఇలా సాక్ష్యమిచ్చేదాన్ని: డాక్టర్లతో లేదా నర్సులతో మాట్లాడేటప్పుడు వాళ్ల కుటుంబం గురించి అడిగేదాన్ని. ఆ తర్వాత ఇంత కష్టమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నారో అడిగేదాన్ని. అలా మాట్లాడడం వల్ల వాళ్లకు ఏ విషయాలు ఆసక్తిగా అనిపిస్తాయో నాకు అర్థమయ్యేది. డాక్టర్ల, నర్సుల సామె. 15:15.
బాగోగుల గురించి పేషెంట్లు అడగడం అరుదని చాలామంది నాతో అన్నారు. తమ గురించి ఆలోచిస్తున్నందుకు నాకు థాంక్స్ చెప్పారు. కొంతమంది తమ అడ్రస్, ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ కష్టమైన సమయంలో యెహోవా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చాడంటే, అది నాకే ఆశ్చర్యమనిపించింది!”—12-13. అనారోగ్యంతో ఉన్నవాళ్లు లేదా వృద్ధులు ఏ విధంగా పరిచర్య చేయగలిగారు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
12 అనారోగ్యంతో ఉన్నవాళ్లు లేదా వృద్ధులు పరిచర్యను ఎక్కువగా చేయలేకపోతున్నామని నిరుత్సాహపడుతుండవచ్చు. అయినా చాలామంది ప్రకటించడానికి కృషిచేస్తున్నారు. అమెరికాలోని లారెల్ అనే సహోదరి 37 సంవత్సరాల పాటు ఐరన్-లంగ్ అనే మెషిన్‌లో ఉండాల్సి వచ్చింది! శ్వాస తీసుకోవాలంటే ఆమె ఆ మెషిన్‌లోనే పడుకుని ఉండాలి. అంతేకాదు ఆమెకు క్యాన్సర్ కూడా వచ్చింది, చాలా ఆపరేషన్‌లు జరిగాయి, చర్మ వ్యాధులు వచ్చాయి. కానీ అవేవీ ఆమెను ప్రకటించకుండా ఆపలేకపోయాయి. తన ఇంటికి వచ్చే నర్సులకు, వైద్య సిబ్బందికి ఆమె సాక్ష్యమిచ్చింది. ఫలితంగా, యెహోవా గురించి తెలుసుకునేలా ఆమె 17 కన్నా ఎక్కువమందికి సహాయం చేసింది! *
13 తమ ఇంటికి లేదా హాస్పిటల్‌కు పరిమితమైన వాళ్లకు ఫ్రాన్స్‌లోని రిచర్డ్ అనే సంఘపెద్ద మంచి సలహా ఇస్తున్నాడు: “వాళ్లు మన పుస్తకాల్ని, పత్రికల్ని అందరికీ కనిపించేలా పెట్టుకోవచ్చు. ఎవరైనా అటుగా వెళ్తున్నప్పుడు వాటిని చూసి, వాటి గురించి అడగవచ్చు. ఇంటింటి పరిచర్య చేయలేని మన ప్రియ సహోదర సహోదరీలకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.” ఇంటికే పరిమితమైన వాళ్లు ఉత్తరాల ద్వారా, టెలిఫోన్ ద్వారా కూడా సాక్ష్యమివ్వవచ్చు.
కోరుకున్న నియామకం దొరకకపోవడం
14. రాజైన దావీదు మనకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?
14 వయసు, అనారోగ్యం లేదా ఇతర కారణాల్ని బట్టి సంఘంలో, సర్క్యూట్‌లో మనం కోరుకున్న నియామకాలు మనకు దొరకకపోవచ్చు. మీ పరిస్థితీ అదే అయితే, మీరు రాజైన దావీదును ఆదర్శంగా తీసుకోవచ్చు. దావీదు యెహోవా మందిరాన్ని కట్టాలని ఎంతగానో కోరుకున్నాడు. కానీ దాన్ని కట్టడానికి దేవుడు వేరే వ్యక్తిని ఎంచుకున్నాడని తెలిసినప్పుడు, దావీదు ఆ వ్యక్తికి పూర్తి మద్దతు ఇచ్చాడు. అంతేకాదు నిర్మాణ పనికి పెద్దమొత్తంలో బంగారాన్ని, వెండిని విరాళంగా ఇచ్చాడు. దావీదు మనకు ఎంత చక్కని ఆదర్శమో కదా!—2 సమూ. 7:12, 13; 1 దిన. 29:1, 3-5.
15. హ్యూగ్స్ అనే సహోదరుడు నిరుత్సాహం నుండి ఎలా బయటపడగలిగాడు?
15 ఫ్రాన్స్‌లోని హ్యూగ్స్ అనే సహోదరుడు అనారోగ్య సమస్యల వల్ల సంఘపెద్దగా సేవచేయడం ఆపేశాడు. ఆఖరికి ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడం కూడా ఆయనకు కష్టమైపోయింది. ఆయన ఇలా రాశాడు: “మొదట్లో, ఇక నేను ఏ పనీ చేయలేనని న్యాయా. 8:4.
అనుకున్నాను, నేను బాగా నిరుత్సాహానికి గురయ్యాను. అయితే కొంతకాలానికి, నా పరిమితుల్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నాను. ఈ పరిస్థితిలో కూడా యెహోవా సేవలో నేను చేయగలిగింది చేసి ఆనందిస్తున్నాను, పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. గిద్యోను, అతని 300 మందిలాగే అలసిపోయినా నా పోరాటాన్ని కొనసాగిస్తాను.”—16. దేవదూతల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
16 నమ్మకమైన దేవదూతలు మనకు మంచి ఆదర్శం. ఉదాహరణకు, ‘దుష్టరాజైన అహాబును ఎలా వెర్రివాణ్ణి చేయవచ్చు?’ అని యెహోవా అడిగినప్పుడు, దేవదూతలు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చెప్పారు. వాళ్లలో ఒక దేవదూత చెప్పిన ఆలోచన బాగుందని, అది తప్పకుండా సఫలమౌతుందని యెహోవా అన్నాడు. (1 రాజు. 22:19-22) మరి అప్పుడు నమ్మకమైన మిగతా దేవదూతలు నిరుత్సాహపడిపోయి, ‘అనవసరంగా నా సమయం వృథా చేసుకుని, సలహా ఇచ్చాను’ అని అనుకున్నారా? లేదు, వాళ్లలా అనుకోలేదు. దేవదూతలు వినయస్థులు, వాళ్లు ఘనతంతా యెహోవాకే చెందాలని కోరుకుంటారు.—న్యాయా. 13:16-18; ప్రక. 19:10.
17. యెహోవా సేవలో కొన్ని నియామకాలు దొరకనప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి?
17 యెహోవా పేరును ధరించడం, ఆయన రాజ్యం గురించి ప్రకటించడం ఒక గొప్ప గౌరవం అని గుర్తుంచుకోండి. మనకు ఒక నియామకం రావచ్చు, ఒక నియామకం పోవచ్చు, కానీ యెహోవా దృష్టిలో మనల్ని విలువైనవాళ్లుగా చేసేది నియామకాలు కాదు. వినయం, అణకువ వంటి మంచి లక్షణాలే యెహోవా దృష్టిలో, సహోదర సహోదరీల దృష్టిలో మనల్ని విలువైనవాళ్లుగా చేస్తాయి. కాబట్టి ఎప్పటికీ వినయంగా, అణకువగా ఉండడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. వినయం, అణకువ చూపించిన ఎన్నో బైబిలు ఉదాహరణల గురించి ధ్యానించండి. సహోదర సహోదరీలకు ఇష్టపూర్వకంగా సేవచేయడానికి మీరు ఏం చేయగలరో అది చేయండి.—కీర్త. 138:6; 1 పేతు. 5:5.
ఫలితాలు అంతగా రాని ప్రాంతంలో ప్రకటించడం
18-19. ఫలితాలు అంతగా రావట్లేదని అనిపించినా పరిచర్యలో ఆనందాన్ని ఎలా పొందవచ్చు?
18 మీ ప్రాంతంలోని ప్రజలు రాజ్య సందేశాన్ని వినట్లేదని లేదా కొంతమంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నారని మీరెప్పుడైనా నిరుత్సాహపడ్డారా? అలాంటి పరిస్థితిలో మన ఆనందాన్ని కాపాడుకోవడానికి లేదా పెంచుకోవడానికి ఏం చేయవచ్చు? “ పరిచర్యలో ఎక్కువ ఆనందాన్ని ఎలా పొందవచ్చు?” అనే బాక్సులో కొన్ని సలహాలు ఉన్నాయి. పరిచర్య విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం కూడా ప్రాముఖ్యం. అంటే ఏంటి?
19 దేవుని పేరును, ఆయన రాజ్యాన్ని ప్రకటించడం మీదే దృష్టిపెట్టండి. జీవానికి నడిపించే దారిని కొంతమందే కనుక్కుంటారని యేసు స్పష్టం చేశాడు. (మత్త. 7:13, 14) పరిచర్య చేసేటప్పుడు యెహోవా, యేసు, దేవదూతలతో కలిసి పనిచేసే గొప్ప గౌరవం మనకు దొరుకుతుంది. (మత్త. 28:19, 20; 1 కొరిం. 3:9; ప్రక. 14:6, 7) అర్హులైన వాళ్లను యెహోవా తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. (యోహా. 6:44) కాబట్టి ఒక వ్యక్తి మన సందేశాన్ని ఇప్పుడు వినకపోయినా, తర్వాత వినే అవకాశం ఉంది.
20. నిరుత్సాహంతో పోరాడడం గురించి యిర్మీయా 20:8, 9 వచనాల నుండి ఏం నేర్చుకోవచ్చు?
20 యిర్మీయా ప్రవక్త నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజలు ఏమాత్రం స్పందించని ప్రాంతంలో ఆయన ప్రకటించాల్సి వచ్చింది. ప్రజలు “రోజంతా” ఆయన్ని అవమానించారు, ఎగతాళి చేశారు. (యిర్మీయా 20:8, 9 చదవండి.) ఒక సమయంలో ఆయన ఎంతగా నిరుత్సాహపడ్డాడంటే ఇక ప్రకటించడం ఆపేద్దాం అనుకున్నాడు. కానీ ఆపలేదు. ఎందుకంటే, “యెహోవా వాక్యం” ఆయనలో అగ్నిలా మండుతోంది, ఆయన ప్రకటించకుండా ఉండలేకపోయాడు. మనం కూడా దేవుని వాక్యంతో మన మనసును, హృదయాన్ని నింపుకుంటే ఆపకుండా ప్రకటించగలుగుతాం. మనం ప్రతీరోజు బైబిలు చదివి, ధ్యానించడానికి ఇది కూడా ఒక కారణం. దానివల్ల పరిచర్యలో ఎక్కువ ఆనందించగలుగుతాం, మంచి ఫలితాలు సాధించగలుగుతాం.—యిర్మీ. 15:16.
21. కారణమేదైనా మీరు నిరుత్సాహం నుండి ఎలా బయటపడవచ్చు?
21 ముందటి పేరాల్లో ప్రస్తావించిన దెబోరా ఇలా అంటోంది: “సాతాను మనమీద ఉపయోగించే శక్తివంతమైన ఆయుధం నిరుత్సాహం.” కానీ సాతాను ఆయుధాలు యెహోవా ముందు పనిచేయవు. కాబట్టి మీరు ఏ కారణం వల్ల నిరుత్సాహపడినా, సహాయం కోసం యెహోవాను వేడుకోండి. పొరపాట్లతో, బలహీనతలతో పోరాడడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన మీకు బలాన్నిస్తాడు. సేవావకాశాల్ని, పరిచర్యను సరైన దృష్టితో చూసేలా సహాయం చేస్తాడు. మీ పరలోక తండ్రికి ప్రార్థించి, మీకెలా అనిపిస్తుందో చెప్పండి. ఆయన సహాయంతో మీరు నిరుత్సాహం నుండి బయటపడవచ్చు.
పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు
^ పేరా 5 ఏదోక సమయంలో మనందరం నిరుత్సాహానికి లోనౌతుంటాం. నిరుత్సాహానికి లోనైనప్పుడు మనం చేయగల కొన్ని పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా సహాయంతో నిరుత్సాహం నుండి ఎలా బయటపడవచ్చో కూడా పరిశీలిస్తాం.
^ పేరా 4 కొన్ని అసలు పేర్లు కావు.
^ పేరా 12 జనవరి 22, 1993 తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికలో వచ్చిన లారెల్ నిస్బెట్ జీవిత కథ చదవండి.
^ పేరా 69 చిత్రాల వివరణ: ఒక సహోదరి మొదట నిరుత్సాహపడింది, కానీ గతంలో తాను చేసిన సేవ గురించి ధ్యానించి యెహోవాకు ప్రార్థిస్తోంది. గతంలో, అలాగే ఇప్పుడు తాను చేస్తున్న సేవను యెహోవా గుర్తుంచుకుంటాడనే నమ్మకంతో ఉంది.