మానవుడి అమానుషత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?
మానవుడి అమానుషత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?
విచారకరంగా, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న వివాదాస్పద సమస్య అయిన బానిసత్వాన్ని గురించి చర్చించిన తేజరిల్లు! మార్చి 8, 2000 (ఆంగ్లం) సంచికను ఇటలీలో సోషల్ సాలిడారిటీ మినిస్టర్‌గా ఉన్న లివీయా టూర్కోకు ఇవ్వడం జరిగింది. ఆమె ఇటలీలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఒక ఉత్తరం వ్రాస్తూ ఇలా ఒప్పుకుంది:
“ప్రత్యేకంగా స్త్రీలను పిల్లల్నీ ప్రభావితం చేస్తున్న ఆధునిక బానిసత్వపు రూపాలు తీవ్రమైన అత్యవసర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. లక్షలాదిమంది అమానుషమైన పరిస్థితుల్లో ఇప్పటికీ మగ్గుతున్నారు.” ఆమె ఇలా ముగిస్తోంది: “ఏమాత్రం స్వీకరించలేని ఈ వాస్తవానికి విరుద్ధంగా ఆక్రోషంతో ఎలుగెత్తి అరిచే ఏ స్వరం అయినా అతి అమూల్యమైన సహాయం అవుతుంది. [తేజరిల్లు!] పాఠకలోకానికి చేరుకున్నంత వేగంగా ప్రజలందరికీ అది చేరుకున్నప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటుంది.”
ప్రతి సంచిక 2 కోట్ల కాపీలతో 82 భాషల్లో ముద్రించబడుతున్న తేజరిల్లు! పత్రిక మూలంగా, లక్షలాదిమంది పాఠకులకు నేటి సమస్యల స్వభావాన్ని గురించి తెలియజేయడం మాత్రమేగాక వాటికి బైబిలు ఆధారిత పరిష్కారాన్ని కూడా అందించడం జరుగుతోంది.
అయినప్పటికీ, నిజంగా దేవుడంటూ ఉంటే అమాయక ప్రజలు ఇంత కఠినమైన బాధల్ని అనుభవించేలా ఎందుకు అనుమతిస్తున్నాడు? అనే ప్రశ్న ఇంకా అలానే నిలిచివుంది. ‘సృష్టిలోని అద్భుతాల్లో దేవుని బుద్ధిబాహుళ్యం స్పష్టంగా ప్రదర్శితమౌతున్నప్పటికీ, ప్రజలపట్ల ఏమాత్రం కనికరం చూపించని ఆ సృష్టికర్తను నేనెలా ప్రేమించగలను?’ అని అనేకమంది అనుకుంటారు. అలాంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన రీతిలో దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌లో సమాధానాలు లభిస్తాయి. 32 పేజీల ఈ బ్రోషూర్ గురించి మీకు మరింత సమాచారం కావాలంటే ఈ క్రిందనున్న కూపన్ నింపి అందులోనున్న చిరునామాకు గానీ లేదా ఈ పత్రికలోని 5వ పేజీలో ఉన్న మీకు అనుకూలమైన చిరునామాకు గానీ వ్రాసి పోస్టు చేయండి చాలు.
◻ దేవుడు మన యెడల నిజంగా శ్రద్ధ కలిగియున్నాడా? అనే బ్రోషూర్‌ను గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపించండి.
◻ నాతో ఉచిత గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించడానికి నన్ను సంప్రదించండి.