కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

టాగ్వా విత్తనాలు నేను మీ పత్రికను (ఆంగ్లం) 1954వ సంవత్సరం నుండి చదువుతున్నాను. యెహోవా సృష్టికున్న బహుళ ప్రయోజనాలను గురించి చెప్పే మీ శీర్షికలను చదివినప్పుడల్లా ఆశ్చర్యపడుతూనే ఉంటాను. “టాగ్వా విత్తనాలు—ఏనుగులను రక్షించగలవా?” (డిసెంబరు 8, 1999) అనే శీర్షిక అలాంటి శీర్షికలలో ఒకటి. మన దేవుని అద్భుతమైన వివేకాన్ని గురించి అంతకంతకూ అర్థం చేసుకునేందుకు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు.

డి. హెచ్‌., అమెరికా

కలివిడిగా ఉండడం “యువత ఇలా అడుగుతోంది . . . నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను? (డిసెంబరు 8, 1999) అనే శీర్షిక నన్ను బాగా కదిలించింది. నాకు 16 ఏండ్లు. ఇతరులతో సంభాషించడం (మనస్సులో మాటను వ్యక్తం చేయడం) ముఖ్యంగా క్రైస్తవ కూటాల తర్వాత చాలా కష్టమనిపించేది. ఈ సమస్య ఉన్న నాలాంటి వాళ్ళ గురించి మీరు తలంచినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఈ శీర్షికలో మీరిచ్చిన మంచి సలహాను ఆచరణలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను.

ఐ. ఏ., ఫ్రాన్స్‌

పాటలు పాడే పక్షులు “ఆహ్లాదభరితులైన యుగళ గాయకులు” (జనవరి-మార్చి, 2000) అనే శీర్షికకు కృతజ్ఞతలు. ఈ పక్షులు చెట్టు కొమ్మ మీద కూర్చుని పాడుతుంటే వింటున్నట్లు నేను ఊహించుకోగల్గాను! మనకు వినోదాన్నిచ్చే జీవులను యెహోవా సృష్టించినందుకు ఆయనకు ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలుపుతుంటాను.

వై. ఎస్‌., జపాన్‌

మూఢనమ్మకాలు ఒక భాషాశాస్త్రవేత్తగా, డిసెంబరు 8, 1999 తేజరిల్లు! సంచికలోని ఒక తప్పును నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఎవరైనా తుమ్మినప్పుడు, “దేవుడు నిన్ను దీవించుగాక” అనేందుకు జర్మన్‌ భాషలో “గెజూన్ట్‌హైట్‌” అని అంటారని “మూఢనమ్మకాలు—ఎందుకంత ప్రమాదకరమైనవి?” అన్న పరంపరలో మీరు సూచించారు. “గెజూన్ట్‌హైట్‌” అనే మాటకు “ఆరోగ్యం” అన్నది సరైన అనువాదం.

సి. సి., అమెరికా

“గెజూన్ట్‌హైట్‌” అనే మాటకు “దేవుడు నిన్ను దీవించుగాక” అన్నది ఖచ్చితమైన అనువాదం అని మేము అనలేదు. “దేవుడు నిన్ను దీవించుగాక” అనే వ్యక్తీకరణకు సాదృశ్యంగా ఇతర భాషల్లో ఉన్న వ్యక్తీకరణల్లో “గెజూన్ట్‌హైట్‌” ఒకటి అని సూచించాం.​—ఎడిటర్‌.

బిడియం “యువత ఇలా అడుగుతోంది . . . నేను మరింత కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను?” (నవంబరు 8, 1999) అనే శీర్షికకు చాలా కృతజ్ఞతలు. ఈ సమాచారం సమయానికి అందింది. నాకు 17 ఏండ్లు. బిడియం వల్ల నేను జీవితంలో చాలా నష్టపోయాను. క్రైస్తవ కూటాల్లో క్రొత్తవాళ్ళతో కలవడమూ, వాళ్ళతో సహవసించడమూ నాకు చాలా కష్టంగా ఉండేది. దీని మూలంగా, మన సహోదర సహోదరీలతో సహవాసాన్ని విస్తృతపరచుకుని ఆనందించే అనేక అవకాశాలను జారవిడుచుకున్నాను. బిడియం సర్వసాధారణమైనదనీ, నేను అధిగమించగలననీ గ్రహించేందుకు మీ శీర్షిక నాకు బాగా సహాయపడింది.

బి. హెచ్‌., అమెరికా