అధ్యయన ఆర్టికల్ 24
‘నీ పేరుకు భయపడేలా ఏక హృదయం దయచేయి’
“నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం దయచేయి. యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను.”—కీర్త. 86:11, 12.
పాట 7 యెహోవా, మన బలం
ఈ ఆర్టికల్‌లో . . . *
1. దైవభయం ఎలాంటిది? యెహోవా సేవకులకు దైవభయం ఉండడం ఎందుకు తప్పనిసరి?
క్రైస్తవులు దేవున్ని ప్రేమిస్తారు, ఆయనకు భయపడతారు. ‘దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు ఆయనకు భయపడడం ఏంటి’ అని కొంతమంది అనుకోవచ్చు. అయితే, దేవునికి భయపడడం లేదా దైవభయం మనం అనుకునే లాంటిది కాదు; అది చాలా ప్రత్యేకమైనది. దైవభయం ఉన్నవాళ్లకు దేవుని పట్ల ప్రగాఢమైన గౌరవం ఉంటుంది. వాళ్లు ఆయనతో ఉన్న స్నేహాన్ని పాడు చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకుండా జాగ్రత్తపడతారు.—కీర్త. 111:10; సామె. 8:13.
2. కీర్తన 86:11 లో ఉన్న రాజైన దావీదు మాటల ఆధారంగా, మనం ఏ రెండు విషయాలు పరిశీలిస్తాం?
2 కీర్తన 86:11 చదవండి. దైవభయం కలిగివుండడం ఎంత ముఖ్యమో యెహోవాను నమ్మకంగా సేవించిన దావీదు రాజు అర్థం చేసుకున్నాడని ఆ మాటలు చూపిస్తున్నాయి. దావీదు ప్రార్థనలోని ఆ మాటల్ని మనం ఎలా పాటించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు, మనం దేవుని పేరుకు ఎందుకు భయపడాలో తెలిపే కొన్ని కారణాల్ని పరిశీలిద్దాం. తర్వాత, మనకు దేవుని పేరు పట్ల భయం ఉందని మన రోజువారీ జీవితంలో ఎలా చూపించవచ్చో నేర్చుకుందాం.
మనం దేవుని పేరుకు ఎందుకు భయపడాలి?
3. మోషేకు ఎదురైన ఏ అనుభవం దేవుని పేరు పట్ల భయాన్ని కలిగించి ఉంటుంది?
3 ఒక సందర్భంలో మోషే హోరేబు కొండ మీద ఉన్నప్పుడు, యెహోవా మహిమ దాటివెళ్లడం చూశాడు. అప్పుడు ఆయనకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ మనిషికైనా అలాంటి సంఘటన జీవితంలో మర్చిపోలేని అనుభవంగా నిలిచిపోతుంది. బహుశా ఒక దేవదూత చెప్పిన ఈ మాటల్ని మోషే విన్నాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను నిర్గ. 33:17-23; 34:5-7) యెహోవా అనే పేరు ఉపయోగించినప్పుడు మోషేకు ఆ అసాధారణ సంఘటన కళ్ల ముందు మెదిలి ఉంటుంది. అందుకే ఆయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని తర్వాత ఇలా హెచ్చరించాడు: ‘సంభ్రమాశ్చర్యాలు పుట్టించే మహిమాన్వితమైన ఈ పేరుకు భయపడండి.’—ద్వితీ. 28:58.
చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు; ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు.” (4. యెహోవాకున్న ఏ లక్షణాల గురించి ఆలోచించినప్పుడు మనలో దైవభయం మరింత పెరుగుతుంది?
4 మనం యెహోవా పేరు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ఎలాంటివాడో కూడా ఆలోచించాలి. ఆయన లక్షణాలైన శక్తి, తెలివి, న్యాయం, ప్రేమ గురించి ఆలోచించాలి. వీటి గురించి, మరితర లక్షణాల గురించి ఆలోచించినప్పుడు, మనలో దైవభయం మరింత పెరుగుతుంది.—కీర్త. 77:11-15.
5-6. (ఎ) దేవుని పేరుకున్న అర్థం ఏంటి? (బి) నిర్గమకాండం 3:13, 14; యెషయా 64:8 ప్రకారం యెహోవా ఏయే విధాలుగా తన ఇష్టాన్ని నెరవేరుస్తాడు?
5 దేవుని పేరుకున్న అర్థం ఏంటి? యెహోవా అనే పేరుకు, “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థం ఉండవచ్చని చాలామంది పండితులు అంటారు. తాను చేయాలనుకున్న పనిని చేయకుండా యెహోవాను ఏదీ ఆపలేదని, ఆయన దాన్ని ఖచ్చితంగా చేస్తాడని అది మనకు గుర్తుచేస్తుంది. ఇంతకీ, ఆయన తన ఇష్టాన్ని ఏ విధంగా నెరవేరుస్తాడు?
6 యెహోవా తాను అనుకున్న పనిని పూర్తి చేసేందుకు వీలుగా ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలడు. (నిర్గమకాండం 3:13, 14 చదవండి.) దేవుని వ్యక్తిత్వంలో భాగమైన ఈ అంశాన్ని లోతుగా ధ్యానించమని ప్రచురణలు మనల్ని ఎన్నోసార్లు ప్రోత్సహించాయి. అంతేకాదు తనను సేవించేలా, తాను అనుకున్న పనిని నెరవేర్చేలా అపరిపూర్ణ సేవకుల్ని సైతం యెహోవా ఎలా అవ్వాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు. (యెషయా 64:8 చదవండి.) ఈ రెండు విధాలుగా ఆయన తన ఇష్టాన్ని నెరవేరుస్తాడు. దాన్ని నెరవేర్చకుండా ఏదీ ఆయన్ని ఆపలేదు.—యెష. 46:10, 11.
7. మన పరలోక తండ్రి పట్ల భక్తిపూర్వక భయాన్ని ఏయే విధాలుగా పెంచుకోవచ్చు?
7 మన పరలోక తండ్రి తన ఇష్టాన్ని నెరవేర్చడంలో భాగంగా ఏయే పనులు చేశాడో, మనల్ని ఏయే విధాలుగా ఉపయోగించుకున్నాడో మనం ధ్యానించాలి. కీర్త. 8:3, 4) అంతేకాదు, మనం తన ఇష్టాన్ని నెరవేర్చేలా మనకు ఏయే విధాలుగా సహాయం చేశాడో ధ్యానించినప్పుడు, ఆయన పట్ల ఉన్న గౌరవం మరింత ఎక్కువౌతుంది. నిజంగా, యెహోవా అనే పేరు మనలో భక్తిపూర్వక భయాన్ని కలిగిస్తుంది! మన తండ్రికి సంబంధించిన ప్రతీది, అంటే ఆయన ఇప్పటిదాకా చేసినవి, ఇకమీదట చేయబోయేవి అన్నీ ఆ పేరులో ఇమిడివున్నాయి.—కీర్త. 89:7, 8.
అలా చేస్తే ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత పెరుగుతుంది. ఉదాహరణకు, యెహోవా చేసిన అద్భుతమైన సృష్టి గురించి ధ్యానించినప్పుడు, ఆయన చేసిన వాటన్నిటిని బట్టి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. (“నేను యెహోవా పేరును ప్రకటిస్తాను”
8. ద్వితీయోపదేశకాండం 32:2, 3 బట్టి, తన పేరు విషయంలో యెహోవా ఏమని కోరుకుంటున్నాడు?
8 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే ముందు, యెహోవా మోషేకు ఒక పాట నేర్పించాడు. (ద్వితీ. 31:19) తర్వాత మోషే దాన్ని ఇశ్రాయేలీయులకు నేర్పించాలి. (ద్వితీయోపదేశకాండం 32:2, 3 చదవండి.) యెహోవా తన పేరును దాచాలని గానీ, మనం దాన్ని నోటితో పలకకూడనంత పవిత్రంగా చూడాలని గానీ కోరుకోవడం లేదని ఈ వచనాలు రుజువు చేస్తున్నాయి. ప్రతీఒక్కరు ఆయన పేరును తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు మోషే ద్వారా యెహోవా గురించి, ఆయన మహిమాన్వితమైన పేరు గురించి తెలుసుకునే గొప్ప అవకాశం పొందారు. తొలకరి వానలు మొక్కల్లో కొత్త జీవాన్ని నింపినట్లు, మోషే మాటలు వాళ్ల విశ్వాసాన్ని బలపర్చి ప్రోత్సహించాయి. మనం కూడా మోషేలా బోధించాలంటే ఏం చేయాలి?
9. యెహోవా పేరును పవిత్రపర్చే పనిలో మనం ఎలా పాల్గొనవచ్చు?
9 మనం పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పేరు యెహోవా అని బైబిలు నుండి ప్రజలకు చూపించవచ్చు. యెహోవాను ఘనపర్చే చక్కని ప్రచురణల్ని, అద్భుతమైన వీడియోల్ని, వెబ్‌సైట్‌లోని ఆర్టికల్స్‌ని వాళ్లకు చూపించవచ్చు. ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మన దేవుని గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఇతరులతో మాట్లాడే అవకాశాల కోసం వెదకవచ్చు. మనం కలిసే ప్రజలకు మనుషుల పట్ల, భూమి పట్ల యెహోవాకున్న సంకల్పం గురించి చెప్పవచ్చు; యెహోవాకు మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో బహుశా మొదటిసారి వాళ్లు తెలుసుకుంటుండవచ్చు. మన ప్రేమగల తండ్రి గురించిన సత్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మనం ఆయన పేరును పవిత్రపర్చే పనిలో పాల్గొంటాం. యెహోవా గురించి వాళ్లు విన్న చెడు విషయాలన్నీ అబద్ధాలని అర్థం చేసుకునేలా సహాయం చేస్తాం. మనం బైబిలు ఉపయోగించి బోధించినప్పుడు ప్రజలు ఎంతో సేదదీర్పు పొందుతారు.—యెష. 65:13, 14.
10. బైబిలు విద్యార్థులకు దేవుని నీతియుక్త నిర్దేశాలు, ప్రమాణాలు నేర్పిస్తే సరిపోతుందా? వివరించండి.
10 మనం స్టడీలు చేస్తున్నప్పుడు, బైబిలు విద్యార్థులు యెహోవా పేరును తెలుసుకునేలా, దాన్ని ఉపయోగించేలా సహాయం చేయాలి. అంతేకాదు, యెహోవా పేరు ఆయన గురించి ఏం తెలియజేస్తుందో బోధించాలి. అందుకోసం కేవలం బైబిల్లో ఉన్న నియమాల్ని, నిర్దేశాల్ని, నైతిక ప్రమాణాల్ని బోధిస్తే సరిపోతుందా? అలా చేస్తే, బైబిలు విద్యార్థులు దేవుని నియమాల్ని తెలుసుకుని అవి సరైనవని గ్రహిస్తారేమో గానీ, యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడతారా? ఒక విషయం గుర్తుంచుకోండి: హవ్వకు దేవుడు ఇచ్చిన నియమం తెలుసు, కానీ దాన్ని ఇచ్చిన దేవుని పట్ల ఆమెకు నిజమైన ప్రేమ లేదు. ఆదాముకు కూడా అంతే. (ఆది. 3:1-6) కాబట్టి బైబిలు విద్యార్థులకు కేవలం దేవుని నీతియుక్త నియమాలు, నిర్దేశాలు నేర్పిస్తే సరిపోదు. వాళ్లకు యెహోవాను ప్రేమించడం నేర్పించాలి.
11. నియమాల్ని, నిర్దేశాల్ని ఇచ్చిన దేవుని పట్ల ప్రేమ పెంచుకునేలా బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?
11 దేవుని నియమాలు, నిర్దేశాలు ఎల్లప్పుడూ మనకు మంచే చేస్తాయి. (కీర్త. 119:97, 111, 112) బైబిలు విద్యార్థులు ఈ విషయాన్ని అర్థంచేసుకోవాలంటే, ఆయన మన మీద ప్రేమతోనే వాటిని ఇచ్చాడని వాళ్లు గ్రహించాలి. కాబట్టి మనం వాళ్లను ఇలా అడగవచ్చు: “తన సేవకులు ఇలా చేయాలని లేదా ఇలా చేయకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎలాంటి దేవుడని ఇది చూపిస్తుంది?” యెహోవా గురించి ఆలోచించేలా, ఆయన మహిమాన్వితమైన పేరును ప్రేమించేలా మన విద్యార్థులకు సహాయం చేస్తే నేర్చుకుంటున్న విషయాలు వాళ్ల మనసును హత్తుకుంటాయి. అప్పుడు వాళ్లు ఆ నియమాలతోపాటు, వాటిని ఇచ్చిన దేవున్ని కూడా ప్రేమిస్తారు. (కీర్త. 119:68) దానివల్ల వాళ్ల విశ్వాసం పెరుగుతుంది; అంతేకాదు రాబోయే కష్టమైన పరిస్థితుల్ని సహించేంత బలం సంపాదించుకుంటారు.—1 కొరిం. 3:12-15.
“మన దేవుడైన యెహోవా పేరున నడుస్తాం”
12. ఒక సందర్భంలో ఏక హృదయం కలిగివుండే విషయంలో దావీదు ఎలా తప్పిపోయాడు? దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి?
12 రాజైన దావీదు కీర్తన 86:11 లో “నాకు ఏక హృదయం దయచేయి” అని అన్న మాటలు కూడా ఎంతో ముఖ్యమైనవి. మన హృదయం చాలా సులభంగా వేరే విషయాలతో నిండిపోయే అవకాశం ఉందని దావీదు సొంత అనుభవం నుండి నేర్చుకున్నాడు. ఒక సందర్భంలో దావీదు మేడ మీద ఉన్నప్పుడు, వేరే వ్యక్తి భార్య స్నానం చేయడం అతనికి కనిపించింది. ఆ క్షణం అతను “ఏక హృదయం” కలిగివున్నాడా? ‘నీ సాటిమనిషి భార్యను నువ్వు ఆశించకూడదు’ అని యెహోవా ఇచ్చిన ఆజ్ఞ దావీదుకు తెలుసు. (నిర్గ. 20:17) అయినాసరే, అతను తన చూపును తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. బత్షెబను సొంతం చేసుకోవాలా లేక యెహోవాను సంతోషపెట్టాలా అనే ఆలోచనల మధ్య దావీదు హృదయం ఊగిసలాడింది. దావీదు ఎంతోకాలంగా యెహోవాను ప్రేమిస్తూ ఆయన పట్ల భక్తిపూర్వక భయంతో జీవించినప్పటికీ తన స్వార్థ కోరికకు లొంగిపోయాడు. అతను కొన్ని చెడ్డ పనులు చేశాడు, యెహోవా పేరుకు మచ్చ తీసుకొచ్చాడు, తన కుటుంబ సభ్యులతోపాటు ఎంతోమంది అమాయకులకు హాని చేశాడు.—2 సమూ. 11:1-5, 14-17; 12:7-12.
13. ఆ తర్వాతి కాలంలో దావీదు ఏక హృదయం కలిగివున్నాడని ఎలా చెప్పవచ్చు?
13 దావీదును యెహోవా సరిదిద్దాడు. అప్పుడు, యెహోవాతో తనకున్న సంబంధాన్ని అతను తిరిగి సంపాదించుకోగలిగాడు. (2 సమూ. 12:13; కీర్త. 51:2-4, 17) ఏక హృదయం కలిగివుండక పోవడం వల్ల వచ్చిన ఇబ్బందుల్ని, గుండెకోతను దావీదు గుర్తుంచుకున్నాడు. కీర్తన 86:11 లో ఉన్న దావీదు మాటల్ని ఇలా కూడా అనువదించవచ్చు: “నాకు అవిభాగిత హృదయం దయచేయి.” మరి దావీదు ఏక హృదయం లేదా అవిభాగిత హృదయం కలిగివుండేలా యెహోవా సహాయం చేశాడా? చేశాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఆ తర్వాతి కాలంలో, ‘దావీదు హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా’ ఉందని బైబిలు చెప్పింది.—1 రాజు. 11:4; 15:3.
14. మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకు?
14 దావీదు అనుభవం మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు, ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. దావీదు ఘోరమైన పాపం చేయడం నేడున్న దేవుని సేవకులకు ఒక హెచ్చరికగా ఉంది. మనం యెహోవాను సేవించడం ఈ మధ్యే మొదలుపెట్టినా
లేక ఎన్నో ఏళ్ల క్రితం నుండి సేవిస్తున్నా, ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా హృదయంలో వేరే విషయాలకు చోటివ్వకుండా జాగ్రత్తపడుతూ, సాతాను తెస్తున్న ప్రలోభాలను ఎదిరిస్తున్నానా?’15. లైంగిక కోరికలు రేకెత్తించే చిత్రాల్ని చూడకుండా యెహోవా పేరు పట్ల ఉన్న భయం ఎలా కాపాడుతుంది?
15 ఉదాహరణకు, మీలో లైంగిక కోరికల్ని రేకెత్తించే ఒక చిత్రం టీవీలో గానీ, ఇంటర్నెట్లో గానీ కనిపిస్తే ఏం చేస్తారు? ఆ చిత్రం లేదా సినిమా పోర్నోగ్రఫీ కిందికి రాదులే అని మీకు అనిపించవచ్చు. కానీ అది, మీ హృదయాన్ని వేరే విషయాలతో నింపడానికి సాతాను చేస్తున్న ప్రయత్నమేమో ఒకసారి ఆలోచించండి. (2 కొరిం. 2:11) ఆ చిత్రాన్ని, పెద్ద చెక్క మొద్దును చీల్చడానికి ఒకవ్యక్తి వాడే చిన్న గొడ్డలితో పోల్చవచ్చు. ఆ వ్యక్తి పదునైన గొడ్డలితో చెక్కమొద్దుపై మొదటి వేటు వేసినప్పుడు అది రెండుగా చీలిపోదు. కానీ పదేపదే నరికేసరికి ఆ పెద్ద మొద్దు రెండు ముక్కలౌతుంది. లైంగిక కోరికల్ని రేకెత్తించే చిత్రాలు కూడా ఆ పదునైన గొడ్డలి లాంటివే. అవి చూడడం పెద్ద తప్పేమీ కాదని మొదట్లో అనిపించినా, కొంతకాలానికి వాటితోనే మన హృదయం నిండిపోతుంది, తర్వాత యెహోవా అసహ్యించుకునే పాపం చేస్తాం. కాబట్టి తప్పుడు కోరికలు రేకెత్తించేవాటికి మీ హృదయంలో కాస్త కూడా చోటివ్వకండి! యెహోవా పేరుకు భయపడేలా ఏక హృదయం కలిగివుండండి!
16. తప్పు చేయాలనే ప్రలోభం ఎదురైనప్పుడు, మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?
16 లైంగిక కోరికల్ని రేకెత్తించే చిత్రాల్ని మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఇతర విషయాల్ని ఉపయోగించి సాతాను మనల్ని చెడు దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మనమేం చేయాలి? నిజానికి ఆ విషయాలు అంత చెడ్డవేమీ కాదని మనం అనుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మనమిలా అనుకోవచ్చు: ‘ఈ పని చేస్తే నన్ను బహిష్కరించరు కాబట్టి, ఇది అంత చెడ్డ పని కాకపోవచ్చు.’ అలా ఆలోచించడం చాలా పెద్ద పొరపాటు. మనం ఇలా ఆలోచించడం సరైనది: ‘నా హృదయాన్ని చెడు విషయాలతో నింపడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడా? నేను తప్పుడు కోరికలకు లొంగిపోతే యెహోవాకు చెడ్డ పేరు వస్తుందా? ఈ పని నన్ను యెహోవాకు దగ్గర యాకో. 1:5) అప్పుడు మీరు చెడు పనులకు దూరంగా ఉండగలుగుతారు. “సాతానా, వెళ్లిపో!” అని చెప్పిన యేసులాగే, మీరు కూడా ప్రలోభాల్ని గట్టిగా తిప్పికొట్టగలుగుతారు.—మత్త. 4:10.
చేస్తుందా లేక దూరం చేస్తుందా?’ ఇలాంటి ప్రశ్నల గురించి లోతుగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిజాయితీగా జవాబులు తెలుసుకోండి. అందుకోసం కావాల్సిన తెలివి ఇవ్వమని ప్రార్థించండి. (17. మన హృదయంలో వేరే విషయాలకు చోటివ్వడం ఎందుకు మంచిది కాదో ఉదాహరణతో చెప్పండి.
17 మన హృదయంలో వేరే విషయాలకు చోటివ్వడం మంచిది కాదు. ఒక స్పోర్ట్స్ టీంలో ఉన్న ఆటగాళ్లకు ఒకరంటే ఒకరు పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్లలో కొంతమంది తమకు మాత్రమే పేరు రావాలని కోరుకుంటున్నారు. కొంతమందేమో ఆటలో రూల్స్ పాటించడం అనవసరం అనుకుంటున్నారు. మిగిలినవాళ్లు కోచ్‌ను గౌరవించట్లేదు. అలాంటి టీం మ్యాచ్ గెలవడం అసాధ్యం. అయితే టీంలో ఐక్యత ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువుంటాయి. అదేవిధంగా మీ ఆలోచనలు, కోరికలు, భావాలు అన్నీ యెహోవాను సేవించడం చుట్టే తిరిగితే మీరు కూడా విజయం సాధిస్తారు. కానీ మీరు ఏక హృదయం కలిగి ఉండకూడదని సాతాను కోరుకుంటున్నాడు. యెహోవా చేయమని చెప్పేది ఒకటైతే, మీ హృదయం చేయమని చెప్పేది ఇంకోటి అవ్వాలన్నది సాతాను కోరిక. కానీ యెహోవాను సేవించాలంటే మీరు ఏక హృదయం కలిగివుండాలి. అంటే, మీ హృదయంలో యెహోవాకు మాత్రమే చోటివ్వాలి. (మత్త. 22:36-38) మీ హృదయాన్ని వేరే విషయాలతో నింపడానికి సాతానును ఎన్నడూ అనుమతించకండి!
18. మీకా 4:5 ప్రకారం మీరేం నిర్ణయించుకున్నారు?
18 దావీదులాగే మీరు కూడా యెహోవాకు ఇలా ప్రార్థించండి: “నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం దయచేయి.” ఆ ప్రార్థనకు అనుగుణంగా జీవించడానికి శాయశక్తులా కృషిచేయండి. ప్రతీరోజు మీరు తీసుకునే చిన్నా పెద్దా నిర్ణయాల ద్వారా, మీకు యెహోవా పవిత్రమైన పేరు పట్ల భయం ఉందని చూపించండి. అలా చేసినట్లయితే, ఒక యెహోవాసాక్షిగా మీరు దేవుని పేరు గురించి లోతుగా ఆలోచించిన వాళ్లౌతారు. (సామె. 27:11) అంతేకాదు, మీకా ప్రవక్తలాగే మీరు కూడా ఇలా చెప్పగలుగుతారు: “మనమైతే శాశ్వతకాలం మన దేవుడైన యెహోవా పేరున నడుస్తాం.”—మీకా. 4:5, అధస్సూచి.
పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు
^ పేరా 5 కీర్తన 86:11, 12 వచనాల్లో ఉన్న రాజైన దావీదు ప్రార్థనలోని కొంతభాగాన్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా పేరుకు భయపడడం అంటే ఏంటి? ఆ గొప్ప పేరు పట్ల మనం ఎందుకు భయం కలిగివుండాలి? తప్పు చేయాలనే ఆలోచనకు లొంగిపోకుండా దైవభయం మనల్ని ఎలా కాపాడుతుంది?