మీరు నమ్మేవాటిని నిజాలతో పోల్చి చూసుకోండి
మీరు క్రైస్తవులా? అయితే భూమి మీదున్న 200 కోట్లకన్నా ఎక్కువమందిలో మీరు ఒకరు. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. ఈ రోజు క్రైస్తవ మతంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయి, వాళ్లందరికీ వేర్వేరు సిద్ధాంతాలు, వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు క్రైస్తవులైనప్పటికీ మీరు నమ్మే విషయాలు ఇతర క్రైస్తవులు నమ్మే విషయాలు వేరుగా ఉండవచ్చు. మరి మీరు నమ్మేది నిజమా కాదా తెలుసుకోవడం అవసరమా? అవును, ఒకవేళ మీరు బైబిల్లో ఉన్న విషయాలు పాటించాలనుకుంటే, అవసరమే.
యేసుక్రీస్తు తొలి అనుచరులను “క్రైస్తవులు” అని పిలిచేవాళ్లు. (అపొస్తలుల కార్యములు 11:26) అప్పుడు క్రైస్తవ విశ్వాసం ఒకటే ఉండేది కాబట్టి వాళ్లను వేర్వేరు పేర్లతో పిలవాల్సిన అవసరం ఉండేది కాదు. క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసు బోధల్ని, నిర్దేశాల్ని క్రైస్తవులు అందరూ అనుసరిస్తూ ఐక్యంగా ఉన్నారు. మరి మీ చర్చ్ అలాగే ఉందా? యేసు నేర్పించిన విషయాలను, మొదట్లో ఆయన్ను అనుసరించిన వాళ్లు నమ్మిన విషయాలను మీ చర్చ్ బోధిస్తుందని మీకు అనిపిస్తుందా? అది మీరెలా తెలుసుకోవచ్చు? దానికి మార్గం ఒక్కటే. మీ నమ్మకాలను బైబిలుతో పోల్చి చూసుకోవడం.
మార్కు 7:9-13) కాబట్టి యేసు నిజ అనుచరుల నమ్మకాలు బైబిలు ప్రకారమే ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి క్రైస్తవుడు, ‘నా చర్చ్ నేర్పించే విషయాలు బైబిలు ప్రకారం ఉన్నాయా లేదా?’ అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబుగా మీ చర్చ్ నేర్పించే విషయాలను బైబిలు నిజంగా చెప్తున్న విషయాలతో పోల్చుకోండి.
దీని గురించి ఆలోచించండి: లేఖనాలన్నీ దేవుని వాక్యమని యేసుక్రీస్తు నమ్మాడు. వాటిని చాలా గౌరవించాడు. మనుషులు కల్పించిన ఆచారాలకు విలువిచ్చి, బైబిలు బోధల్ని నీరుగార్చిన వాళ్లను ఆయన చేరనివ్వలేదు. (మన ఆరాధన సత్యంపై ఆధారపడి ఉండాలని యేసు చెప్పాడు. ఆ సత్యం బైబిల్లోనే ఉంది. (యోహాను 4:24; 17:17) అపొస్తలుడైన పౌలు కూడా మన రక్షణ “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” పైన ఆధారపడి ఉంటుందని చెప్పాడు. (1 తిమోతి 2:4) కాబట్టి మన నమ్మకాలు బైబిలు ఆధారంగా ఉండడం చాలా ముఖ్యం. లేకపోతే మనకు రక్షణ ఉండదు.
మనం నమ్మేవాటిని బైబిలుతో ఎలా పోల్చుకుని చూసుకోవాలి
ఇక్కడ ఇచ్చిన ఆరు ప్రశ్నల్ని వాటికి బైబిలిచ్చే జవాబుల్ని చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఇచ్చిన వచనాలు చూసి వాటి గురించి ఆలోచించండి. తర్వాత ఇలా ప్రశ్నించుకోండి, ‘నా చర్చి బోధలు బైబిలుతో పోలిస్తే ఎలా ఉన్నాయి?’
ఈ చిన్న క్విజ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ చర్చి బోధల్ని బైబిలుతో పోల్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బైబిలు సత్యాల్ని స్పష్టంగా తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు. బైబిలు స్టడీ కోసం వాళ్లను అడగండి. లేదా మా వెబ్సైట్ jw.org చూడండి. (w16-E No. 4)