మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
వికలాంగుడైన ప్రచారకుడు “అనారోగ్యాలు ఉన్నప్పటికీ ప్రకాశమానమైన దృక్కోణం” అనే ఆర్టికల్‌లో కాన్‌స్టాంటిన్ మొరొజోవ్ వృత్తాంతాన్ని చదివినప్పుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. (ఫిబ్రవరి 22, 2000, ఆంగ్లం) నేను ఒంటరి తల్లిని, నాకిద్దరు పిల్లలు. వాళ్లను పెంచడం అంత సులభమేమీ కాదు, కొన్నిసార్లు నా సమస్యలకు అంతే లేదనిపిస్తుంది. అయినా, కాన్‌స్టాంటిన్ ఎదుర్కోవలసిన దానితో పోలిస్తే నా సమస్యలు అత్యల్పమైనవి!
ఐ., రష్యా
నేను పూర్తికాల సువార్తికురాలిని. నాకు నేత్రపటలం క్షీణించిపోతున్నందున చదవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఎక్కువగా చదువుతుంటాను, అప్పుడప్పుడూ నాకు ఎంతో చికాకు కల్గుతుంది, నేను ఎంతో కృంగిపోతాను. కాన్‌స్టాంటిన్ గురించి ఆలోచించినప్పుడు, నేను ఎన్నడూ ఫిర్యాదు చేయకూడదని అనుకుంటాను. ఆయన పర్వతం లాంటి అవాంతరాలను అధిగమించి, పూర్తికాల సువార్తికునిగా సేవచేస్తున్నాడు. యెహోవా ఎంతటి బలాన్ని అనుగ్రహిస్తాడో కదా!
డబ్ల్యూ. డబ్ల్యూ., ఇండియా
పదహారేళ్ల వయస్సులో నాకు నడుము నుండి క్రింది భాగానికి పక్షవాతం వచ్చింది. కాన్‌స్టాంటిన్‌లా నేను ప్రతి రోజు శ్రమలు అనుభవిస్తాను. అయితే, వికలాంగుడైన వ్యక్తి కూడా సమాజంలో ఒక స్థానాన్ని కల్గివుండవచ్చుననీ, దేవుడ్ని ఆరాధించడంలో భాగం వహించవచ్చుననీ ఆ ఆర్టికల్ చూపించింది. నేను అంత బాగా వినలేకపోయినప్పటికీ, అంత బాగా చూడలేకపోయినప్పటికీ, తరచూ నేను స్టూల్‌పై కూర్చుని గోడకు ఆనుకుని వీధిలో ఒంటరిగా ప్రకటిస్తాను. కాన్‌స్టాంటిన్‌కున్న ఆసక్తి, భక్తి భావాలను బట్టి నేను ఆయనను అభినందిస్తున్నాను.
డి. ఎఫ్., కోటె డీ ఐవరీ
(g00 11/22)
ఆధునిక బానిసత్వం నేను పదహారు సంవత్సరాల అమ్మాయిని, మీ ఆర్టికల్ చదివి నేనెంతో కదిలించబడ్డాను. ఆధునిక బానిసత్వానికి గురవుతున్న యౌవనస్థులైన అమ్మాయిల గురించి నాకు తెలుసు. తమకు ఆశ్రయమిచ్చిన కుటుంబాల కోసం వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు. కాని వారికి ఏ విధమైన విద్యా, లేక వాత్సల్యాభిమానాలూ లభించవు. కృంగిపోయిన వారికి యెహోవా త్వరలోనే విడుదల అనుగ్రహిస్తాడని బైబిలులో చదివి ఎంతో ఉపశమనం పొందాను.
ఎ. ఒ., బుర్కినా ఫాసో
(g00 11/22)
ఆత్మహత్య “ఆత్మహత్య—ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?” అనే శీర్షికల పరంపర మాకు సరిగ్గా కావలసినదాన్ని అందించింది. (ఫిబ్రవరి 22, 2000, ఆంగ్లం) ఎనిమిది నెలల క్రితం మా అమ్మ హఠాత్తుగా మరణించింది. ఆమె చనిపోయినప్పుడు నాన్నగారు దగ్గరలో లేరు అందుకే ఆయన తాను అపరాధినన్నట్లు భావిస్తుంటారు. ఇక జీవించే ఆశ ఎంతమాత్రం లేదని ఆయన అంటుంటారు. కాబట్టి, ఆ ఆర్టికల్స్ మా నాన్నగారికీ నాకూ ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.
ఆర్. జెడ్., జర్మనీ
రెండు సంవత్సరాల క్రితం మా తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య మరణంతో ఆయన మానసికంగా కృంగిపోయాడు. ఆయన ఎందుకలా చేసివుండవచ్చుననేది అర్థం చేసుకోవడానికి మీ ఆర్టికల్స్ నాకు సహాయం చేశాయి.
ఏ. ఎమ్., అమెరికా
జనవరిలో 48 సంవత్సరాల మా అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకార్థ దినం జరిగిన మరునాడు, యెహోవాసాక్షి కాని మా నాన్నగారు, తేజరిల్లు! యొక్క ఈ ప్రతి ఉత్తరాల బాక్స్‌లో ఉండడాన్ని చూశారు. ఆయన దానిని మాకు చూపిస్తుండగా ఆయనకు నోటమాటరాలేదు, కన్నీళ్లు ఆగలేదు. ఓదార్పునిచ్చిన ఈ ఆర్టికల్స్‌ను బట్టి మా కుటుంబం ఆనంద బాష్పాలు రాల్చి, కృతజ్ఞతను వ్యక్తపర్చింది.
బి. జె., అమెరికా
మా పాఠశాల ప్రాంతంలో, గత సంవత్సరంలోనే ఆరుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఎంత వ్యాకులత కల్గించే విషయమైందంటే ఆ పాఠశాల ప్రాంతం, పాఠశాల విధానమంతటిలో అప్రమత్తంగా ఉండమని ప్రకటనలు చేసింది. మన సందేశాన్ని అంతగా అంగీకరించని ప్రాంతాల్లోని ప్రజలకు మేము ఈ సంచికను ఇచ్చాము. కొన్నిసార్లు మేము చెప్పేది ముగించక ముందే ప్రజలు మా చేతుల్లో నుండి పత్రికను తీసేసుకునేవారు!
కె. కె., అమెరికా
నేను యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు, మా నాన్నగారి మరణం తర్వాత నేను రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. “ఆత్మహత్య” అన్న పదాన్నే కొందరు చాలా హేయమైనదిగా దృష్టిస్తారు. తేజరిల్లు! కవర్‌పేజీపై దాన్ని వేసినందుకు కృతజ్ఞతలు! ఈ ఆర్టికల్స్ చాలా సూటిగా, వాస్తవికంగా, ఎంతో అవగాహనతో కూడినవిగా ఉన్నట్లు నాకు అనిపించాయి.
ఎమ్. జి., ఫ్రాన్స్
(g00 11/8)
స్నేహం సమస్యలు “యువత ఇలా అడుగుతోంది . . . నా స్నేహితుడు నన్నెందుకు గాయపరిచాడు?” (ఫిబ్రవరి 22, 2000, ఆంగ్లం) అనే ఆర్టికల్ నాకు సహాయం చేసింది. ఆరున్నర సంవత్సరాలపాటు నాతో సన్నిహితంగా ఉన్న స్నేహితురాలు నన్ను ఎంతగానో గాయపర్చింది. మీ ఆర్టికల్‌లోని సలహాలను ఉపయోగించి, నేను నా స్నేహితురాలు విషయాలను ప్రశాంతంగా, సమాధానంగా మాట్లాడుకున్నాము. ఫలితంగా, మేమిప్పుడు మునుపెన్నటికన్నా సన్నిహితంగా ఉన్నాం.
ఎమ్. ఎల్., అమెరికా
(g00 11/8)