కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయి

ఈ వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయి

యేసు ప్రవచించినట్లుగా, భూమి అంతటా దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించబడాలి. (మత్తయి 24:14) బైబిల్లో ఉన్న దానియేలు పుస్తకం ఈ రాజ్యాన్ని దేవుని ప్రభుత్వం అని అంటుంది. ఆ పుస్తకం 2వ అధ్యాయంలో, ప్రాచీన బబులోను నుండి మన కాలం వరకు వరుసగా పరిపాలించిన ముఖ్యమైన ప్రభుత్వాల లేదా రాజ్యాల పేర్లు ఉన్న ప్రవచనం ఉంది. ఇంకా జరగబోయే దాన్ని వివరిస్తూ 44వ వచనం ఇలా చెప్తుంది:

“పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”

మానవ ప్రభుత్వాల స్థానంలో దేవుని రాజ్యం భూమ్మీద ఉన్న ప్రజలకు శాంతిని, సమాధానాన్ని తీసుకువస్తుందని ఈ ప్రవచనం, బైబిల్లోని మరికొన్ని ప్రవచనాలు చెప్తున్నాయి. దేవుని రాజ్యంలో మన జీవితం ఎలా ఉంటుంది? త్వరలోనే నెరవేరే కొన్ని అద్భుతమైన వాగ్దానాలు చూడండి.

అంటే పరదైసులో మరణం లేని పరిపూర్ణ జీవితం ఉంటుంది! మన ప్రేమగల సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మనకు ఇస్తానని వాగ్దానం చేసిన జీవితం అదే.

  • యుద్ధాలు ఇక ఉండవు

    కీర్తన 46:9: “ఆయనే [దేవుడే] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”

    ఆయుధాలను తయారుచేయడానికి ఖర్చు చేస్తున్న మొత్తం డబ్బును, నైపుణ్యాన్ని ప్రజలను చంపడానికి కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ఖర్చుపెడితే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి! ఈ ప్రవచనం దేవుని రాజ్యంలో నిజమౌతుంది.

  • అనారోగ్యం ఇక ఉండదు

    యెషయా 33:24: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”

    గుండె జబ్బులు, క్యాన్సర్‌, మలేరియా, ఏ చిన్న ఆరోగ్య సమస్యలు లేని ప్రపంచం గురించి ఆలోచించండి.ఆస్పత్రులు, మందులతో ఇక అవసరం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యమే భూమ్మీద ప్రజల భవిష్యత్తు.

  • ఆహార కొరత ఇక ఉండదు

    కీర్తన 72:16: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”

    ప్రతి ఒక్కరికి సరిపోయే ఆహారం భూమ్మీద పండుతుంది, ఆ ఆహారం అందరికీ అందుతుంది. ఆకలితో అలమటించే వాళ్లు, పోషకాహార లేమితో బాధపడే వాళ్లు ఎవ్వరూ ఉండరు.

  • నొప్పి, బాధ, మరణం ఇక ఉండవు

    ప్రకటన 21:4: “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”

    అంటే పరదైసులో మరణం లేని పరిపూర్ణ జీవితం ఉంటుంది! మన ప్రేమగల సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మనకు ఇస్తానని వాగ్దానం చేసిన జీవితం అదే.

దేవుని మాట సఫలం అవుతుంది

ఇవన్నీ ఖచ్చితంగా నిజమౌతాయా? బైబిల్లో వాగ్దానం చేయబడిన, అందులో వర్ణించబడిన జీవితం బాగుంటుందని చాలామంది ఒప్పుకుంటారు కానీ వేర్వేరు కారణాలను బట్టి నిరంతరం జీవించడం అనే ఆలోచనను అర్థంచేసుకోవడం వాళ్లకు కష్టంగా ఉంటుంది. అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు ఎందుకంటే దాని గురించి మనకు చెప్పడానికి ఇప్పటి వరకు ఏ మనిషి కూడా అలాంటి జీవితాన్ని అనుభవించలేదు.

మనుషులు అందరూ పాపానికి, మరణానికి బానిసలుగా ఉన్నారు, ఎంతోకాలంగా నొప్పి, బాధ, విపత్తుల వల్ల నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి జీవితం అంటే ఇక ఇంతే, కష్టాలు సహజం అనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు మనుషుల కోసం సంకల్పించిన దానికి అది పూర్తి వ్యతిరేకం.

దేవుడు వాగ్దానం చేసినవన్నీ తప్పకుండా జరుగుతాయనే నమ్మకాన్ని మనలో కలిగించడానికి ఆయన మాట గురించి దేవుడు ఇలా చెప్పాడు: “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:11.

బైబిల్లో యెహోవా గురించి “అబద్ధమాడలేని దేవుడు” అని ఉంది. (తీతు 1:2) భవిష్యత్తు గురించి ఆయన ఇలాంటి అద్భుతమైన వాటన్నిటిని వాగ్దానం చేశాడు కాబట్టి, మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: వాగ్దానం చేయబడిన పరదైసు భూమ్మీద నిరంతరం జీవించడం మనుషులకు సాధ్యమేనా? దేవుని వాగ్దానం నుండి ప్రయోజనం పొందడానికి మనం ఏమి చేయాలి? తర్వాత పేజీల్లో ఈ ప్రశ్నల గురించిన సమాచారాన్ని మీరు చూస్తారు.