మన కాలానికి ఉపయోగపడే ప్రాచీన పుస్తకం
బైబిలు ఒక పవిత్ర పుస్తకమని చాలామంది ప్రజలు దాన్ని గౌరవిస్తారు. అయితే, బైబిలు దేవున్ని ఎలా ఆరాధించాలో చెప్పే పవిత్ర పుస్తకం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో మంచి సలహాలు అందులో ఉన్నాయి.
కొంతమంది బైబిలు చదివి, దానిలో ఉన్న సలహాల్ని పాటించి ఎలా ప్రయోజనం పొందారో గమనించండి.
“ఇప్పుడు నా జీవితం చాలా హాయిగా ఉంది. నేను మానసికంగా, భావోద్వేగపరంగా మెరుగయ్యాను. మరింత సంతోషంగా ఉండగలుగుతున్నాను.”—ఫియోనా.
“బైబిలు చదవడం వల్ల నా జీవితానికి ఒక సంకల్పం, అర్థం దొరికాయి.”—నిట్కో.
“నా జీవితం ఎంతగానో మెరుగైంది. ఇప్పుడు నేను పని చేయడంతోపాటు కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడుపుతున్నాను.”—యాండ్రూ.
ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. రోజువారీ జీవితంలో పాటించగల మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుర్తించారు.
ఈ కింది విషయాల్లో బైబిలు మన జీవితాల్ని ఎలా మెరుగుపరుస్తుందో గమనించండి:
శారీరక ఆరోగ్యం
భావోద్వేగపరమైన ఆరోగ్యం
కుటుంబ జీవితం, స్నేహం
ఆర్థిక సమస్యలు లేని జీవితం
దేవునితో ఉన్న సంబంధం
బైబిలు ఒక పవిత్ర పుస్తకం మాత్రమే కాదు, అది మీ రోజువారీ జీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుందని తర్వాతి పేజీల్లోని సమాచారం రుజువుచేస్తుంది.