కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం మీద గౌరవం ఏమైపోయింది?

కుటుంబం మీద గౌరవం ఏమైపోయింది?

కుటుంబం మీద గౌరవం ఎందుకు చూపించాలి?

ఒకరి మీద ఒకరు గౌరవం చూపించుకున్నప్పుడు, కుటుంబంలో శాంతి విలసిల్లుతుంది.

  • ది సెవెన్‌ ప్రిన్సిపుల్స్‌ ఫర్‌ మేకింగ్‌ మ్యారేజ్‌ వర్క్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటే “పెద్దపెద్ద విషయాల్లోనే కాదు, చిన్నచిన్న విషయాల్లో కూడా రోజంతా ప్రేమ-ఆప్యాయతలు చూపించుకుంటారు.”

  • ఇతరుల మీద గౌరవం చూపించే పిల్లలు ఆత్మగౌరవంతో ఉంటారని, అమ్మానాన్నలతో చక్కగా ఉంటారని, వాళ్లలో మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయని ఒక రీసర్చ్‌ చెప్తుంది.

మీరు ఏం చేస్తే బాగుంటుంది

కుటుంబంగా కలిసి ప్లాన్‌ చేసుకోండి. ముందు, “గౌరవం” చూపించడం అంటే ఏంటో అర్థం చేసుకునేలా కుటుంబంలోని వాళ్లందరికీ సహాయం చేయండి. రెండవది కుటుంబంలోని ప్రతీ ఒక్కరు ఏం చేయాలో, ఏం చేయకూడదో రాసిపెట్టుకోండి. మూడవది దాని గురించి కుటుంబంగా కూర్చుని మాట్లాడుకోండి. అలా చేస్తే మీరు, మీ పిల్లలు ఒకే తాటి మీద ఉంటారు.

“శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.”—సామెతలు 21:5.

రోల్‌మోడల్‌గా ఉండండి. మీ కుటుంబంలోని వాళ్ల తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారా, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు వేళాకోళం చేస్తున్నారా, అడ్డుపడుతున్నారా? మీతో ఏదైనా చెప్పుకుంటే గోడకు చెప్పినట్టే అని వాళ్లకు అనిపిస్తుందా?

టిప్‌: గౌరవాన్ని మీ భర్తకు గానీ, భార్యకు గానీ పిల్లలకు గానీ బాకీ ఉన్నట్టుగా చూడండి, దాన్ని వాళ్లనుండి వసూలు చేసే వాళ్లుగా ఉండకండి.

“ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండండి.”—రోమీయులు 12:10.

మీరు ఒప్పుకోని విషయాన్ని నొప్పించకుండా చెప్పండి. నువ్వు “ఎప్పుడూ ఇంతే, ఇలాగే చేస్తావు” అని దెప్పిపొడిచే మాటలు మాట్లాడకండి. అలాంటి మాటలు మీ కుటుంబ సభ్యుల్ని ఇంకా నలగ్గొడతాయి, చిన్న గొడవ కాస్త చిలికిచిలికి గాలివానలా మారుతుంది.

“సౌమ్యంగా ఇచ్చే జవాబు కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది.” —సామెతలు 15:1.

యెహోవాసాక్షులమైన మేము ఏం చేస్తామంటే . . .

యెహోవాసాక్షులు కొన్ని ఆర్టికల్స్‌, పుస్తకాలు, వీడియోలు తయారు చేసి కుటుంబంలో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ పైసా ఖర్చు లేకుండానే చూడొచ్చు.

పెళ్లయిన వాళ్లకు: కుటుంబం కోసం అనే ఆర్టికల్‌ సిరీస్‌ భార్యాభర్తలకు ఎలా సహాయం చేస్తుందంటే . . .

  • వినేవాళ్లుగా ఉండడానికి

  • మౌనాన్ని బద్దలు కొట్టడానికి

  • గొడవను ఆపడానికి

(jw.org వెబ్‌సైట్‌లో “కుటుంబం కోసం” అని వెతకండి)

తల్లిదండ్రులకు: కుటుంబం కోసం అనే ఆర్టికల్‌ సిరీస్‌, పిల్లలకు శిక్షణ ఇచ్చేలా తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుందంటే . . .

  • చెప్పిన మాట వినేలా చేయడానికి

  • ఇంటి పనుల్లో సహాయం చేయడానికి

  • ప్లీజ్‌, థాంక్యూ అని చెప్పడానికి

(jw.org వెబ్‌సైట్‌లో “పిల్లల్ని పెంచడం”, “టీనేజర్లను పెంచడం” అని వెతకండి)

ఇంకా తేజరిల్లు నం. 2, 2019 “పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి” అనే పత్రికను, అలాగే తేజరిల్లు నం. 2, 2018 “కుటుంబ విజయానికి 12 సలహాలు” అనే పత్రికలో 8-11 పేజీలు కూడా jw.org వెబ్‌సైట్‌లో చూడండి.

టీనేజర్లు: jw.orgలో ఉన్న టీనేజర్లు, యౌవనులు అనే సెక్షన్‌ కిందున్న ఆర్టికల్స్‌, వీడియోలు, వర్క్‌షీట్లు పిల్లలకు ఎలా సహాయం చేస్తాయంటే . . .

  • అమ్మానాన్నలతో, తోడబుట్టిన వాళ్లతో స్నేహంగా ఉండడానికి

  • అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ గురించి వాళ్లతో గౌరవంగా మాట్లాడడానికి

  • అమ్మానాన్నల నమ్మకాన్ని గెలుచుకోవడానికి

(jw.org వెబ్‌సైట్‌లో “టీనేజర్లు, యౌవనులు” అని వెతకండి)

jw.org వెబ్‌సైట్‌ పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు, సబ్‌స్క్రిప్షన్‌, మెంబర్‌షిప్‌ అవసరం లేదు. మీ వ్యక్తిగత వివరాలతో పనిలేదు.