కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సురక్షితంగా విమానయానం చేసిరండి!

సురక్షితంగా విమానయానం చేసిరండి!

సురక్షితంగా విమానయానం చేసిరండి!

“పాసెంజర్‌ విమానాల నుండి ప్రయాణికుల్ని ఖాళీచేయించడం దాదాపు వారానికి ఒకసారి జరుగుతుంది” అని యుఎస్‌ఎ టుడేలోని ఒక నివేదిక చెబుతోంది. వీటిలో అనేకం చిన్న చిన్న సంఘటనలు లేదా తప్పుడు సమాచారాలు దొరకడం మూలంగానే అయినప్పటికీ మీరు ఈ క్రింది సూచనల్ని పాటిస్తే విమానాన్ని ఖాళీ చేయడం చాలా సులువుగా ఉంటుంది:

సరైన  దుస్తులు వేసుకోండి.  సౌకర్యంగా, కదలడానికి వీలుగా ఉండే దుస్తుల్ని ధరించండి. దుస్తులు సాధ్యమైనంత ఎక్కువగా మీ శరీరాన్ని కప్పేవై ఉండాలి. స్లాక్స్‌, పొడవాటి స్లీవ్‌ల టాప్‌లు అత్యుత్తమం. కాటన్‌, ఉన్ని, డెనిమ్‌, లెదర్‌ వంటి సహజ పదార్థాలతో తయారుచేసిన దుస్తుల్ని ధరించండి. రేయాన్‌, పాలిస్టర్‌, నైలాన్‌ (ప్రాముఖ్యంగా హోజరీ) వంటి సింథటిక్‌ పదార్థాలతో తయారుచేసిన వాటికి వేడికి త్వరగా కరిగిపోయే గుణం ఉంది, శరీరానికి కాళ్ళకు తీవ్రమైన కాలిన గాయాలు కలుగజేసే ప్రమాదం ఉంది.

మానసికంగా  సిద్ధగా  ఉండండి.  అత్యవసర పరిస్థితిలో ఏమి చేస్తారో ఆలోచించండి. కూర్చున్న తర్వాత మీ సీటుకు ముందు అలాగే మీ వెనుక అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయో చూసుకోండి. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు భద్రతా చర్యల గురించి ఫ్లయిట్‌ అటెండెంట్‌ చర్చిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. విమానాన్ని ఖాళీ చేసే పద్ధతుల విషయంపై వివరణలిచ్చే సేఫ్టీ కార్డుని పరిశీలించండి.

గాబరా  పడవద్ద. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండండి, విమాన సిబ్బంది ఇచ్చే నిర్దేశకాలను పాటించండి. ఖాళీ చేయడం తప్పనిసరైనప్పుడు మీ వస్తువులన్నింటినీ విడిచి మీకు అతి దగ్గర్లోని అత్యవసర ద్వారం దగ్గరికి చేరుకోండి.

జాగ్రత్తగా  విమానాన్ని ఖాళీ చేయండి.  స్లైడ్‌ మీద ముందుగా మీ కాళ్ళు ఉంచి దూకండి, దానిమీద జారుకుంటూ క్రిందికి రావడానికి ప్రయత్నించవద్దు. మీ చేతులతో మీ ఛాతీని కప్పుకోండి. మీ కాళ్ళను పాదాల్ని దగ్గరగా పెట్టుకోండి, హీల్స్‌ ఉన్న బూట్లను తీసేయండి. మీరు నేల మీదికి చేరుకున్న తర్వాత, విమానానికి దూరంగా వెళ్లి, రాబోయే అత్యవసర వాహనాల కోసం ఎదురుచూడండి.

ఈ నిర్దేశాల్ని పాటించడం ఏమైనా ప్రయోజనాన్ని చేకూరుస్తుందా? తప్పకుండా! “విమాన ప్రమాదాలన్నీ ప్రాణాల్ని హరించేవి కావు” అని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ వారు వెలువరించే ఇంటర్‌కామ్‌ అనే న్యూస్‌లెటర్‌ తెలియజేస్తోంది. అదింకా ఇలా చెబుతుంది: “వాణిజ్య విమానాల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదాల్లో దాదాపు 50 శాతం నివారించదగ్గవే.”