వివక్ష అనే జబ్బును పూర్తిగా తీసేయడం సాధ్యమే
ముందటి పేజీల్లో ఉన్న సలహాల్ని లక్షలమంది పాటించి, తమలో పాతుకుపోయిన వివక్షను తీసేసుకోగలిగారు. అయితే లోకంలో నుండి వివక్షను పూర్తిగా తీసేయడం మనవల్ల కాదు. మరి వివక్ష ఎప్పటికీ ఇలాగే ఉంటుందా?
ఒక మంచి ప్రభుత్వం
మానవ ప్రభుత్వాలు ప్రజల్లో నుండి వివక్షను తీసేయలేకపోయాయి. మరైతే వివక్షను పూర్తిగా తీసేయగల ప్రభుత్వమే లేదా?
వివక్షను తీసేయాలంటే ప్రభుత్వం . . .
-
1. ప్రజల ఆలోచనల్లో, భావాల్లో మార్పు తీసుకురావాలి.
-
2. వివక్ష వల్ల కలిగిన గాయాల్ని మాన్పాలి.
-
3. ప్రతీ పౌరున్ని సమానంగా చూసే నాయకుల్ని కలిగివుండాలి.
-
4. అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కటి చేయాలి.
దేవుడు అలాంటి ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశాడని బైబిలు హామీ ఇస్తోంది. బైబిలు దాన్ని “దేవుని రాజ్యం” అని పిలుస్తుంది.—లూకా 4:43.
ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో పరిశీలించండి.
1 మంచి విలువలు నేర్పిస్తుంది
“దేశ నివాసులు నీతి గురించి నేర్చుకుంటారు.”—యెషయా 26:9.
“నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది, నిజమైన నీతికి ఫలం శాశ్వతమైన నెమ్మది, భద్రత.”—యెషయా 32:17.
అంటే . . . దేవుని రాజ్యం ప్రజలకు నీతిన్యాయాలు నేర్పిస్తుంది. ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకున్నప్పుడు ప్రజలకు ఇతరుల మీద ఉన్న అభిప్రాయం మారుతుంది. అన్నిరకాల ప్రజల్ని ప్రేమించడమే సరైనదని ప్రతీఒక్కరు తెలుసుకుంటారు.
2 గాయాల్ని మాన్పుతుంది
“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:4.
అంటే . . . అన్యాయం మిగిల్చిన గాయాలన్నిటినీ దేవుని రాజ్యం మాన్పుతుంది. అంతకుముందు వివక్షకు గురైన వాళ్లు ఇక తమ మనసులో ద్వేషాన్ని ఉంచుకోరు.
3 మంచి నాయకుడు
“ఆయన కంటికి కనిపించేదాన్ని బట్టి తీర్పుతీర్చడు, కేవలం చెవులతో విన్నదాన్ని బట్టి గద్దింపు ఇవ్వడు. ఆయన పక్షపాతం లేకుండా దీనులకు తీర్పుతీరుస్తాడు, భూమ్మీదున్న సాత్వికుల తరఫున న్యాయంగా గద్దింపు ఇస్తాడు.”—యెషయా 11:3, 4.
అంటే . . . దేవుని పరలోక రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు భూమ్మీది ప్రజల్ని పక్షపాతం లేకుండా న్యాయంగా పరిపాలిస్తాడు. ఆయన ఒక దేశాన్ని ఎక్కువగా, ఇంకో దేశాన్ని తక్కువగా చూడడు. భూమ్మీదున్న వాళ్లందరూ తన నియమాలకు లోబడేలా ఆయన చూసుకుంటాడు.
4 ఐక్యత
దేవుని రాజ్యం ‘ఒకే ఆలోచనతో, ఒకే రకమైన ప్రేమతో, పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉండడం’ ప్రజలకు నేర్పిస్తుంది. —ఫిలిప్పీయులు 2:2.
అంటే . . . దేవుని రాజ్యంలోని ప్రజల మధ్య ఉండేది కేవలం పైపైన ఉండే ఐక్యత కాదు, వాళ్లు “పూర్తిస్థాయిలో ఐక్యంగా” ఉంటారు. ఎందుకంటే వాళ్ల మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది.