కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు!

వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు!

వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు!

ఆన్టాన్యో, జూనియర్‌ కాలేజిలో రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, తన క్లాస్‌మేట్‌లకు అనియత సాక్ష్యం ఇవ్వాలనుకున్నాడు. జెహోవాస్‌ విట్నెసెస్‌ స్టాండ్‌ ఫర్మ్‌ అగైన్‌స్ట్‌ నాజీ అసాల్ట్‌ (యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు) అనే వీడియోను క్లాసులో చూపించండి అని ఆయన తమ హిస్టరీ టీచర్‌కి సూచించాడు. టీచర్‌ ముందు సంకోచించినా, ఆమె అందుకు ఒప్పుకుని మరుసటి రోజు చూపిస్తానని అన్నారు.

“మొదట ఆ టీచర్‌ కొంచెం నిరసన భావంతో వీడియో చూడడం మొదలు పెట్టారు; కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో యెహోవాసాక్షుల చరిత్రను ప్రముఖ చరిత్ర కారులు వివరిస్తున్నారని ఆమె గ్రహించినప్పడు, మరింత అవధానాన్నిచ్చారు. ఆ వీడియోను సూచించినందుకు, ఆమె చివరికి నాకు కృతజ్ఞతలు చెప్పారు.”

తర్వాతి పాఠంలో బీబల్‌ఫార్‌షర్‌ల పనిని గురించి వర్ణించడానికి ఆ టీచర్‌ ప్రయత్నించారు. యెహోవాసాక్షులు జర్మనీలో అప్పట్లో అలా పిలువబడేవారు; కానీ ఆన్టాన్యో వివరించడమే మేలని ఆమె గ్రహించారు. ఆన్టాన్యో, సమాజంలో యెహోవాసాక్షుల పాత్రనూ, యెహోవాసాక్షుల సిద్ధాంతాల్లో కొన్నింటినీ వివరించాడు. “ప్రజలు, మేము చెప్పే ప్రశస్తమైన సందేశాన్ని వినకపోతే, మా ముఖం మీదే తమ తలుపులను మూసేస్తే, లేక మా ప్రచురణలను చదవకపోతే, ఆ సందేశం నుండి ప్రయోజనాన్ని పొందలేరు” అని అంటూ ఆయన ముగించాడు.

ఆయన మాటలతో ఆయన క్లాస్‌మేట్‌లు అందరూ ఏకీభవించారు. టీచర్‌ ఆ క్లాస్‌ ఎదుట ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు: ఈ సారి అవకాశం లభించిన వెంటనే సాక్షులు చెప్పేదాన్ని విందాం, వాళ్ళ ప్రచురణలను స్వీకరించుదాం. ఆ క్లాసులోవాళ్ళు కొంచెం సేపు వరకూ ఆ వీడియో గురించి మాట్లాడుకున్నారు. తర్వాతి కొన్ని రోజుల వరకూ, తోటి విద్యార్థులు వాచ్‌టవర్‌ ప్రచురణలతో క్లాసుకు వచ్చి, చిరునవ్వుతో, “చూశావా, నేను నా మాట నిలబెట్టుకున్నాను!” అని తనతో అన్నప్పుడు ఆన్టాన్యోకు కలిగిన సంతృప్తిని మీరు ఊహించగలరు.