బైబిలు ఏమి చెప్తుంది?
ఆందోళన తగ్గించుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందా?
మీకేం అనిపిస్తుంది?
అవును
కాదు
తెలీదు
పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?
“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా [దేవుడు] మీద వేయండి.” (1 పేతురు 5:7) మన ఆందోళనల నుండి దేవుడు ఉపశమనాన్ని ఇస్తాడని బైబిలు అభయం ఇస్తుంది.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?
ప్రార్థన ద్వారా వచ్చే “దేవుని శాంతి” మీ ఆందోళనను తగ్గిస్తుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.
అంతేకాకుండా, దేవుని వాక్యం చదవడం ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. —మత్తయి 11:28-30.
ఆందోళన ఎప్పటికైనా పూర్తిగా పోతుందా?
కొందరి నమ్మకాలు:
ఆందోళన, ఒత్తిడి మనిషి జీవితంలో ఒక భాగం అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది మనం చనిపోయిన తర్వాతే ఆందోళనలు పోతాయని నమ్ముతారు. మీరేమంటారు?
పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?
దేవుడు ఆందోళన కలిగించే వాటిని తీసేస్తాడు. “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?
దేవుని రాజ్యంలో ప్రజలు శాంతితో ప్రశాంతంగా జీవిస్తారు.—యెషయా 32:18.
అనవసరమైన ఆందోళన, ఒత్తిడి ఇక ఉండవు.—యెషయా 65:17.