కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వైద్యరంగంలో అగ్రగాములు

వైద్యరంగంలో అగ్రగాములు

వైద్యరంగంలో అగ్రగాములు

ఊపేయ అనే చిన్న పట్టణంలో ఉంటున్న బెల్జియన్‌ దేశస్థుడైన జోసే అనే వ్యక్తికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయవలసిన అవసరముందని ఆయన 61వ ఏట చెప్పారు. “నేను జీవితంలో మొదటిసారిగా దిగ్భ్రమకు గురయ్యాను” అని ఆయన అంటున్నాడు. నాలుగు దశాబ్దాల క్రితం అయితే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌ అంటే ఊహించడం కూడా ఊహించలేకపోయేవారు. 1970లలో కూడా, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాక 30 శాతం మందే బ్రతకగల్గారు. అయితే, నేడు, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లు ప్రతిరోజూ జరుగుతున్నాయి, సాఫల్యతా రేటు చాలా ఎక్కువగా ఉంది.

అయితే ఇప్పటికీ ఒక పెద్ద చిక్కు ఉంది. తరచూ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేటప్పుడు రక్తం అతిగా పోతుంది కనుక, సాధారణంగా ఆపరేషన్‌ సమయంలో వైద్యులు రక్తం ఎక్కిస్తారు. జోసే తన మత నమ్మకాల మూలంగా రక్తం ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కాని లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మాత్రం చేయించుకోవాలనుకున్నాడు. అది అసాధ్యమా? అసాధ్యమని కొందరు అనుకోవచ్చు. రక్తం ఎక్కించకుండానే తనూ, తన సహచరులూ విజయవంతంగా ఆపరేషన్‌ చేయగల మంచి అవకాశం దొరికిందని చీఫ్‌ సర్జన్‌ భావించాడు. వాళ్ళు అలా చేయగలిగారు ! ఆపరేషన్‌ జరిగి 25 రోజులైన తర్వాత, జోసే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యతోను కూతురుతోను హాయిగా జీవిస్తున్నాడు. *

“వైద్యరంగంలో హీరోలు” అని టైమ్‌ పత్రిక ఎవరినైతే పిలిచిందో వారి నైపుణ్యాల మూలంగా, ఇప్పుడు రక్తరహిత మందులూ, సర్జరీ సర్వసాధారణమయ్యాయి. కాని నేడు వాటికి ఎందుకంత డిమాండ్‌? ఈ ప్రశ్నకు సమాధానం కోసం, రక్తమార్పిడుల ఇబ్బందులతో కూడిన చరిత్రను పరిశీలించుదాం.

[అధస్సూచి]

^ అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని వ్యక్తుల మనస్సాక్షికి వదిలేయవలసిన విషయంగా యెహోవాసాక్షులు దృష్టిస్తారు.

[3వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 90,000 కన్నా ఎక్కువమంది డాక్టర్లు యెహోవాసాక్షులకు రక్తం ఎక్కించకుండానే ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు తాము ఇష్టపడుతున్నట్లు తెలియజేశారు