కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2 సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం

2 సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం

జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు చాలాకాలం ఉంటాయి, కొన్నిసార్లు సంవత్సరాలు ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకునేలోపే అవి లోతుగా పాతుకుపోతాయి. వదిలిపెట్టకుండా విసిగించే అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని బైబిలు మనకు ఇస్తుందా? కొన్ని ఉదాహరణలు చూడండి.

ఎక్కువగా ఆందోళన పడడం

రోసీ ఇలా చెప్తుంది, “నేను మనసులో ఏదేదో అనుకుని లేదా ఏదో ఘోరం జరిగినట్లు ఊహించుకుని ఎప్పుడూ కంగారు పడుతుంటాను.” బైబిల్లో ఉన్న సలహాలు ఆమెకు సహాయం చేశాయి. వాటిలో ఒకటి మత్తయి 6:34: “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, ఎందుకంటే రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి. ఈరోజు ఉన్న సమస్యల గురించి మాత్రమే ఆలోచించండి.” యేసు చెప్పిన ఆ మాటలు రేపు ఏమి జరుగుతుందో అని కంగారు పడకుండా ఉండడానికి తనకు సహాయం చేశాయని రోసీ ఇప్పుడు చెప్తుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “నాకు ఇప్పటికే చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకా జరగని వాటి గురించి లేదా అసలు ఎప్పటికీ జరగని వాటి గురించి ఆలోచిస్తూ నేను వాటిని ఇంకా ఎక్కువ చేసుకోదలచుకోలేదు.”

యాస్మిన్‌ కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉండేది. “వారంలో రెండు రోజులు బాగా ఏడుస్తాను, కొన్ని రోజులు రాత్రులు నిద్రపోలేను. ప్రతికూల ఆలోచనలు నన్ను బాగా వేధిస్తున్నట్లు అనిపిస్తుంది.” బైబిల్లో ఉన్న ఏ సలహా ఆమెకు సహాయం చేసింది? ఆమె 1 పేతురు 5:7 గురించి చెప్పింది: “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.” యాస్మిన్‌ ఇలా అంటుంది: “సమయం గడుస్తుండగా నేను యెహోవాకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఆయన నా ప్రార్థనలను విన్నాడు. నా భుజాల మీద నుండి పెద్ద బరువు తీసేసినట్లు నాకు అనిపించింది. ఇప్పటికీ అప్పుడప్పుడు నాకు ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి, కానీ ఇప్పుడు నాకు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు.”

పనులు వాయిదా వేయడం

ఇసబెల అనే యువతి ఇలా చెప్తుంది: “పనులు వాయిదా వేయడం నాకు మా డాడీ నుండి వచ్చిందనుకుంటా, ఆయన కూడా అలాగే చేసేవాడు. నేను ఊరికే రిలాక్స్‌ అవడం కోసం లేదా TV చూడడం కోసం ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటాను. అది చాలా ప్రమాదకరమైన అలవాటు ఎందుకంటే దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేము.” ఆమెకు సహాయం చేసిన బైబిలు సలహా 2 తిమోతి 2:15, అక్కడ ఇలా ఉంది: “దేవుడు ఆమోదించిన సేవకుడిగా, ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా . . . దేవునికి కనబర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేయి.” ఇసబెల ఇలా అంటుంది, “నేను పనులను వాయిదా వేస్తూ అలా నా పనుల వల్ల యెహోవాను సిగ్గుపర్చాలని అనుకోవడం లేదు.” ఆమె బాగా ప్రగతి సాధించింది.

కెల్సీ కూడా ఇలాగే చెప్తుంది: “నేను ఒక ప్రాజెక్ట్‌ చేయాల్సి ఉంటుంది, కానీ నేను దాన్ని ఆఖరి క్షణం వరకు చేయను. తర్వాత ఏడుస్తాను, నిద్రపోను, కంగారు పడతాను. అది నాకు అస్సలు మంచిది కాదు.” కెల్సీకి సామెతలు 13:16 సహాయం చేసింది: “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.” ఈ సలహాను లోతుగా ఆలోచించినప్పుడు ఆమె ఈ విషయాలు నేర్చుకుంది: “ముందుగా ప్రణాళికలు వేసుకుని వాటి ప్రకారం పనులు చేయడం తెలివైన పని. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు గురించి షెడ్యూల్‌ వేసుకుని నా టేబుల్‌ మీద పెట్టుకుంటాను, అప్పుడు చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా ఆ షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి చేసుకుంటాను.”

ఒంటరితనం

“నా భర్త నన్ను, నా నలుగురు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు” అని కర్‌స్టెన్‌ చెప్తుంది. ఆమెకు ఏ బైబిలు సలహా సహాయం చేసింది? సామెతలు 17:17 ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” కర్‌స్టెన్‌ తనలా సంఘంలో యెహోవాను సేవించేవాళ్ల సహాయం తీసుకుంది. ఆమెకు సహాయం దొరికిందా? “నా స్నేహితులు ఎన్నోసార్లు నన్ను కలుస్తూ ఉన్నారు! కొంతమంది మా తలుపు దగ్గర సరుకులను, పూలను పెట్టి వెళ్లేవాళ్లు. మేము ఇళ్లు మారుతుంటే మూడుసార్లు కొంతమంది చిన్న సైన్యంలా వచ్చి నాకు, నా పిల్లలకు సహాయం చేశారు. ఒకరు నాకు ఉద్యోగం సంపాదించుకునేందుకు సహాయం చేశారు. నా స్నేహితులు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు.”

ముందు మాట్లాడుకున్న దియా కూడా ఒంటరితనంతో అలాగే బాధపడింది. ఇన్ని పోగొట్టుకున్నాక ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “అందరూ కలిసి వాళ్ల జీవితాన్ని ఆనందిస్తున్నారు కానీ నేను ఒక్కదాన్నే ఒంటరిగా సంతోషం లేకుండా ఉన్నట్లు నాకు అనిపించింది.” ఆమెకు సహాయం చేసిన బైబిలు సలహా కీర్తన 68:6: ఒంటరిగా ఉన్నవాళ్లకు దేవుడు నివసించడానికి ఒక ఇంటిని ఇస్తాడు. ఆమె ఇలా వివరిస్తుంది: “నాకు తెలుసు దానర్థం దేవుడు నిజంగా ఒక ఇంటిని ఇస్తాడని కాదు. కానీ, దేవుడు ఆధ్యాత్మిక భావంలో ఒక ఇంటిని ఇస్తాడని నాకు అర్థం అయ్యింది. అంటే నిజమైన భద్రతతో, యెహోవాను ప్రేమించే ప్రజలతో స్వచ్ఛమైన ప్రేమానురాగాలను ఇస్తాడు. కానీ మొదట యెహోవాకు దగ్గర అవ్వకపోతే వేరేవాళ్లకు దగ్గర అవ్వలేనని నాకు తెలుసు. కీర్తన 37:4 నాకు సహాయం చేసింది: ‘యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.’”

ఆమె ఇలా నిర్ణయించుకుంది: “యెహోవాతో నా సంబంధాన్ని మరింత పెంచుకోవాలని నేను గ్రహించాను. ఆయన ఎంతెంతో మంచివాడు. నేను ఇతరులతో కలిసి సంతోషంగా చేయగల పనులను రాసి పెట్టుకున్నాను, అలా నేను యెహోవాను ప్రేమించే వాళ్లను స్నేహితులుగా చేసుకోగలను. ఇతరులలో మంచిని చూడడం నేర్చుకున్నాను, వాళ్లలో లోపాలను చూసీచూడనట్లు వదిలేయడం నేర్చుకున్నాను.”

నిజమే, యెహోవాను సేవించేవాళ్లు కూడా అపరిపూర్ణులే. ఇతరుల్లానే యెహోవాసాక్షులు కూడా సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. కానీ బైబిలు ఇచ్చే శిక్షణ అవకాశం దొరికిన ప్రతిసారి ఇతరులకు సహాయం చేయడానికి కదిలిస్తుంది. అలాంటివాళ్లను స్నేహితులుగా చేసుకోవడం తెలివైన పని. కానీ, ఇప్పుడు పరిష్కరించలేని సమస్యల విషయంలో కూడా అంటే ఎక్కువకాలంగా బాధిస్తున్న జబ్బులు, దుఃఖం వంటి విషయాల్లో కూడా బైబిలు సలహాలు సహాయం చేస్తాయా?

బైబిలు సలహాలు పాటిస్తే, కష్టాల్లో మద్దతు ఇచ్చే నిజమైన స్నేహితులను మీరు పొందవచ్చు