కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

ఆ మార్గాన్ని ఎలా కనుక్కోవాలి

ఆ మార్గాన్ని ఎలా కనుక్కోవాలి

మీరు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీ సంతోషానికి కారణం ఏంటి? మీ కుటుంబమా, మీరు చేసే పనా, మీ మత నమ్మకాలా? బహుశా మీకు సంతోషాన్ని తీసుకురాబోయే విషయాల కోసం మీరు ఎదురు చూస్తుండవచ్చు. అంటే, మీ స్కూల్‌ చదువు అయిపోవాలని, లేదా మంచి ఉద్యోగం రావాలని, లేదా కొత్త కారు కొనుక్కోవాలని మీరు ఎదురు చూస్తుండవచ్చు.

చాలామంది వాళ్లు అనుకున్న ఒక లక్ష్యాన్ని సాధించాక లేదా కోరుకున్న వస్తువును పొందాక కొంత సంతోషాన్ని పొందవచ్చు. సముద్రంలో వచ్చే అలలా అలాంటి సంతోషం ఎంత కాలం ఉంటుంది? కొంతకాలమే. ఈ విషయం కాస్త నిరాశ కలిగించవచ్చు.

సంతోషాన్ని ఇలా వర్ణించారు: సంతోషం అంటే క్షేమంగా ఉన్నామనే ఒక స్థితి. అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపట్లో పోయేది కాదు. జీవితంలో కొద్దిపాటి సంతృప్తి కలిగినప్పుడు లేదా ఎంతో లోతైన ఆనందం కలిగినప్పుడు వచ్చే భావాలన్నీ సంతోషంలో భాగమే, కానీ ఈ భావాలు అలానే ఉండిపోతేనే అది నిజమైన సంతోషం.

అలా క్షేమంగా కొనసాగే స్థితి కాబట్టి,

సంతోషాన్ని ఒక గమ్యంగా లేదా లక్ష్యంగా వర్ణించలేము. అది ఒక ప్రయాణం. “ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను” అని అంటున్నామంటే మనం సంతోషాన్ని వాయిదా వేసుకుంటున్నామని అర్థం.

దీన్ని వివరించడానికి సంతోషాన్ని మంచి ఆరోగ్యంతో పోల్చి చూద్దాం. శారీరకంగా బాగుంటే మనం ఎంతో ఆనందిస్తాము. అందుకే మంచి ఆరోగ్యం కోసం మనం ఆహారం, ఎక్సర్‌సైజ్‌, మొత్తం లైఫ్‌స్టైల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. సంతోషం కూడా జీవితంలో మంచి దారిలో నడిచినప్పుడు, మంచి నియమాలకు అనుగుణంగా జీవించినప్పుడు వచ్చే ఫలితం.

జీవితంలో ఏ నియమాలు లేదా లక్షణాలు సంతోషాన్ని తీసుకొస్తాయి? కొన్ని నియమాలు లేదా లక్షణాలు మిగతా వాటికన్నా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఇచ్చినవి సంతోషానికి చాలా ముఖ్యం:

  • సంతృప్తి, దానం లేదా సహాయం చేసే లక్షణం

  • మంచి ఆరోగ్యం, తట్టుకునే లేదా కోలుకునే లక్షణం

  • ప్రేమ

  • క్షమించే లక్షణం

  • జీవిత ఉద్దేశం

  • నిరీక్షణ లేదా ఆశ

ఒక మంచి పుస్తకంలో ఇలా ఉంది: నిర్దోషమైన మార్గంలో నడిచేవాళ్లు సంతోషంగా ఉంటారు. (కీర్తన 119:1) ఆ మార్గం గురించి ఇప్పుడు చూద్దాం.