ఆత్మగౌరవం ఏమైపోయింది?
ఆత్మగౌరవం ఎందుకు ఉండాలి?
ఆత్మగౌరవం ఉన్నవాళ్లు కష్టాల కడలిలో ధైర్యంగా ఎదురీదుతారు. వాళ్లు అంత ఈజీగా ఆశ వదులుకోరు.
-
ఒక రీసర్చ్ ప్రకారం తమ గురించి తాము సరిగ్గా ఆలోచించలేని వాళ్లు ఆందోళన పడతారు, డిప్రెషన్లోకి వెళ్తారు, సరిగ్గా తినరు. అలాగే తాగుడికి, డ్రగ్స్‌కి బానిసలయ్యే అవకాశాలు ఎక్కువ.
-
ఆత్మగౌరవం ఉన్నవాళ్లు వేరేవాళ్లతో పోల్చుకోరు. కాబట్టి తమ చుట్టూ ఉన్నవాళ్లతో ఇట్టే కలిసిపోతారు, మంచి స్నేహితుల్ని కూడా సంపాదించుకుంటారు. ఆత్మగౌరవం తక్కువగా ఉన్నవాళ్లు అన్నిటికీ వేలెత్తి చూపిస్తూ చేతులారా స్నేహాల్ని పాడుచేసుకుంటారు.
-
ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎన్ని అడ్డురాళ్లు తగిలినా వెనక్కి తగ్గకుండా, వాటినే ఒక్కో మెట్టుగా చేసుకుంటూ ధైర్యంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆత్మగౌరవం తక్కువగా ఉన్నవాళ్లు చిన్న గులకరాయి లాంటి కష్టం వచ్చినా, దాన్ని పెద్ద బండరాయిలా చూసి అక్కడే ఆగిపోతారు.
మీరు ఏం చేస్తే బాగుంటుంది
మీ భుజం తట్టే స్నేహితుల్ని ఎంచుకోండి. మిమ్మల్ని గౌరవించే వాళ్లను, ప్రోత్సహించే వాళ్లను, మీ మంచి కోరే వాళ్లను స్నేహితులుగా చేసుకోండి.
చెయ్యి అందించండి. దయతో వేరేవాళ్ల కోసం మంచి పనులు చేసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. వాళ్ల నుండి ఏం తిరిగి రాదని తెలిసినా మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు ఇవ్వడంలో ఉన్న నిజమైన సంతోషాన్ని రుచి చూస్తారు. మీరు చేసే మంచి పనుల్ని ఎవరు చూసినా చూడకపోయినా అది అక్షరాల నిజం.
ఆత్మగౌరవం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. మీ పిల్లలకు వచ్చే కష్టాల్లో నుండి చేతనైనంత మట్టుకు వాళ్లనే బయట పడనివ్వండి. దానివల్ల కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో, వాటి నుండి ఎలా బయట పడాలో మీ పిల్లలు నేర్చుకుంటారు. అలా చేస్తే చిన్నప్పటి నుండే వాళ్లలో ఆత్మగౌరవం పెరుగుతూ ఉంటుంది.
యెహోవాసాక్షులమైన మేము ఏం చేస్తామంటే . . .
మేము బైబిలు నుండి నేర్పించే విషయాలు, మా మీటింగ్స్ ప్రజల జీవితాల్ని చక్కదిద్దడమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతాయి.
మా మీటింగ్స్‌లో
ప్రతీ వారం జరిగే మీటింగ్స్‌లో బైబిల్ని ఉపయోగిస్తూ ఇచ్చే ప్రసంగాలు చాలా బాగుంటాయి. అందులో ఆత్మగౌరవాన్ని పెంచుకునే సలహాలు కూడా వింటాం. మా మీటింగ్స్‌కి ఎవరైనా రావచ్చు, దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మా మీటింగ్స్‌లో ఎలాంటి విషయాలు వింటాం అంటే . . .
-
మీరంటే దేవునికి ఎందుకు ఇష్టం?
-
జీవితానికి అర్థమేంటి?
-
చిరకాల స్నేహాన్ని ఎలా చేసుకోవచ్చు?
‘ఒకరిమీద ఒకరు శ్రద్ధ చూపించుకునే’ నిజమైన స్నేహితుల్ని కూడా మీరు కలుసుకుంటారు.—1 కొరింథీయులు 12:25, 26.
మా మీటింగ్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి jw.org వెబ్సైట్లో రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.
మా బైబిలు స్టడీ కోర్సు
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకం నుండి మేము ఉచితంగా బైబిలు గురించి నేర్పిస్తాము! ఈ పుస్తకంలో ముఖ్యమైన లేఖనాలు, స్పష్టమైన వివరణ, చక్కని ప్రశ్నలు, హృదయాన్ని కదిలించే వీడియోలు, చూడచక్కని బొమ్మలు ఉన్నాయి. ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి, జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి బైబిలు నుండి నేర్చుకునే విషయాలు సహాయం చేస్తాయి.
యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవడం మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి jw.org వెబ్సైట్లో బైబిలు ఎందుకు చదవాలి? అనే చిన్న వీడియోను చూడండి.