అధ్యయన ఆర్టికల్ 9
యువకులారా, మీరు ఇతరుల నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?
“నీ యౌవనులు . . . మంచు బిందువుల్లా నీ దగ్గరికి వస్తారు.”—కీర్త. 110:3.
పాట 39 దేవుని ఎదుట మంచిపేరు సంపాదించుకుందాం
ఈ ఆర్టికల్‌లో . . . *
1. యువ సహోదరుల గురించి ఏం చెప్పవచ్చు?
యువ సహోదరులారా, మీరు సంఘానికి ఎన్నో విధాలుగా సహాయం చేయవచ్చు. మీలో చాలామందికి బలం, శక్తి ఉన్నాయి. (సామె. 20:29) మీరు సంఘానికి నిజంగా ఒక వరం. బహుశా మీరు సంఘ పరిచారకులు అవ్వాలని కోరుకుంటుండవచ్చు. అయితే అంత ప్రాముఖ్యమైన బాధ్యతను చేపట్టడానికి మీ వయసు, అనుభవం సరిపోవని వేరేవాళ్లు అనుకుంటారేమోనని మీరు భయపడుతుండవచ్చు. మీరు యువకులైనప్పటికీ సంఘంలో ఉన్నవాళ్ల నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవడానికి మీరు చేయగల విషయాలు కొన్ని ఉన్నాయి.
2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
2 ఈ ఆర్టికల్‌లో మనం దావీదు రాజు జీవితం గురించి పరిశీలిస్తాం. అలాగే యూదా రాజులైన ఆసా, యెహోషాపాతు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా చూస్తాం. ఆ ముగ్గురు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో, అప్పుడు వాళ్లు ఏం చేశారో, వాళ్ల ఉదాహరణ నుండి యువ సహోదరులు ఏం నేర్చుకోవచ్చో గమనిస్తాం.
దావీదు రాజు నుండి నేర్చుకోండి
3. యువకులు సంఘంలో ఉన్న వృద్ధులకు ఎలా సహాయం చేయవచ్చు?
3 యువకునిగా ఉన్నప్పుడు దావీదు ఇతరులకు ఉపయోగపడే నైపుణ్యాలు వృద్ధి చేసుకున్నాడు. ఆయనకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉంది. ఆయన సంగీతంలో మంచి నైపుణ్యం సంపాదించాడు, అంతేకాదు దేవుడు నియమించిన రాజైన సౌలు కోసం ఆ నైపుణ్యాన్ని ఉపయోగించాడు. (1 సమూ. 16:16, 23) యువకులారా, సంఘంలోని వాళ్లకు ఉపయోగపడే నైపుణ్యాలు ఏవైనా మీకున్నాయా? మీలో చాలామందికి ఉన్నాయి. ఉదాహరణకు, వ్యక్తిగత అధ్యయనం కోసం, మీటింగ్స్ కోసం తమ ఫోన్‌లను లేదా టాబ్లెట్‌లను ఎలా ఉపయోగించాలో ఎవరైనా నేర్పిస్తే బాగుండని కొంతమంది వృద్ధులు అనుకుంటారు. మీకు టెక్నాలజీ గురించి బాగా తెలుసు కాబట్టి మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు.
4. దావీదులాగే యువ సహోదరులు ఏ లక్షణాలు అలవర్చుకోవాలి? (ముఖచిత్రం చూడండి.)
4 దావీదు తన పనుల్లో బాధ్యతగల వాడని, నమ్మదగిన వాడని నిరూపించుకున్నాడు. ఉదాహరణకు, యువకుడిగా ఉన్నప్పుడు దావీదు తన తండ్రి గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్నిసార్లు అందులో ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నాడు. దాని గురించి దావీదు సౌలు రాజుతో ఇలా అన్నాడు: “నీ సేవకుడినైన నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు ఒకసారి సింహం, ఇంకోసారి ఎలుగుబంటి వచ్చి మంద నుండి ఒక గొర్రెను ఎత్తుకెళ్లాయి. నేను వాటి వెంటబడి, వాటిని కొట్టి, వాటి నోటి నుండి గొర్రెను రక్షించాను.” (1 సమూ. 17:34, 35) గొర్రెల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని దావీదు గుర్తించాడు, వాటిని కాపాడడానికి ఆయన ధైర్యంగా పోరాడాడు. ఏ పని అప్పగించినా దాన్ని శ్రద్ధగా చేయడం ద్వారా యువ సహోదరులు దావీదును అనుకరించవచ్చు.
5. కీర్తన 25:14 ప్రకారం, యువ సహోదరులు చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి?
5 యువకుడైన దావీదుకు యెహోవాతో చాలా దగ్గరి సంబంధం ఉంది. దావీదుకున్న ధైర్యం కన్నా, సంగీతంలో ఆయనకున్న నైపుణ్యం కన్నా ఆ సంబంధమే చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా దావీదుకు దేవుడు మాత్రమే కాదు, ఆయనకు స్నేహితుడు, చెప్పాలంటే చాలా దగ్గరి స్నేహితుడు. (కీర్తన 25:14 చదవండి.) యువ సహోదరులారా, మీరు చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని, మీ పరలోక తండ్రితో ఉన్న సంబంధాన్ని బలపర్చుకోవడమే. దానివల్ల మీరు మరిన్ని బాధ్యతలు పొందవచ్చు.
6. కొంతమంది దావీదును ఎలా చూశారు?
6 దావీదుకు ఎదురైన ఒక సమస్య ఏంటంటే, కొంతమంది ఆయన్ని బాధ్యతలేని వాడిలా, చిన్న పిల్లాడిలా చూశారు. ఉదాహరణకు గొల్యాతుతో పోరాడడానికి ముందుకొచ్చినప్పుడు సౌలు రాజు, “నువ్వు కేవలం బాలుడివి” అంటూ దావీదును ఆపడానికి ప్రయత్నించాడు. (1 సమూ. 17:31-33) దానికిముందు, సొంత అన్నయ్యే బాధ్యతలేని వాడంటూ దావీదును తిట్టాడు. (1 సమూ. 17:26-30) కానీ యెహోవా మాత్రం ఆయన్ని చిన్న పిల్లాడిలానో, బాధ్యతలేని వాడిలానో చూడలేదు. ఆయనకు దావీదు గురించి బాగా తెలుసు. దావీదు తన స్నేహితుడైన యెహోవా సహాయంతో గొల్యాతును చంపాడు.—1 సమూ. 17:45, 48-51.
7. దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన నుండి మీరేం నేర్చుకోవచ్చు?
7 దావీదు ఉదాహరణ నుండి మీరేం నేర్చుకోవచ్చు? మనం ఓపిగ్గా ఉండాలని దావీదు నుండి నేర్చుకుంటాం. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూసినవాళ్లు ఇప్పుడు మీరు బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఎదిగారని 1 సమూ. 16:7) దేవునితో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవాలని కూడా మనం దావీదు నుండి నేర్చుకుంటాం. ఆయన యెహోవా చేసిన సృష్టిని జాగ్రత్తగా గమనించాడు, అది సృష్టికర్త గురించి ఏం నేర్పిస్తుందో ఆలోచించాడు. (కీర్త. 8:3, 4; 139:14; రోమా. 1:20) మీరు ఇంకో పని కూడా చేయవచ్చు. మీకు కావాల్సిన బలాన్ని ఇవ్వమని యెహోవాను అడగవచ్చు. ఉదాహరణకు, మీరొక యెహోవాసాక్షి కాబట్టి స్కూల్లో తోటి పిల్లలు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? అలాగైతే, ఆ సమస్యను తట్టుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. అంతేకాదు బైబిల్లో, మన ప్రచురణల్లో, వీడియోల్లో ఉన్న సలహాల్ని పాటించండి. ఏదైనా సమస్యను తట్టుకోవడానికి యెహోవా సహాయం చేసిన ప్రతీసారి, ఆయన మీద మీకున్న నమ్మకం పెరుగుతుంది. మీరు యెహోవా మీద ఆధారపడడం వేరేవాళ్లు చూసినప్పుడు, వాళ్లు మిమ్మల్ని నమ్ముతారు.
గుర్తించడానికి సమయం పట్టవచ్చు. అయితే, యెహోవా దేవుడు కంటికి కనిపించేదాన్ని మాత్రమే చూడడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. మీరేంటో, మీ సామర్థ్యాలేంటో ఆయనకు బాగా తెలుసు. (8-9. రాజయ్యే వరకు ఓపిగ్గా ఉండడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? ఆయన నుండి యువ సహోదరులు ఏం నేర్చుకోవచ్చు?
8 దావీదుకు ఎదురైన మరో సమస్య పరిశీలించండి. దావీదు యౌవనంలోనే రాజుగా అభిషేకించబడినప్పటికీ, యూదాకు రాజుగా పరిపాలన మొదలుపెట్టడానికి చాలా సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. (1 సమూ. 16:13; 2 సమూ. 2:3, 4) అంతకాలం ఓపిగ్గా ఉండడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? ఆయన నిరుత్సాహంలో కూరుకుపోయే బదులు తాను చేయగల పనుల మీద మనసుపెట్టాడు. ఉదాహరణకు, ఒక సందర్భంలో దావీదు పారిపోయి ఫిలిష్తీయుల దేశంలో తలదాచుకున్నాడు. ఆయన ఆ సమయాన్ని ఇశ్రాయేలు శత్రువులతో పోరాడడానికి ఉపయోగించుకున్నాడు. అలా చేయడం ద్వారా యూదా ప్రాంత సరిహద్దుల్ని కాపాడాడు.—1 సమూ. 27:1-12.
9 దావీదు నుండి యువ సహోదరులు ఏం నేర్చుకోవచ్చు? తోటి సహోదరులకు సేవ చేయడానికి మీకున్న అవకాశాల్ని ఉపయోగించుకోండి. మనోజ్ * అనే సహోదరుని ఉదాహరణ పరిశీలించండి. దాదాపు పదేళ్ల వయసులోనే అతను పయినీరు సేవ చేయాలని కోరుకున్నాడు. అయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఇంకా కృషి చేయాలని సంఘ పెద్దలు చెప్పారు. అప్పుడు మనోజ్ నిరుత్సాహపడలేదు, కోపం పెంచుకోలేదు. బదులుగా, పరిచర్యలో ఇంకా ఎక్కువ సమయం గడిపాడు. మనోజ్ ఇలా చెప్తున్నాడు: “ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నేను మార్పులు చేసుకుని ప్రగతి సాధించడం మంచిదైంది. ఆసక్తి చూపించిన ప్రతీ ఒక్కర్ని కలవడానికి నేను కృషిచేశాను, అంతేకాదు ప్రతీసారి సిద్ధపడి వెళ్లాను. నా మొదటి బైబిలు స్టడీని కూడా ప్రారంభించాను. అలా పరిచర్య ఎక్కువ చేసేకొద్దీ నా మీద నాకు నమ్మకం పెరిగింది.” మనోజ్ ఇప్పుడు క్రమ పయినీరుగా సేవ చేస్తున్నాడు, అంతేకాదు సంఘ పరిచారకుడు కూడా అయ్యాడు.
10. ఒక సందర్భంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దావీదు ఏం చేశాడు?
10 దావీదు జీవితంలో జరిగిన మరో సంఘటన పరిశీలించండి. ఫిలిష్తీయుల దేశంలో తలదాచుకున్నప్పుడు దావీదు, ఆయన మనుషులు తమ కుటుంబాల్ని ఇళ్ల దగ్గర విడిచిపెట్టి యుద్ధం చేయడానికి వెళ్లారు. వాళ్లు లేని సమయం చూసుకుని శత్రువులు వాళ్ల ఇళ్ల మీద దాడిచేసి, వాళ్ల కుటుంబాల్ని బందీలుగా తీసుకెళ్లారు. దావీదు యోధునిగా తనకున్న అనుభవాన్నంతా ఉపయోగించి, ఆ బందీలను తిరిగి తీసుకురావడానికి ఒక తెలివైన పథకం ఆలోచించగలనని అనుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన నిర్దేశం కోసం యెహోవా మీద ఆధారపడ్డాడు. అబ్యాతారు అనే యాజకుని సహాయంతో దావీదు, “నేను ఈ దోపిడీ ముఠాను తరమనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అప్పుడు యెహోవా, “వాళ్లను తరుము, నువ్వు వాళ్లను తప్పకుండా పట్టుకుంటావు” అని చెప్పాడు. (1 సమూ. 30:7-10) ఈ సంఘటన నుండి మీరేం నేర్చుకోవచ్చు?
11. నిర్ణయాలు తీసుకునే ముందు మీరేం చేయవచ్చు?
11 నిర్ణయాలు తీసుకునే ముందు వేరేవాళ్ల సలహా ఎఫె. 4:8) వాళ్ల విశ్వాసాన్ని అనుకరించడం ద్వారా, వాళ్లు ఇచ్చే తెలివైన సలహాల్ని వినడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు ఆసా రాజు నుండి మనమేం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.
అడగండి. మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. అనుభవం గల పెద్దలతో మాట్లాడడం ద్వారా కూడా మీరు మంచి సలహా పొందవచ్చు. యెహోవా ఈ నియమిత పురుషుల్ని నమ్ముతున్నాడు కాబట్టి మీరూ నమ్మవచ్చు. యెహోవా వాళ్లను సంఘానికి ‘వరాలుగా’ ఇచ్చాడు. (ఆసా రాజు నుండి నేర్చుకోండి
12. తన పరిపాలన ప్రారంభంలో ఆసా రాజు ఏ లక్షణాలు చూపించాడు?
12 యువకుడిగా ఉన్నప్పుడు ఆసా వినయం, ధైర్యం చూపించాడు. ఉదాహరణకు వాళ్ల నాన్న అబీయా చనిపోయిన తర్వాత ఆసా రాజయ్యి, దేశంలో విగ్రహాలే లేకుండా చేశాడు. అంతేకాదు, ‘తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకమని, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని పాటించమని యూదావాళ్లకు చెప్పాడు.’ (2 దిన. 14:1-7) ఇతియోపీయుడైన జెరహు పది లక్షల మంది సైనికులతో యుద్ధానికి వచ్చినప్పుడు, ఆసా తెలివిగా సహాయం కోసం యెహోవా మీద ఆధారపడ్డాడు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు సహాయం చేసేవాళ్లు బలవంతులా, బలహీనులా అనేది నీకు లెక్క కాదు. మా దేవా, యెహోవా, మేము నీ మీద ఆధారపడుతున్నాం, మాకు సహాయం చేయి.” యెహోవా తనను, తన ప్రజల్ని కాపాడగలడని ఆసా ఎంతగా నమ్మాడో ఆ మాటలు తెలియజేస్తున్నాయి. ఆసా తన పరలోక తండ్రిని నమ్మాడు, ‘యెహోవా ఇతియోపీయుల్ని ఓడించాడు.’—2 దిన. 14:8-12.
13. తర్వాత ఆసా జీవితంలో ఏం జరిగింది? ఎందుకు?
13 పది లక్షల సైన్యంతో పోరాడడం అంటే మామూలు విషయం కాదు. కానీ యెహోవా సహాయంతో ఆసా ఆ పోరాటంలో విజయం సాధించాడు. అంతకన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆసా యెహోవా మీద ఆధారపడలేదు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న చెడ్డ రాజైన బయెషా తన మీదికి వచ్చినప్పుడు, ఆసా సిరియా రాజును సహాయం అడిగాడు. ఆ నిర్ణయం వల్ల ఘోరమైన ఫలితాలు వచ్చాయి! తన ప్రవక్త అయిన హనానీ ద్వారా యెహోవా ఆసాకు ఇలా చెప్పాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా, సిరియా రాజు మీద ఆధారపడ్డావు కాబట్టి, సిరియా రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకుంది.” యెహోవా చెప్పినట్టుగానే, అప్పటినుండి ఆసా జీవితంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. (2 దిన. 16:7, 9; 1 రాజు. 15:32) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?
14. మీరు యెహోవా మీద ఎలా ఆధారపడవచ్చు? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయని 1 తిమోతి 4:12 చెప్తుంది?
14 వినయం చూపిస్తూ యెహోవా మీద ఆధారపడుతూనే ఉండండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు యెహోవా మీద ఎంతో విశ్వాసం, నమ్మకం చూపించారు. సామె. 3:5, 6) అలా చేస్తే మీరు యెహోవాను సంతోషపెడతారు, మీ సంఘంలోని వాళ్ల గౌరవాన్ని సంపాదించుకుంటారు.—1 తిమోతి 4:12 చదవండి.
యెహోవా కూడా మిమ్మల్ని తన కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానించాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, యెహోవా మీద ఆధారపడుతూనే ఉండాలి. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు యెహోవా మీద ఆధారపడడం తేలిగ్గానే అనిపించవచ్చు. కానీ చిన్నచిన్న నిర్ణయాల సంగతేంటి? ఎలాంటి వినోదం ఎంచుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు మీరు యెహోవా మీద నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో కదా! మీ సొంత తెలివి మీద ఆధారపడకండి. బదులుగా మీ పరిస్థితులకు సరిపోయే బైబిలు సూత్రాల్ని వెతికి, వాటిని పాటించండి. (యెహోషాపాతు రాజు నుండి నేర్చుకోండి
15. రెండో దినవృత్తాంతాలు 18:1-3; 19:2 ప్రకారం, యెహోషాపాతు ఏ పొరపాట్లు చేశాడు?
15 నిజమే, అందరిలాగే మీరు కూడా అపరిపూర్ణులు కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. అంతమాత్రాన యెహోవా సేవలో మీరు చేయగలిగినదంతా చేయడం ఆపకండి. యెహోషాపాతు రాజు ఉదాహరణ గురించి ఆలోచించండి. ఆయనకు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. యువకుడిగా ఉన్నప్పుడు, “అతను తన తండ్రి సేవించిన దేవుణ్ణి వెదికి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు.” అంతేకాదు ప్రజలకు యెహోవా గురించి బోధించడానికి తన అధిపతుల్ని యూదా నగరాలన్నిటికీ పంపించాడు. (2 దిన. 17:4, 7) అన్ని మంచిపనులు చేసినా, యెహోషాపాతు కొన్నిసార్లు తెలివితక్కువ నిర్ణయాలు తీసుకున్నాడు. అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, యెహోవా తన సేవకుణ్ణి పంపించి యెహోషాపాతును సరిదిద్దాడు. (2 దినవృత్తాంతాలు 18:1-3; 19:2 చదవండి.) దీని నుండి మీరేం నేర్చుకోవచ్చు?
16. రాకేష్ అనుభవం నుండి మీరేం నేర్చుకోవచ్చు?
16 ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని విని, పాటించండి. బహుశా, చాలామంది యువకుల్లాగే మీకు కూడా మీ జీవితంలో యెహోవా సేవకే మొదటి స్థానం ఇవ్వడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిరుత్సాహపడకండి. రాకేష్ అనే యువ సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన టీనేజీలో జరిగిన విషయాల గురించి ఇలా చెప్తున్నాడు: “కొన్నిసార్లు నా జీవితంలో ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. సాధారణంగా నా వయసువాళ్లు ఆటలు ఆడడాన్ని, సరదాగా ఉండడాన్ని ఇష్టపడతారు. నేను కూడా మీటింగ్స్, ప్రీచింగ్ కన్నా వాటినే ఎక్కువ ఇష్టపడేవాన్ని.” మరి రాకేష్‌కు ఏది సహాయం చేసింది? దయగల ఒక సంఘ పెద్ద ఆయనకు సలహా ఇచ్చాడు. రాకేష్ ఇలా అంటున్నాడు: “ఒక పెద్ద 1 తిమోతి 4:8లో ఉన్న సూత్రం గురించి ఆలోచించేలా నాకు సహాయం చేశాడు.” రాకేష్ ఆ సలహాను వినయంగా అంగీకరించి, తన జీవితంలో వేటికి మొదటి స్థానం ఇస్తున్నాడో గమనించుకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నా జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.” దానివల్ల ఏం జరిగింది? ఆ సలహా తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత రాకేష్ సంఘ పరిచారకుడు అయ్యాడు.
మీ పరలోక తండ్రి మిమ్మల్ని చూసి గర్వపడేలా నడుచుకోండి
17. యెహోవాను సేవిస్తున్న యువకుల్ని చూసి వృద్ధులకు ఎలా అనిపిస్తుంది?
17 యువ సహోదరులారా, తమతో కలిసి యెహోవాను “ఐక్యంగా” సేవిస్తున్న మిమ్మల్ని వృద్ధులు ఎంతో విలువైనవాళ్లుగా చూస్తున్నారు! (జెఫ. 3:9) మీకు ఇచ్చిన పనిని మీరు ఉత్సాహంగా, చురుగ్గా చేయడం వాళ్లకు నచ్చుతుంది. మీరు వాళ్లకు ఎంతో ప్రియమైనవాళ్లు.—1 యోహా. 2:14.
18. సామెతలు 27:11 చెప్తున్నట్టు, తనను సేవించే యువకుల్ని చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
18 యువ సహోదరులారా, యెహోవాకు మీమీద ప్రేమ, నమ్మకం ఉన్నాయని ఎన్నడూ మర్చిపోకండి. చివరిరోజుల్లో చాలామంది యువకులు తనను సేవించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొస్తారని యెహోవా ముందే చెప్పాడు. (కీర్త. 110:1-3) మీరు తనను ప్రేమిస్తున్నారని, తన సేవలో చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నారని ఆయనకు తెలుసు. కాబట్టి ఇతరుల విషయంలో, అలాగే మీ విషయంలో ఓపిక చూపించండి. మీరు పొరపాట్లు చేసినప్పుడు మీకు ఇచ్చే సలహాను, క్రమశిక్షణను అంగీకరించండి. యెహోవాయే వాటిని ఇస్తున్నాడని గుర్తించండి. (హెబ్రీ. 12:6) మీకు ఏ పని ఇచ్చినా కష్టపడి చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా, మీరు ఏం చేసినా మీ పరలోక తండ్రి మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయండి.—సామెతలు 27:11 చదవండి.
పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’