కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కంగారు

కంగారు

కంగారు

కంగారు రెండు విధాలుగా పని చేస్తుంది. ఒక విధంగా కంగారు వల్ల మంచి జరగవచ్చు, రెండు కొన్నిసార్లు నష్టం కూడా జరగవచ్చు. అయితే ఆ తేడా తెలుసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది.

కంగారు పడడం మంచిదేనా?

వాస్తవం

కంగారు ఉంటే ఇబ్బందిగా, భయంగా, ఆందోళనగా ఉంటుంది. ఈ లోకంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కాబట్టి అప్పుడప్పుడు ఎవరికైనా కంగారు తప్పదు.

పవిత్ర పుస్తకాల్లో ఏముంది

రాజైన దావీదు ఇలా రాశాడు: “ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును?” (కీర్తన 13:2) దావీదు ఎలా తట్టుకున్నాడు? ఆయన ప్రార్థన చేసి తన హృదయంలో ఉన్నదంతా దేవునికి చెప్పుకున్నాడు, అతని మీద దేవునికి ప్రేమ ఉందని పూర్తిగా నమ్మాడు. (కీర్తన 13:5; 62:8) నిజానికి మనల్ని కూడా దేవుడు అదే చేయమంటున్నాడు. మన హృదయంలో ఉన్నవన్నీ ఆయనకు చెప్పుకోమంటున్నాడు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని 1 పేతురు 5:7⁠లో ఉంది.

మనకిష్టమైన వాళ్ల కోసం ఏదైనా చేసినప్పుడు వాళ్ల గురించి కంగారు తగ్గుతుంది

అయినా చాలావరకు కొన్ని పనులు చేసి కంగారును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు బైబిలు రాసిన వాళ్లలో ఒకడైన పౌలుకు “సంఘములన్నిటిని గూర్చిన చింత” ఉన్నప్పుడు ఆయన వాళ్లను ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి చాలా కష్టపడ్డాడు. (2 కొరింథీయులు 11:28) ఆ విధంగా ఆయన కంగారు వల్ల మంచి జరిగింది, ఎందుకంటే ఆ చింత ఆయన ఇతరులకు సహాయం చేయడానికి నడిపించింది. మనం కూడా అలా చేయవచ్చు. అలా కాకుండా కంగారు తగ్గించుకోవాలని ఏమీ పట్టించుకోకుండా ఉంటే మనలో ప్రేమ శ్రద్ధ లేనట్లే.—సామెతలు 17:17.

“మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”ఫిలిప్పీయులు 2:4.

ఎక్కువగా కంగారు పడుతుంటే

వాస్తవం

చాలామంది, వాళ్లు చేసిన తప్పుల గురించి, భవిష్యత్తు గురించి, డబ్బు గురించి కంగారు పడుతుంటారు. a

పవిత్ర పుస్తకాల్లో ఏముంది చేసిన తప్పుల గురించిన బాధ:

మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా మారకముందు కొంతమంది తాగుబోతులు, తోటివాళ్లను దోచుకునేవాళ్లు, తిరుగుబోతులు, దొంగలు. (1 కొరింథీయులు 6:9-11) వాళ్లు పాత విషయాల గురించి ఆలోచించే బదులు, వాళ్ల పనులు మార్చుకుని దేవునికున్న గొప్ప క్షమాగుణం మీద నమ్మకం ఉంచారు. “నీయొద్ద క్షమాపణ దొరుకును” అని కీర్తన 130:4⁠లో ఉంది.

రేపు ఏమవుతుందో తెలియక కంగారు: “రేపటినిగూర్చి చింతింపకుడి” అని యేసు చెప్పాడు. (మత్తయి 6:25, 34) ఎందుకంటే ఏ రోజు కష్టాలు ఆ రోజుకు ఉంటాయి. (మత్తయి 6:25, 34) ఆయన మాటల అర్థం ఏంటంటే, ఏ రోజు విషయాలు ఆ రోజే ఆలోచించండి. రేపటి సమస్యల్ని కూడా కలుపుకుని కంగారు పెంచుకోకండి. అలా పెంచుకుంటే మీరు సరిగ్గా ఆలోచించుకోలేరు, పైగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి మనసులో పెట్టుకోండి, మీరిప్పుడు చాలా కంగారు పడినా తర్వాత అనవసరంగా కంగారు పడ్డారని మీకే అనిపిస్తుంది.

డబ్బు గురించి ఆందోళన: తెలివిగల ఒకతను ఇలా ప్రార్థన చేశాడు, “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము.” (సామెతలు 30:8) అతను ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. అది దేవునికి కూడా ఇష్టమే. హెబ్రీయులు 13:5⁠లో ఇలా ఉంది, “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.” డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, దాన్ని నమ్మలేం, కానీ దేవుడు ఆయన్ని నమ్మిన వాళ్లను, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేవాళ్లను ఎప్పుడూ విడిచిపెట్టడు.

“నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.”కీర్తన 37:25.

కంగారు లేకుండా ఉండడం సాధ్యమేనా?

అందరూ ఏమంటున్నారు

“మనం కంగారు అనే కొత్త యుగంలో అడుగుపెడుతున్నాం,” అని హ్యరియట్‌ గ్రీన్‌ అనే జర్నలిస్ట్‌ 2008 లో The Guardian అనే పత్రికలో చెప్పింది. 2014 లో, ప్యాట్రిక్‌ ఓకానర్‌ The Wall Street Journalలో ఇలా రాశాడు, “అమెరికన్లు ఎప్పుడూ లేనంతగా కంగారు పడుతున్నారు.”

పవిత్ర పుస్తకాల్లో ఏముంది

“ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.” (సామెతలు 12:25) ఒక “దయగల మాట” మనకు ‘దేవుని రాజ్య సువార్త’ ఇస్తుంది. (మత్తయి 24:14) ఆ రాజ్యం దేవుని ప్రభుత్వం. మనం సొంతగా చేసుకోలేని వాటిని అది త్వరలో చేస్తుంది. రోగాలు, మరణంతోపాటు కంగారుకు మూలాలన్నిటిని తీసేసి అన్నివిధాల కంగారును తీసేస్తుంది. “ఆయన [దేవుడు] వారి [మన] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4. ◼ (g16-E No. 2)

“నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.”రోమీయులు 15:13.

a విపరీతమైన కంగారు, వాటికి సంబంధించిన వ్యాధులు ఉంటే డాక్టరుకు చూపించుకోవడం మంచిది. తేజరిల్లు! ఏ చికిత్స చేయించుకోవాలో చెప్పదు.