దేవుడు మాటిస్తున్నాడు మానసిక సమస్యలు ఇక ఉండవు
మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి అవసరమయ్యే సలహాల్ని, ఊరటను దేవుడు బైబిలు ద్వారా ఇస్తున్నాడు.
అదొక్కటే కాదు, మానసిక సమస్యలకు కారణమయ్యే వాటన్నిటినీ శాశ్వతంగా తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు.
ఆయన ఆ మాటను నెరవేర్చినప్పుడు మనం అనుభవించిన మానసిక వేదన, ఒంటరితనం లాంటి “పాత సంగతులు గుర్తుకురావు. అవి హృదయంలో కూడా ఉండవు.” ఈ మాట వినగానే గుండెల్లో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది కదా!—యెషయా 65:17.
మీకు ఇష్టమైతే యెహోవాసాక్షులు మిమ్మల్ని కలిసి, దేవుడు ఈ మాటను ఎప్పుడు, ఎలా నెరవేరుస్తాడో వివరిస్తారు.