కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొడవలు మంటలు లాంటివి, అయితే క్షమాపణ వాటిని ఆర్పుతుంది

భార్యాభర్తలకు

4: క్షమించడం

4: క్షమించడం

అంటే ఏంటి?

క్షమించడం అంటే ఏదైనా తప్పుని, దానివల్ల కలిగిన కోపాన్ని వదిలేయడం. అంటే చేసిన తప్పును చిన్నదిగా చూడమని లేదా ఏమి జరగనట్లు ఉండమని కాదు.

మంచి సూత్రాలు: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి.”—కొలొస్సయులు 3:13.

“మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు, మీరు వాళ్లలో లోపాలను చూడరు కానీ, అతను లేదా ఆమె ఎలా ఉండడానికి ప్రయత్నిస్తున్నారనే విషయాన్నే చూస్తారు.”—ఏరన్‌.

ఎందుకు ముఖ్యం?

మీరు కోపాన్ని మనసులో పెట్టుకుంటే శారీరకంగా, మానసికంగా మీకు మీరు హాని తెచ్చుకోవచ్చు. మీ వివాహ జీవితాన్ని కూడా పాడు చేసుకోవచ్చు.

“ఒకసారి నాకు చాలా బాధ కలిగించిన విషయంలో నా భర్త నన్ను క్షమాపణ అడిగాడు. నాకు అతన్ని క్షమించడం చాలా కష్టం అయింది. కానీ చివరికి క్షమించాను. అయితే త్వరగా క్షమించలేకపోయినందుకు బాధపడ్డాను. ఎందుకంటే అది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మీద అనవసరమైన ఒత్తిడి తెచ్చింది.”—జూలియా.

మీరు ఏమి చేయవచ్చు

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

మీ భార్య లేదా భర్త మాట వల్ల లేదా పని వల్ల మీకు బాధ కలిగినప్పుడు ఇలా ఆలోచించుకోండి:

  • ‘నేను మరీ ఎక్కువ సున్నితంగా ఉంటున్నానా?’

  • చేసిన తప్పుకు నాకు క్షమాపణ కావాలా లేదా నేను దాన్ని వదిలేయగలనా?

మీ భర్తతో లేదా భార్యతో ఇలా మాట్లాడి చూడండి

  • ఒకరినొకరు క్షమించుకోవడానికి సాధారణంగా మనకు ఎంత సమయం పడుతుంది?

  • ఒకరినొకరం త్వరగా క్షమించుకోవడానికి మనం ఏమి చేయాలి?

ఇలా చేయండి

  • మీకు బాధ కలిగినప్పుడు, మీ భర్త లేదా భార్య కావాలనే చెడు ఉద్దేశాలతో అలా చేశారని నిందించకండి.

  • మీ భర్త లేదా భార్య సరిగ్గా ప్రవర్తించకపోతే క్షమించడానికి ప్రయత్నించండి, “మనమందరం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం” అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.—యాకోబు 3:2.

“ఇద్దరిలో తప్పు ఉన్నప్పుడు క్షమించడం సులువే, కానీ తప్పు ఒకరివైపే ఉన్నప్పుడు క్షమించడం చాలా కష్టం. క్షమాపణ అడిగినప్పుడు దాన్ని అంగీకరించి క్షమించడానికి నిజంగా వినయం అవసరం.”—కిమ్‌బర్లీ.

మంచి సూత్రాలు: “త్వరగా . . . రాజీపడు.” —మత్తయి 5:25.

మీరు కోపాన్ని మనసులో పెట్టుకుంటే శారీరకంగా, మానసికంగా మీకు మీరు హాని తెచ్చుకోవచ్చు. మీ వివాహ జీవితాన్ని కూడా పాడు చేసుకోవచ్చు