కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంత్యకాలంలో శత్రు రాజులు

అంత్యకాలంలో శత్రు రాజులు

ఈ చార్టులోని కొన్ని ప్రవచనాలు ఒకే కాలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతున్నాయి. ఆ సంఘటనలన్నీ, మనం ‘అంత్యకాలంలో’ జీవిస్తున్నామని నిరూపిస్తున్నాయి.—దాని. 12:4.

  • లేఖనాలు: ప్రక. 11:7; 12:13, 17; 13:1-8, 12

    ప్రవచనం: “క్రూరమృగం” ఎన్నో శతాబ్దాల పాటు ప్రజల్ని పరిపాలిస్తుంది. అంత్యకాలంలో దాని ఏడో తలకు చావు దెబ్బ తగులుతుంది. తర్వాత ఆ దెబ్బ మానిపోతుంది, “భూమ్మీదున్న ప్రజలందరూ” ఆ క్రూరమృగాన్ని అనుసరిస్తారు. ‘స్త్రీ సంతానంలో మిగిలినవాళ్లతో యుద్ధం చేయడానికి’ సాతాను ఆ క్రూరమృగాన్ని ఉపయోగించుకుంటాడు.

    నెరవేర్పు: జలప్రళయం తర్వాత, యెహోవాను వ్యతిరేకించే ప్రభుత్వాలు మనుషుల్ని పరిపాలించాయి. చాలా శతాబ్దాల తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్‌ సామ్రాజ్యానికి చావుదెబ్బ తగిలి అధికారాన్ని చాలామట్టుకు కోల్పోయింది. అమెరికాతో చేతులు కలిపాక అది మళ్లీ బలం పుంజుకుంది. సాతాను మరిముఖ్యంగా ఈ అంత్యకాలంలో, దేవుని ప్రజల్ని హింసించడానికి తన గుప్పిట్లో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతటినీ ఉపయోగించుకుంటున్నాడు.

  • లేఖనాలు: దాని. 11:25-45

    ప్రవచనం: అంత్యకాలంలో ఉత్తర రాజుకు, దక్షిణ రాజుకు మధ్య పోరాటం జరుగుతుంది.

    నెరవేర్పు: జర్మనీ, ఆంగ్లో-అమెరికా మధ్య యుద్ధం జరిగింది. 1945 లో సోవియట్‌ యూనియన్‌-దానికి మద్దతిచ్చిన దేశాలు ఉత్తర రాజు అయ్యాయి. 1991 లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయ్యింది. కొంతకాలానికి రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు ఉత్తర రాజు అయ్యాయి.

  • లేఖనాలు: యెష. 61:1; మలా. 3:1; లూకా 4:18

    ప్రవచనం: మెస్సీయ రాజ్యం స్థాపించబడడానికి ముందు యెహోవా ఒక “సందేశకుణ్ణి” పంపి, “మార్గాన్ని సిద్ధం చేస్తాడు.” ఆ సందేశకుడు ‘సాత్వికులకు మంచివార్త ప్రకటిస్తాడు.’

    నెరవేర్పు: 1870 మొదలుకొని సి. టి. రస్సెల్‌, ఆయన సహచరులు దేవుని వాక్యంలోని సత్యాల్ని కనుగొనడానికి బైబిల్ని లోతుగా అధ్యయనం చేశారు. దేవుని సేవకులందరూ ప్రకటనా పని చేయడం చాలా ముఖ్యమని వాళ్లు 1881 లో గుర్తించారు. “1000 మంది సువార్తికులు కావాలి,” “ప్రకటించడానికి అభిషేకించబడ్డాం” వంటి ఆర్టికల్స్‌ను వాళ్లు ప్రచురించారు.

  • లేఖనాలు: మత్త. 13:24-30, 36-43

    ప్రవచనం: ఒక మనిషి పొలంలో గోధుమల్ని విత్తుతాడు. తర్వాత శత్రువు వచ్చి ఆ పొలంలో గురుగుల్ని నాటుతాడు. ఆ గురుగులు విపరీతంగా పెరిగిపోయి, గోధుమల్ని కప్పేస్తాయి. కోత కాలంలో గోధుమలు, గురుగులు వేరుచేయబడతాయి.

    నెరవేర్పు: 1870 నుండి నిజ క్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. అంత్యకాలంలో, అబద్ధ క్రైస్తవుల మధ్య నుండి నిజ క్రైస్తవులు వేరుచేయబడి ఒక సంఘంగా సమకూర్చబడ్డారు.

  • లేఖనాలు: దాని. 2:31-33, 41-43

    ప్రవచనం: వేర్వేరు లోహాలు గల భారీ ప్రతిమ పాదాలు కొంతభాగం ఇనుపవి, కొంతభాగం బంకమట్టివి.

    నెరవేర్పు: బంకమట్టి, ఆంగ్లో-అమెరికా పరిపాలన కిందున్న సామాన్య ప్రజల్ని సూచిస్తుంది. అయితే ప్రజలు ఎదురుతిరగడం వల్ల ఈ ప్రపంచాధిపత్యానికి ఇనుముకు ఉండాల్సినంత బలం ఉండదు.

  • లేఖనాలు: మత్త. 13:30; 24:14, 45; 28:19, 20

    ప్రవచనం: ‘గోధుమలు గోదాములోకి సమకూర్చబడతాయి;’ ‘ఇంట్లోని సేవకుల మీద నమ్మకమైన, బుద్ధిగల దాసుడు’ నియమించబడతాడు. “రాజ్య సువార్త భూమంతటా” ప్రకటించబడడం మొదలౌతుంది.

    నెరవేర్పు: 1919 లో దేవుని ప్రజల మీద నమ్మకమైన దాసుడు నియమించబడ్డాడు. అప్పటినుండి బైబిలు విద్యార్థులు ప్రకటనా పనిని మరింత విస్తృతంగా చేస్తున్నారు. నేడు యెహోవాసాక్షులు 200 కన్నా ఎక్కువ దేశాల్లో ప్రకటిస్తున్నారు; 1,000 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు ప్రచురణలు తయారు చేస్తున్నారు.

  • లేఖనాలు: దాని. 12:11; ప్రక. 13:11, 14, 15

    ప్రవచనం: రెండు కొమ్ములు గల క్రూరమృగం, “మొదటి క్రూరమృగపు ప్రతిమను” తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత అది ఆ ప్రతిమకు ‘ఊపిరి పోస్తుంది.’

    నెరవేర్పు: ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం నానాజాతి సమితిని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. మిగతా దేశాలు కూడా నానాజాతి సమితికి మద్దతిచ్చాయి. 1926-1933 వరకు ఉత్తర రాజు కూడా నానాజాతి సమితికి మద్దతిచ్చాడు. దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల ప్రపంచ శాంతిని నానాజాతి సమితి తీసుకొస్తుందని ప్రజలు నమ్మారు. నానాజాతి సమితి స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి విషయంలో కూడా ప్రజలు అదే నమ్మకంతో ఉన్నారు.

  • లేఖనాలు: దాని. 8:23, 24

    ప్రవచనం: భీకరంగా కనిపించే ఒక రాజు ‘ఘోరమైన నాశనాన్ని కలగజేస్తాడు.’

    నెరవేర్పు: ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఎంతోమంది ప్రాణాల్ని బలి తీసుకుంది, చాలా విధ్వంసాన్ని సృష్టించింది. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటన్‌-అమెరికాల శత్రుదేశం మీద అమెరికా రెండు అణు బాంబులు వేసింది. దానివల్ల ఘోరమైన నాశనం కలిగింది.

  • లేఖనాలు: దాని. 11:31; ప్రక. 17:3, 7-11

    ప్రవచనం: పది కొమ్ములు ఉన్న ఎర్రని క్రూరమృగం అగాధం నుండి పైకి వస్తుంది, అది ఎనిమిదో రాజు అవుతుంది. దానియేలు పుస్తకం ఈ ఎనిమిదో రాజును “నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు” అని వర్ణిస్తోంది.

    నెరవేర్పు: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నానాజాతి సమితి నిష్క్రియా స్థితిలోకి వెళ్లిపోయింది. యుద్ధం తర్వాత దాని స్థానంలో ఐక్యరాజ్య సమితి ‘నిలబెట్టబడింది.’ నానాజాతి సమితి స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి, దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల ప్రపంచ శాంతిని తీసుకొస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఐక్యరాజ్య సమితి మతం మీద దాడిచేస్తుంది.

  • లేఖనాలు: 1 థెస్స. 5:3; ప్రక. 17:16

    ప్రవచనం: “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు ప్రకటన చేస్తాయి. “పది కొమ్ములు,” అలాగే “క్రూరమృగం” కలిసి “వేశ్య” మీద దాడిచేసి, దాన్ని నాశనం చేస్తాయి. తర్వాత దేశాలు నాశనం చేయబడతాయి.

    నెరవేర్పు: ప్రపంచమంతటా శాంతి, భద్రతలు నెలకొల్పామని దేశాలు చెప్పుకుంటాయి. తర్వాత, ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న దేశాలు అబద్ధమత సంస్థల్ని నాశనం చేస్తాయి. మహాశ్రమ మొదలైంది అనడానికి అది ఒక సూచన. యేసు హార్‌మెగిద్దోనులో, సాతాను వ్యవస్థలోని మిగతా భాగాన్ని నాశనం చేసినప్పుడు ఆ మహాశ్రమ ముగుస్తుంది.

  • లేఖనాలు: యెహె. 38:11, 14-17; మత్త. 24:31

    ప్రవచనం: దేవుని ప్రజల దేశం మీద గోగు దాడి చేస్తాడు. తర్వాత, “ఎంచుకున్న వాళ్లను” దూతలు సమకూరుస్తారు.

    నెరవేర్పు: ఉత్తర రాజు, మిగతా దేశాల ప్రభుత్వాలతో కలిసి దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు. ఈ దాడి మొదలైన తర్వాత, మిగిలిన అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి సమకూర్చబడతారు.

  • లేఖనాలు: యెహె. 38:18-23; దాని. 2:34, 35, 44, 45; ప్రక. 6:2; 16:14, 16; 17:14; 19:20

    ప్రవచనం: ‘తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి’ గోగును, అతని సైన్యాన్ని నాశనం చేయడం ద్వారా “తన విజయాన్ని” పూర్తి చేస్తాడు. ‘ఆ క్రూరమృగం అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడుతుంది.’ ఒక రాయి భారీ ప్రతిమను నాశనం చేస్తుంది.

    నెరవేర్పు: దేవుని ప్రజల్ని కాపాడడానికి దేవుని రాజ్యానికి రాజైన యేసు వస్తాడు. 1,44,000 మంది సహపరిపాలకులతో, పరలోక సైన్యంతో కలిసి యేసు గోగును, అంటే దేశాల గుంపును నాశనం చేస్తాడు. దాంతో సాతాను లోకం అంతమౌతుంది