కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు అందరిపట్ల ప్రేమ చూపిస్తున్నారు’

‘మీరు అందరిపట్ల ప్రేమ చూపిస్తున్నారు’

‘మీరు అందరిపట్ల ప్రేమ చూపిస్తున్నారు’

మెప్పుతో కూడిన ఆ మాటలను, విభిన్న జాతి నేపధ్యాలకు చెందిన ప్రజలు, శతాబ్దాలుగా ఒకరితో ఒకరు పోరాడుతున్న దేశమైన యుగోస్లేవియాలో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వ్రాయడం జరిగింది. ఆ ఉత్తరం ఇంకా ఇలా పేర్కొంది:

“డియర్‌ సర్స్‌,

నేను నా స్వంత పట్టణమైన సరజెవోలో యెహోవాసాక్షులైన మీ గురించి ఎంతో విన్నాను, కానీ నేను గత వేసవికాలంలో జర్మనీలో జరిగిన మీ సమావేశానికి హాజరయ్యేంత వరకూ మీ నమ్మకాలపై ఆసక్తి చూపించలేదు. క్రోషియా, యుగోస్లేవియా, బోస్నియాల నుండి వచ్చిన ప్రజలు ప్రశాంతంగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుని, చివరికి ఒకరినొకరు సహోదర సహోదరీలని పిలుచుకోవడం చూసి నేనెంతో ప్రభావితుడనయ్యాను. నేను అటువంటిదేదీ ఎన్నడూ చూడలేదు! రాజకీయాలు మీకు ఏమీ చేయలేవని మీ మధ్యనున్న పరస్పర ప్రేమ గట్టిగా సాక్ష్యమిస్తుంది. మీరు అందరి పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించుగాక!”

దీర్ఘకాలంపాటు విద్వేషాలతో రగిలిపోతున్న ప్రజలున్న ప్రాంతాల నుండి వచ్చే ఇలాంటి నివేదికలు, యుద్ధం లేని లోకం ఉంటుందా? అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తాయి. అలాంటి లోకాన్ని పొందడం సాధ్యమేననేదానికి శక్తివంతమైన రుజువును అందజేసే 32-పేజీల బ్రోషూర్‌ పేరు కూడా అదే. అయితే దాన్ని సాధించడం ఎలా? ఎప్పుడు?

32 పేజీల ఈ బ్రోషూర్‌ గురించి మీకు మరింత సమాచారం కావాలంటే ఈ క్రిందనున్న కూపన్‌ నింపి ఈ పత్రికలోని 5వ పేజీలో ఉన్న చిరునామాకు వ్రాసి పోస్టు చేయండి చాలు.

(g00 11/8)

యుద్ధం లేని లోకం ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్‌ను గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపించండి.

◻నాకు ఉచిత గృహ బైబిలు పఠనం ఇవ్వటానికి నన్ను సంప్రదించండి.