కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2020

ఇందులో ఆగస్టు 3-30, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

“నీ పేరు పవిత్రపర్చబడాలి”

అధ్యయన ఆర్టికల్‌ 23: ఆగస్టు 3-9, 2020. మనుషులు, దేవదూతలు ప్రాముఖ్యంగా ఎంచాల్సిన విషయాలు ఏంటి? అవి ఎందుకంత ప్రాముఖ్యమైనవి? వాటిలో మన పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు, వీటికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం వల్ల యెహోవాతో మన స్నేహం మరింత బలపడుతుంది.

‘నీ పేరుకు భయపడేలా ఏక హృదయం దయచేయి’

అధ్యయన ఆర్టికల్‌ 24: ఆగస్టు 10-16, 2020. కీర్తన 86:11, 12 వచనాల్లో ఉన్న రాజైన దావీదు ప్రార్థనలోని కొంతభాగాన్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా పేరుకు భయపడడం అంటే ఏంటి? ఆ గొప్ప పేరు పట్ల మనం ఎందుకు భయం కలిగివుండాలి? తప్పు చేయాలనే ఆలోచనకు లొంగిపోకుండా దైవభయం మనల్ని ఎలా కాపాడుతుంది?

పాఠకుల ప్రశ్న

గలతీయులు 5:22, 23⁠లో ఉన్నవి మాత్రమే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలా?

‘నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదుకుతాను’

అధ్యయన ఆర్టికల్‌ 25: ఆగస్టు 17-23, 2020. యెహోవాను ఎన్నో ఏళ్లపాటు నమ్మకంగా సేవించిన కొంతమంది సంఘానికి ఎందుకు దూరమౌతారు? వాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఏమనిపిస్తుంది? వీటికి జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. బైబిలు కాలాల్లోని కొందరు, కొంతకాలంపాటు యెహోవా సేవలో చురుగ్గా పాల్గొనలేదు. వాళ్లకు యెహోవా సహాయం చేసిన తీరు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుంటాం.

“నా దగ్గరికి తిరిగిరండి”

అధ్యయన ఆర్టికల్‌ 26: ఆగస్టు 24-30, 2020. సంఘానికి దూరంగా ఉంటున్నవాళ్లు తన దగ్గరికి తిరిగిరావాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, “నా దగ్గరికి తిరిగిరండి” అని ఆహ్వానిస్తున్నాడు. అలా రావాలనుకునేవాళ్లను ప్రోత్సహించడానికి మనం చాలా కృషి చేయాలి. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగిరావడానికి మనం ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.