కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలు నడవడానికి మీరు వాళ్లకు ఎలాంటి దారి చూపిస్తున్నారు?

తల్లిదండ్రులకు

8: ఆదర్శం

8: ఆదర్శం

అంటే ఏంటి?

ఆదర్శవంతులైన తల్లిదండ్రులు తాము నేర్పించేవాటి ప్రకారం జీవిస్తారు. ఉదాహరణకు, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడడం మీకు ఇష్టంలేకపోతే, “నేను ఇంట్లో లేనని అతనితో చెప్పు” అన్నారనుకోండి, అది విన్న మీ పిల్లవాడు కూడా అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకుంటాడు.

“‘నేను చెప్పినట్టు చెయ్యి కానీ నేను చేసినట్టు చెయ్యకు’ అని చాలామంది అంటుంటారు. కానీ ఈ పద్ధతి పిల్లల విషయంలో అస్సలు పనికిరాదు. వాళ్లు స్పాంజీ లాంటివాళ్లు. మనం చెప్పేవి, చేసేవి అన్నిటినీ గ్రహిస్తారు. మనం వాళ్లకు నేర్పించేవాటి ప్రకారం మనమే లేకపోతే ఆ విషయాన్ని వాళ్లే మనకు చెప్పేస్తారు.”—డేవిడ్‌.

మంచి సూత్రాలు: “దొంగతనం చేయకూడదు’ అని ప్రకటించే నువ్వు దొంగతనం చేస్తావా?”—రోమీయులు 2:21.

ఎందుకు ముఖ్యం?

పిల్లలు, టీనేజర్లు కూడా తమ తోటివాళ్లకంటే తల్లిదండ్రుల వల్లే ఎక్కువ ప్రభావితం అవుతారు. అంటే మీరు చెప్పేవాటిని మీరు పాటిస్తే, మీ పిల్లల్ని అందరికన్నా బాగా మీరే సరైన మార్గంలో నడిపించగలుగుతారు.

“మనం ఏదైనా ఒక విషయాన్ని వందసార్లు చెప్పాక కూడా మన పిల్లలు వింటున్నారా లేదా అని అనుకోవచ్చు. కానీ మనం చెప్పినదాన్ని మనం ఒక్కసారి పాటించకపోయినా పిల్లలు ఆ విషయాన్ని వెంటనే కనిపెట్టేస్తారు. మనం చేసే పనిని పిల్లలు పట్టించుకోరులే అని మనం అనుకున్నప్పుడు కూడా, వాళ్లు మనం చేసే ప్రతీ పనిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.”—నికోల్‌.

మంచి సూత్రాలు: “పరలోకం నుండి వచ్చే తెలివి. . . వేషధారణ లేనిది.”—యాకోబు 3:17.

మీరు ఏమి చేయవచ్చు

మీ ప్రమాణాలను పరీక్షించుకోండి. మీరు ఎలాంటి వినోద కార్యక్రమాలు చూస్తారు? మీ భార్యతో లేదా భర్తతో, పిల్లలతో మీరు ఎలా ఉంటారు? మీ స్నేహితులు ఎలాంటి వాళ్లు? మీరు ఇతరుల గురించి పట్టించుకుంటారా? ఒక్కమాటలో చెప్పాలంటే మీ పిల్లవాడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో మీరు అలా ఉన్నారా?

“మేము జీవించని ప్రమాణాల ప్రకారం, మా పిల్లలు జీవించాలని నేను, నా భర్త కోరుకోం.”—క్రిస్టీన్‌.

పొరపాట్లు చేసినప్పుడు క్షమించమని అడగండి. మీరు పరిపూర్ణులుకారని మీ పిల్లలకు కూడా తెలుసు. అవసరమైనప్పుడు మీ భార్యకు లేదా భర్తకు, మీ పిల్లలకు “నన్ను క్షమించు” అని చెప్తే, నిజాయితీగా, వినయంగా ఉండే విషయంలో మీరు ఒక విలువైన పాఠం నేర్పించినవాళ్లు అవుతారు.

“మనం తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం, మన పొరపాటుకు క్షమాపణ అడగడం మన పిల్లలు ఖచ్చితంగా వినాలి. ఒకవేళ వాళ్లు దాన్ని వినకపోతే, వాళ్లూ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం మాత్రమే నేర్చుకుంటారు.”—రాబిన్‌.

“తల్లిదండ్రులుగా మనం మన పిల్లల మీద అందరికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాం. వాళ్లు మనల్ని ఎప్పుడూ చూస్తుంటారు కాబట్టి వాళ్లకు నేర్పించడానికి మన దగ్గరున్న గొప్ప సాధనం మనం చూపించే ఆదర్శమే. మన ఆదర్శం వాళ్లకు ఎప్పుడూ తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. దానినుండి వాళ్లు ఎప్పుడూ పాఠం నేర్చుకుంటూనే ఉంటారు.”—వెన్‌డెల్‌.