కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అసాధారణ స్మశానం

అసాధారణ స్మశానం

అసాధారణ స్మశానం

ఈక్వడార్‌లోని తేజరిల్లు! విలేఖరి

ఈక్వడార్‌ రాజధాని నగరమైన క్విటోకు ఉత్తరాన ఉన్న ఇబారా పట్టణంలో ఒక అనుపమానమైన స్మశానముంది. దాని పేరు ఎల్‌ సెమంటరియో డీ లోస్‌ పోబ్రెస్‌ (పేదల స్మశానం). దాన్ని అసాధారణమైనదిగా చేస్తున్నదేమిటి? వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణల నుండి నేరుగా తీసుకున్న చిత్రాలను ఆ స్మశానపు చుట్టూ ఉన్న గోడల మీద పెద్దగా పెయింట్‌ చేశారు. * మధ్యలో ఉన్న అపొస్తలుడైన యోహాను చిత్రం, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో 7వ పేజీలో నుండి తీసుకోబడింది. యోహాను చిత్రం పైన, “దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, ఆనందం అని అర్థం. రోమీయులు 14:17.” అని స్పానిష్‌ భాషలో వ్రాసి ఉంది. దానికి ఎడమవైపున, మత్తయి 11:28 లో నుండి తీసుకున్న, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అన్న మాటలు కనిపిస్తాయి. వాళ్ళు స్పానిష్‌ భాషలోని నూతన లోక అనువాదములో నుండి కాపీ చేశారు. ఈ స్మశానం ప్రజల దృష్టిని దేవుని వాక్యం వైపుకు నడిపించడానికి సహాయపడుతుందనడంలో సందేహం లేదు.

[అధస్సూచి]

^ వాచ్‌టవర్‌ సాహిత్యంలోని వ్యాసాలను గాని ఆర్ట్‌ వర్క్‌నిగానీ పునఃప్రచురించే ముందు చట్టబద్ధంగా వాచ్‌టవర్‌ నుండి తప్పకుండా అనుమతి తీసుకోవాలి. వాటిని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు ఆపాదించాలి.