కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?

చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?

మరణంవల్ల మనందరం బాధపడతాం. కానీ చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా? చనిపోయినవాళ్లను దేవుడు పూర్తిగా మర్చిపోయాడా? వాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?

బైబిలు ఇలా చెప్తుంది:

చనిపోయినవాళ్లను దేవుడు మర్చిపోడు

“సమాధుల్లో ఉన్న వాళ్లందరూ . . . బయటికి వస్తారు.” —యోహాను 5:28, 29.

చనిపోయినవాళ్లను దేవుడు గుర్తు చేసుకుంటాడు; ఆయన జ్ఞాపకంలో ఉన్నవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.

చనిపోయినవాళ్లు మళ్లీ భూమ్మీద బ్రతుకుతారు

“నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడు.” —అపొస్తలుల కార్యాలు 24:15.

కోట్లాదిమంది మళ్లీ బ్రతికి, శాంతిసమాధానాల మధ్య ఎప్పటికీ జీవించే అవకాశం పొందుతారు.

పునరుత్థానం జరుగుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు

“నక్షత్రాల సంఖ్యను [దేవుడు] లెక్కపెడుతున్నాడు; వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు.”—కీర్తన 147:4, NW.

దేవుడు నక్షత్రాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడంటే, పునరుత్థానం చేయాలనుకునే వాళ్లను కూడా తేలిగ్గా గుర్తుపెట్టుకోగలడు.