మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
క్షుద్రవిద్య నాకు 13 సంవత్సరాలు. క్షుద్రవిద్య అభ్యాసాల మీద నమ్మకముంచే ఒక అమ్మాయిని స్కూల్లో కలిశాను. ఆ అమ్మాయి ఒకరోజు వాటిపట్ల నా ఉద్దేశం ఏమిటని నన్ను అడిగింది. దానికి సమాధానంగా నేను ఒక యెహోవాసాక్షిననీ అలాంటి మంత్రశక్తుల మీద నేను నమ్మకముంచననీ చెప్పాను. ఆమె నిరుత్సాహం చెంది, అప్పటినుండి అదే విషయాన్ని పదే పదే మాట్లాడింది. నేను సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాను, “బైబిలు ఉద్దేశము—క్షుద్రవిద్య వెనుక ఉన్నదేమిటి?” (డిసెంబరు 8, 1999) అనే ఆర్టికల్ రూపంలో నాకు సహాయం లభించింది. ఆ శీర్షికను ఆమెకు ఇచ్చాను, ఆమె దాన్ని చదివిన తర్వాత ఆ విషయాన్ని గురించిన నా అభిప్రాయాల్ని మళ్ళీ ప్రశ్నించలేదు.
కె. ఇ., అమెరికా
ఇరవయ్యవ శతాబ్దం “20వ శతాబ్దం—కీలకమైన మార్పులు జరిగిన సంవత్సరాలు” (జనవరి 8, 2000) అనే ఆర్టికల్స్ గురించి నేను వ్రాస్తున్నాను. 20వ శతాబ్దంలో మనం అనుభవించిన కష్టతరమైన పరిస్థితుల గురించి మీరిచ్చిన స్పష్టమైన వివరణను బట్టి నేను ఎంతగానో ప్రభావితం చెందాను. హింస మానవజాతిని క్రమక్రమంగా ఎలా నాశనం చేస్తుందో కూడా నేను చూడగలిగాను. మీరు చేస్తున్న అద్భుతమైన పనికి నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను.
డబ్ల్యు. జి., ప్యూర్టో రికో
రక్తరహిత మందులు “రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ డిమాండ్ పెరుగుతోంది” (ఏప్రిల్-జూన్, 2000) అనే ఆర్టికల్ ఎంతో పరిశోధించి వ్రాసినది. నేను నర్సింగ్ స్కూల్లో చదువుతున్నాను, నా తోటి విద్యార్థినికీ, ఒక టీచర్‌కీ ఈ పత్రికను ఇచ్చాను. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో వీరు యెహోవాసాక్షుల పట్ల దురభిమానాన్ని కలిగి ఉన్నట్లు ప్రదర్శించారు. కానీ ఈ సమాచారాన్ని పొందినందుకూ, యెహోవాసాక్షుల విషయంలో మరింత సమాచారం దొరికినందుకూ వాళ్ళు ఎంతగానో ఆనందించారు.
ఆర్. పి., స్విట్జర్లాండ్
మా పిల్లల్లో ఇద్దరు 1998లో ఒక ఆక్సిడెంట్‌కు గురయ్యారు. నా కుమారుడి కాలు పూర్తిగా నలిగిపోయింది. తనకు రక్తం వద్దని పదే పదే చెప్పాడు! కానీ ఆ ఆసుపత్రి రక్తరహిత శస్త్రచికిత్సకు సిద్ధంగా లేదు. ఆయన్ని వేరే ఆసుపత్రికి మార్చారు, కానీ హెమాటోక్రిట్ 35కు చేరుకునేంత వరకు శస్త్రచికిత్స చేయమని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. (అది అప్పటికే 8.1కి చేరుకుంది.) వ్యక్తిగత ఎంపికను నిర్లక్ష్యంచేసే అభిప్రాయాన్ని పెంపొందించుకొని, ఆయన చనిపోతాడో లేదో చూద్దామని వేచి చూస్తున్నట్లు అనిపించింది. అయితే, వారు రక్తరహిత ప్రక్రియల్ని చేపడుతుండగా—కాలును ఎత్తుగా పెట్టడం, ఎరిత్రోపాయ్‌టిన్ ఇస్తుండడం వంటివి చేస్తుండగా ఆయనలో హెమాటోక్రిట్ 35.8కి పెరిగింది! ఆ శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది, కానీ ఆలస్యం మూలంగా ఆయనలో శాశ్వతంగా ఉండిపోయే హాని జరిగింది. ఈ ఆర్టికల్‌ని ప్రతి డాక్టరు, ప్రతి సర్జన్, అనస్తీషియాలజిస్ట్ చదవాలని నేను ఆశిస్తున్నాను.
ఎల్. ఎల్., అమెరికా
అనేకమంది వైద్యులు యెహోవాసాక్షులతో సహకరిస్తున్నారని తెలుసుకోవడం చాలా ఓదార్పుకరంగా ఉంది. ఈ పత్రికను మా డాక్టరుకివ్వడానికి ఇప్పుడే తీసుకువెళ్తున్నాను. ఆయన దీన్ని మెచ్చుకుంటారని నాకు తెలుసు.
యు. యమ్., అమెరికా
ఈ ఆర్టికల్ సరిగ్గా నేను శస్త్రచికిత్స చేయించుకోబోయే సమయానికి వచ్చింది. రక్తం విపరీతంగా పోవడం మూలంగా నా బ్లడ్ కవుంట్ బాగా తగ్గినప్పుడు, ఆసుపత్రి సిబ్బందికీ నా కుటుంబ సభ్యులకూ నేను రక్తాన్ని ఎందుకు స్వీకరించనో వివరించడానికి నేనీ పత్రికను ఉపయోగించాను. యెహోవాకు కృతజ్ఞతలు, నేను పూర్తిగా కోలుకున్నాను.
సి. బి., అమెరికా
యువత కోసం ఆర్టికల్స్ నాకు 12 సంవత్సరాలు, నేను మీ పత్రికలను చదివి చాలా ఆనందిస్తాను. మీ పత్రికలు చదవకముందు నా స్నేహితులతో సర్దుకుపోవడం చాలా కష్టంగా ఉన్నట్లు అనిపించేది, ఎందుకంటే వాళ్ళందరూ నా కంటే పెద్దవాళ్ళు. కానీ “యువత ఇలా అడుగుతోంది . . . ” ఆర్టికల్‌ను చదివిన తర్వాత, వారితో కలిసిపోవడం నాకు సులభమైంది. మీ పత్రికల కొరకు కృతజ్ఞతలు. అవి చాలా సహాయకరంగా ఉన్నాయి.
ఎన్. ఐ., రష్యా