అధ్యయన ఆర్టికల్ 10
బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సంఘమంతా సహాయం చేయవచ్చు
“ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది.”—ఎఫె. 4:16.
పాట 85 ఒకరినొకరు చేర్చుకోండి
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా ఎవరు సహాయం చేయవచ్చు?
ఫిజిలో ఉంటున్న యామీ అనే సహోదరి ఇలా అంటోంది: “బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు నేర్చుకున్న విషయాలు నాకు బాగా నచ్చాయి. ఇదే సత్యం అని నాకు నమ్మకం కుదిరింది. కానీ సహోదర సహోదరీలతో సమయం గడపడం మొదలుపెట్టాకే అవసరమైన మార్పులు చేసుకోగలిగాను, బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించగలిగాను.” యామీ అనుభవం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది: ఒక బైబిలు విద్యార్థికి సంఘంలో ఉన్నవాళ్లు సహాయం చేసినప్పుడు, ఆయన ప్రగతి సాధిస్తూ బాప్తిస్మం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2 కొత్తవాళ్లు సంఘంలోకి వచ్చేలా ప్రతీ ప్రచారకుడు సహాయం చేయవచ్చు. (ఎఫె. 4:16) వనౌటులో ఉంటున్న లేలానీ అనే పయినీరు ఇలా అంటోంది: “ఒక పిల్లవాడు ఎదగాలంటే, ఊరిలోని వాళ్లందరి సహాయం అవసరం అని పెద్దవాళ్లు అంటుంటారు. శిష్యుల్ని చేసే పనిలో కూడా అది నిజం. ఒక వ్యక్తి సంఘంలోకి రావాలంటే, సంఘంలో ఉన్న వాళ్లందరి సహాయం అవసరం.” ఒక పిల్లవాడు పెరిగి పెద్దవ్వడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లు ఇలా అందరూ సహాయం చేస్తారు. పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా, మంచి పాఠాలు నేర్పించడం ద్వారా వాళ్లు అలా చేస్తారు. అదేవిధంగా ప్రచారకులు సలహా ఇవ్వడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, మంచి ఆదర్శం ఉంచడం ద్వారా బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయవచ్చు.—సామె. 15:22.
3. యానా, డోరిన్, లేలానీ చెప్పిన మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?
3 బైబిలు స్టడీ చేస్తున్న ప్రచారకులు సహోదర సహోదరీల సహాయం తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడాలి? మాల్డోవాలో ప్రత్యేక యోహా. 13:35.
పయినీరుగా సేవచేస్తున్న యానా ఏం చెప్తుందంటే, “బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించడం మొదలుపెట్టినప్పుడు వాళ్లకు చాలా విషయాల్లో సహాయం అవసరం. స్టడీ ఇస్తున్న ఒక్క వ్యక్తే అన్నీ చూసుకోలేడు.” అదే దేశంలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న డోరిన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “తరచూ, నేను ఎప్పుడూ ఆలోచించని కొన్ని విషయాల్ని నాతో పాటు వచ్చే ప్రచారకులు విద్యార్థికి చెప్తుంటారు. అవి విద్యార్థి హృదయాన్ని తాకుతాయి.” లేలానీ ఇలా చెప్తుంది: “మనం వాళ్లమీద చూపించే ప్రేమ, ఆప్యాయతల్ని బట్టి మనం నిజంగా యెహోవా ప్రజలమని విద్యార్థులు అర్థం చేసుకుంటారు.”—4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
4 అయితే, మీకు ఇలా అనిపించవచ్చు: ‘స్టడీ నాది కాకపోయినా, ప్రగతి సాధించేలా ఒక బైబిలు విద్యార్థికి నేనెలా సహాయం చేయగలను?’ ఎవరైనా మనల్ని వాళ్ల స్టడీకి పిలిచినప్పుడు, విద్యార్థి మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టినప్పుడు మనం ఏం చేయవచ్చో చూద్దాం. అలాగే విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా సంఘ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చో కూడా తెలుసుకుందాం.
మీరు స్టడీకి వెళ్లినప్పుడు
5. ఎవరైనా మిమ్మల్ని వాళ్ల స్టడీకి పిలిస్తే, మీరేం గుర్తుంచుకోవాలి?
5 విద్యార్థికి బైబిలు విషయాలు అర్థమయ్యేలా సహాయం చేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా స్టడీ ఇస్తున్న వ్యక్తిదే. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వాళ్ల స్టడీకి రమ్మని పిలిస్తే, మీరు వాళ్లకు సహాయంగా వెళ్తున్నారని గుర్తుంచుకోండి. (ప్రసం. 4:9, 10) స్టడీ జరుగుతున్నప్పుడు మీరు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
6. మీరు వేరేవాళ్ల స్టడీకి వెళ్తున్నప్పుడు, సామెతలు 20:18 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?
6 స్టడీకి సిద్ధపడండి. ముందుగా విద్యార్థి గురించిన కొన్ని వివరాలు స్టడీ ఇస్తున్న వ్యక్తిని అడగండి. (సామెతలు 20:18 చదవండి.) మీరు ఈ ప్రశ్నలు అడగవచ్చు: “విద్యార్థి నమ్మకాలేంటి? ఆయన వయసెంత? ఆయన కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మీరు ఏ పాఠం స్టడీ చేస్తున్నారు? ఆ పాఠం నుండి విద్యార్థి ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? స్టడీలో నేను చెప్పాల్సినవి లేదా చెప్పకూడనివి ఏమైనా ఉన్నాయా? విద్యార్థి ప్రగతి సాధించేలా నేనెలా ప్రోత్సహించగలను?” నిజమే, స్టడీ ఇస్తున్నవాళ్లు విద్యార్థి వ్యక్తిగత విషయాలు చెప్పరు. కానీ వాళ్లు చెప్పే కొన్ని విషయాలు మీకు ఉపయోగపడతాయి. మిషనరీగా సేవచేస్తున్న జాయ్ అనే సహోదరి ఇలా చెప్తుంది: “నాతో పాటు స్టడీకి వచ్చేవాళ్లకు విద్యార్థి గురించి కొన్ని విషయాలు చెప్తాను. దానివల్ల వాళ్లు విద్యార్థి మీద శ్రద్ధ చూపించగలుగుతారు. స్టడీలో ఏం మాట్లాడాలో ఆలోచించుకోగలుగుతారు.”
7. మనం వేరేవాళ్ల స్టడీకి వెళ్తున్నా ఎందుకు సిద్ధపడాలి?
7 మీరు వేరేవాళ్ల స్టడీకి వెళ్తున్నప్పుడు, స్టడీ చేసే పాఠాన్ని మీరు కూడా సిద్ధపడి ఉండడం మంచిది. (ఎజ్రా 7:10) పైపేరాల్లో చెప్పిన డోరిన్ ఇలా అంటున్నాడు: “నాతో స్టడీకి వచ్చేవాళ్లు కూడా స్టడీకి సిద్ధపడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే, దానివల్ల వాళ్లు విద్యార్థికి ఉపయోగపడే విషయాల్ని చెప్పగలుగుతారు.” స్టడీ ఇస్తున్న వ్యక్తి, అలాగే మీరు సిద్ధపడి వెళ్తే విద్యార్థి అది గమనించి, ఆయన కూడా స్టడీకి సిద్ధపడే అవకాశం ఉంది. మీరు పాఠాన్ని పూర్తిగా సిద్ధపడకపోయినా, కనీసం ఆ పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాల్ని పరిశీలించడానికి సమయం తీసుకోండి.
8. స్టడీలో విద్యార్థికి తగ్గట్టు ప్రార్థించాలంటే ఏం చేయాలి?
8 స్టడీలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి, ఒకవేళ ప్రార్థించమని మిమ్మల్ని అడిగితే ఏ విషయాల గురించి ప్రార్థించాలో ముందే ఆలోచించుకుని పెట్టుకోండి. అప్పుడు మీరు విద్యార్థికి తగ్గట్టు చక్కగా ప్రార్థించగలుగుతారు. (కీర్త. 141:2) జపాన్‌లో ఉంటున్న హనాయి తను స్టడీ తీసుకున్న రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్తోంది: “నాకు స్టడీ ఇస్తున్న సహోదరి ఇంకో సహోదరిని తీసుకొచ్చింది. ఆమె ప్రార్థన విన్నప్పుడు ఆమెకు యెహోవాతో ఎంత దగ్గరి స్నేహం ఉందో నాకు అర్థమైంది. నాకూ ఆమెలా ఉండాలనిపించింది. నా పేరు ఉపయోగించి ప్రార్థించినప్పుడు, ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది.”
9. యాకోబు 1:19 ప్రకారం, మీరు వేరేవాళ్ల స్టడీకి వెళ్లినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?
9 స్టడీ జరుగుతున్నప్పుడు స్టడీ ఇచ్చే వ్యక్తికి సహాయం చేయండి. నైజీరియాలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న ఒక సహోదరి ఇలా చెప్తుంది: “మనతో పాటు వచ్చే మంచి స్నేహితులు స్టడీలో చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటారు. అవసరమైనప్పుడు ఉపయోగపడే విషయాల్ని చెప్తారు. అంతేగానీ, స్టడీ ఇచ్చే వ్యక్తి కన్నా వాళ్లే ఎక్కువగా మాట్లాడాలని చూడరు.” స్టడీలో ఏం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో మీరెలా తెలుసుకోవచ్చు? (సామె. 25:11) స్టడీ ఇచ్చే వ్యక్తి, విద్యార్థి ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వినండి. (యాకోబు 1:19 చదవండి.) అప్పుడు సరైన సమయంలో మీరు వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఏదైనా మాట్లాడే ముందు మీరు ఆలోచించాలి. ఉదాహరణకు మీరే ఎక్కువగా మాట్లాడకూడదు, స్టడీ ఇచ్చే వ్యక్తి చెప్తున్న దానికి అడ్డు తగలకూడదు, సంబంధం లేని వేరే విషయాల్ని తీసుకురాకూడదు. కానీ ఒక చిన్న మాట ద్వారా, ఉదాహరణ ద్వారా, లేదా ప్రశ్న ద్వారా చర్చిస్తున్న విషయం ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా మీరు సహాయం చేయవచ్చు. కొన్నిసార్లు మాట్లాడడానికి మీ దగ్గర ఏమీ లేదని మీరు అనుకోవచ్చు. కానీ మీరు విద్యార్థిని మెచ్చుకుని, శ్రద్ధ చూపించినప్పుడు ఆయన ప్రగతి సాధించేలా ఎంతో సహాయం చేసిన వాళ్లవుతారు.
10. మీ అనుభవం విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?
10 మీ అనుభవం చెప్పండి. విద్యార్థికి ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీరెలా సత్యం తెలుసుకున్నారో, ఏదైనా ఒక సమస్యను ఎలా దాటారో, లేదా మీ జీవితంలో యెహోవా సహాయాన్ని ఎలా రుచిచూశారో కొన్ని మాటల్లో చెప్పవచ్చు. (కీర్త. 78:4, 7) విద్యార్థికి సరిగ్గా అవసరమైనది అదే కావచ్చు. మీ అనుభవం వల్ల విద్యార్థి విశ్వాసం పెరగవచ్చు లేదా ప్రగతి సాధిస్తూ బాప్తిస్మం తీసుకోవాలని ఆయన కోరుకోవచ్చు. అంతేకాదు, తనకున్న ఒక సమస్య నుండి ఎలా బయటపడాలో ఆయన తెలుసుకోవచ్చు. (1 పేతు. 5:9) బ్రెజిల్లో పయినీరుగా సేవచేస్తున్న గాబ్రియెల్, తను స్టడీ తీసుకున్నప్పుడు ఏది సహాయం చేసిందో చెప్తున్నాడు. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “సహోదరుల అనుభవాలు విన్నప్పుడు, యెహోవా మనం పడే కష్టాల్ని చూస్తాడని నాకు అర్థమైంది. వాళ్లు వాటి నుండి బయటపడగలిగారంటే, నేను కూడా బయటపడగలను.”
విద్యార్థి మీటింగ్స్‌కి వచ్చినప్పుడు
11-12. మీటింగ్స్‌కి వచ్చే బైబిలు విద్యార్థుల్ని మనం ఎందుకు ప్రేమగా ఆహ్వానించాలి?
11 బైబిలు విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోవాలంటే, ఆయన క్రమంగా మీటింగ్స్‌కి రావాలి, వాటి నుండి ప్రయోజనం పొందాలి. (హెబ్రీ. 10:24, 25) సాధారణంగా, స్టడీ ఇచ్చే వ్యక్తి స్టడీ మొదలైన వెంటనే విద్యార్థిని మీటింగ్‌కి ఆహ్వానిస్తాడు. విద్యార్థి మీటింగ్స్‌కి వచ్చినప్పుడు, రాజ్యమందిరానికి వస్తూ ఉండమని మనందరం ప్రోత్సహించవచ్చు. మనం ఏయే విధాలుగా అలా చేయవచ్చు?
12 విద్యార్థిని ప్రేమగా ఆహ్వానించండి. (రోమా. 15:7) విద్యార్థి మీటింగ్స్‌కి వచ్చినప్పుడు మనం ప్రేమగా ఆహ్వానిస్తే, ఆయన రాజ్యమందిరానికి క్రమంగా రావాలని కోరుకునే అవకాశం ఉంది. విద్యార్థికి ఇబ్బంది కలిగించకుండా ఆప్యాయంగా పలకరించండి, ఆయన్ని వేరేవాళ్లకు పరిచయం చేయండి. ఆయన్ని స్టడీ ఇచ్చే వ్యక్తే చూసుకుంటాడులే అని అనుకోకండి. బహుశా స్టడీ ఇచ్చే వ్యక్తి మీటింగ్‌కి రావడం ఆలస్యం అయ్యుండవచ్చు లేదా ఆయనకు వేరే బాధ్యతలు ఉండివుండవచ్చు. విద్యార్థి ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి, ఆయన మీద శ్రద్ధ చూపించండి. ప్రేమగా పలకరించడం వల్ల ఎలాంటి ఫలితాలు రావచ్చు? ఈమధ్య కాలంలో బాప్తిస్మం తీసుకుని ఇప్పుడు సంఘ పరిచారకునిగా సేవచేస్తున్న దేమేత్రి అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన మొదటిసారి మీటింగ్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగిందో ఇలా చెప్తున్నాడు: “నేను రాజ్యమందిరం బయట భయంభయంగా నిలబడి ఉండడం ఒక సహోదరుడు చూశాడు. ఆయన దయగా నన్ను లోపలికి తీసుకెళ్లాడు. నన్ను పలకరించడానికి చాలామంది వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. అది నాకు ఎంత నచ్చిందంటే, వారంలో ప్రతీరోజు మీటింగ్ ఉంటే బావుండు అనిపించింది. నేను ఇలాంటిది ఎక్కడా చూడలేదు.”
13. మీ ప్రవర్తన బైబిలు విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?
13 మంచి ఆదర్శం ఉంచండి. ఇదే సత్యమని బైబిలు విద్యార్థికి నమ్మకం కుదరడానికి మీ ప్రవర్తన సహాయం చేయవచ్చు. (మత్త. 5:16) మాల్డోవాలో ఇప్పుడు పయినీరుగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “సంఘంలో ఉన్న వాళ్లు ఎలా జీవిస్తారో, ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో నేను గమనించాను. యెహోవాసాక్షులు నిజంగా దేవునితో నడుస్తారని నాకు నమ్మకం కుదిరింది.”
14. విద్యార్థి ప్రగతి సాధిస్తూ ఉండడానికి మీ ఆదర్శం ఎలా సహాయం చేయవచ్చు?
14 విద్యార్థి బాప్తిస్మం తీసుకోవాలంటే, ముందుగా నేర్చుకుంటున్న వాటిని పాటించాలి. అది అన్నిసార్లూ అంత తేలిక కాదు. కానీ బైబిలు సూత్రాలు పాటించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందుతున్నారో విద్యార్థి గమనించినప్పుడు, ఆయన కూడా వాటిని పాటించాలని కోరుకోవచ్చు. (1 కొరిం. 11:1) పైపేరాల్లో ప్రస్తావించిన హనాయి అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేర్చుకుంటున్న విషయాల్ని సహోదర సహోదరీలు ఎలా పాటిస్తున్నారో గమనించాను. నేను ఇతరులను ఎలా ప్రోత్సహించవచ్చో, క్షమించవచ్చో, ప్రేమించవచ్చో నేర్చుకున్నాను. వాళ్లు ఎప్పుడూ వేరేవాళ్ల గురించి మంచి విషయాలే మాట్లాడుకునేవాళ్లు. నాకూ వాళ్లలా ఉండాలనిపించింది.”
15. సామెతలు 27:17 ప్రకారం, మీటింగ్స్‌కి వస్తున్న విద్యార్థులకు మనం ఎందుకు స్నేహితులమవ్వాలి?
ఫిలి. 2:4) ఆయనతో మాట్లాడండి. మరీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఆయన ఏవైనా మార్పులు చేసుకుంటే మెచ్చుకోండి. ఆయన స్టడీ గురించి, కుటుంబం గురించి, పని గురించి అడగండి. అలా మాట్లాడడం వల్ల మీరు మంచి స్నేహితులు అవుతారు. దానివల్ల విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా మీరు సహాయం చేయగలుగుతారు. (సామెతలు 27:17 చదవండి.) ముందు మాట్లాడుకున్న హనాయి ఇప్పుడు క్రమ పయినీరుగా సేవచేస్తోంది. ఆమె మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టిన రోజుల్ని ఇలా గుర్తుచేసుకుంటుంది: “సంఘంలో ఉన్నవాళ్లు నాకు స్నేహితులయ్యాక, ఎప్పుడెప్పుడు మీటింగ్స్‌కి వెళ్దామా అని నాకు అనిపించేది. అంతేకాదు అలసిపోయినా మీటింగ్స్‌కి వెళ్లేదాన్ని. ఈ కొత్త స్నేహితులతో ఉండడం నాకు బాగా నచ్చింది. దానివల్ల యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం తెంచేసుకోగలిగాను. నేను యెహోవాకు, సహోదర సహోదరీలకు ఇంకా దగ్గరవ్వాలని కోరుకున్నాను. అందుకే బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.”
15 విద్యార్థికి స్నేహితులవ్వండి. విద్యార్థి మీటింగ్స్‌కి వస్తుండగా ఆయన మీద శ్రద్ధ చూపిస్తూ ఉండండి. (16. తాను కూడా సంఘంలో ఒకడినని అనిపించేలా, విద్యార్థికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?
16 విద్యార్థి మార్పులు చేసుకుంటుండగా, ఆయన కూడా సంఘంలో ఒకడని ఆయనకు అనిపించేలా సహాయం చేయండి. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మీరలా చేయవచ్చు. (హెబ్రీ. 13:2) మాల్డోవాలో సేవచేస్తున్న డెనిస్ అనే సహోదరుడు స్టడీ తీసుకున్న రోజుల్ని ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “సహోదరులు చాలాసార్లు నన్ను, నా భార్యను వాళ్ల ఇంటికి పిలిచారు. యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో చెప్పేవాళ్లు. అవి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. దానివల్ల యెహోవాను సేవించాలనే బలమైన కోరిక, మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం మాలో కలిగాయి.” బైబిలు విద్యార్థి ప్రచారకుడైన తర్వాత మీతో పాటు ప్రీచింగ్‌కి రమ్మని ఆయన్ని పిలవవచ్చు. బ్రెజిల్లో ఉంటున్న డీగో అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “తమతో పాటు ప్రీచింగ్‌కి రమ్మని చాలామంది సహోదరులు నన్ను పిలిచేవాళ్లు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి అదొక మంచి అవకాశం. నేను వాళ్ల గురించి తెలుసుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యెహోవాకు, యేసుకు ఇంకా దగ్గరయ్యాను.”
సంఘ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?
17. సంఘ పెద్దలు బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?
17 బైబిలు విద్యార్థుల కోసం సమయం తీసుకోండి. పెద్దలారా, మీరు చూపించే ప్రేమ, శ్రద్ధ వల్ల విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోగలుగుతారు. బైబిలు విద్యార్థులు మీటింగ్స్‌కి వచ్చినప్పుడు మీరు సమయం తీసుకుని వాళ్లతో మాట్లాడగలరా? మీరు వాళ్ల పేరు గుర్తుంచుకున్నప్పుడు, మరిముఖ్యంగా కామెంట్స్ చెప్పడానికి వాళ్లను పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్లమీద మీకెంత శ్రద్ధ ఉందో వాళ్లు గుర్తిస్తారు. ప్రచారకులు ఎవరైనా మిమ్మల్ని స్టడీకి పిలిచినప్పుడు మీ పనుల్ని సర్దుబాటు చేసుకుని వెళ్లగలరా? మీరలా వెళ్లడం విద్యార్థి మీద మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు.
నైజీరియాలో పయినీరుగా సేవచేస్తున్న జాకీ అనే సహోదరి ఇలా చెప్తోంది: “నాతోపాటు స్టడీకి వచ్చింది ఒక సంఘ పెద్ద అని తెలుసుకుని నా విద్యార్థుల్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక బైబిలు విద్యార్థి ఇలా అన్నాడు: ‘మా పాస్టరైతే ఎప్పుడూ ఇలా రాడు. ఆయన డబ్బున్న వాళ్ల ఇంటికే వెళ్తాడు, డబ్బులిస్తేనే వస్తాడు!’” ఆ విద్యార్థి ఇప్పుడు క్రమంగా మీటింగ్స్‌కి వస్తున్నాడు.18. అపొస్తలుల కార్యాలు 20:28 లో ఉన్న మాటల్ని సంఘ పెద్దలు ఎలా పాటించవచ్చు?
18 స్టడీలు చేస్తున్నవాళ్లకు శిక్షణ ఇవ్వండి, ప్రోత్సహించండి. సంఘ పెద్దలారా చక్కగా పరిచర్య చేసేలా, బైబిలు స్టడీలు చేసేలా ప్రచారకులకు సహాయం చేయాల్సిన బరువైన బాధ్యత మీకు ఉంది. (అపొస్తలుల కార్యాలు 20:28 చదవండి.) మీరు పక్కన ఉన్నప్పుడు స్టడీ చేయడానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, మీరే స్టడీ చేయవచ్చేమో అడగండి. ముందు చెప్పిన జాకీ ఇలా అంటోంది: “సంఘ పెద్దలు ఎప్పుడూ నా బైబిలు విద్యార్థుల గురించి అడుగుతుంటారు. ఏదైనా స్టడీ చేయడంలో నేను ఇబ్బంది పడుతుంటే వాళ్లు మంచి సలహా ఇస్తారు.” బైబిలు స్టడీ చేస్తున్న వాళ్లను సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రోత్సహించవచ్చు. (1 థెస్స. 5:11) జాకీ ఇంకా ఇలా అంటోంది: “సంఘ పెద్దలు నన్ను ప్రోత్సహించినప్పుడు, నా కృషిని మెచ్చుకున్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఎండనపడి వచ్చినప్పుడు ఒక గ్లాసు చన్నీళ్లు తాగితే ఎంత సేదదీర్పుగా ఉంటుందో, వాళ్ల మాటలు కూడా అంతే సేదదీర్పుగా ఉంటాయి. వాళ్లు మెచ్చుకున్నప్పుడు నామీద నాకు నమ్మకం పెరుగుతుంది, స్టడీలు చేయడంలో ఇంకా ఎక్కువగా ఆనందిస్తాను.—సామె. 25:25.
19. మనందరికీ ఏ అవకాశం ఉంది?
19 ప్రస్తుతం మనకు బైబిలు స్టడీ లేకపోయినా, ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా విద్యార్థులకు మనం సహాయం చేయవచ్చు. వేరేవాళ్ల స్టడీకి వెళ్లినప్పుడు మొత్తం మనమే మాట్లాడేయకుండా, మనం బాగా సిద్ధపడిన మాటల్ని చెప్పడం ద్వారా స్టడీ ఇచ్చే వ్యక్తికి సహాయం చేయవచ్చు. విద్యార్థులు రాజ్యమందిరానికి వచ్చినప్పుడు మనం వాళ్లకు స్నేహితులవ్వవచ్చు, వాళ్లకు మంచి ఆదర్శం ఉంచవచ్చు. అంతేకాదు, సంఘ పెద్దలు విద్యార్థుల కోసం సమయం తీసుకోవడం ద్వారా వాళ్లను ప్రోత్సహించవచ్చు. అలాగే, శిక్షణ ఇవ్వడం ద్వారా, మెచ్చుకోవడం ద్వారా స్టడీ ఇచ్చేవాళ్లను కూడా ప్రోత్సహించవచ్చు. ఒక వ్యక్తి మన తండ్రైన యెహోవాను ప్రేమించి, సేవించేలా సహాయం చేయడంలో మనకు చిన్న వంతు దొరికినా సంతోషిస్తాం. అంతకు మించిన ఆనందం ఇంకేదైనా ఉందా?
పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం
^ పేరా 5 ప్రస్తుతం మనలో కొంతమందికి బైబిలు స్డడీలు లేకపోవచ్చు. అయితే, ఒక వ్యక్తి ప్రగతి సాధించేలా మనలో ప్రతీఒక్కరం సహాయం చేయవచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.