కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సుకుమారమైన పళ్లను కాపాడడం

సుకుమారమైన పళ్లను కాపాడడం

సుకుమారమైన పళ్లను కాపాడడం

మీపళ్లు ఏ వయస్సులో పెరగడం మొదలుపెట్టాయి? మీరు గర్భంలో ఉండగానే, బహుశా చివరికి తాను గర్భవతినని మీ తల్లికి కూడా తెలియక ముందే ఆ ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు! అందుకే, తల్లి కాబోయే స్త్రీ కాల్షియం, భాస్వరం, ప్రొటీన్లు, విటమిన్లు మొదలైన పోషకాలను పుష్కలంగా తీసుకోవడం ప్రాముఖ్యం.

నవజాత శిశువుల మాటేమిటి? సాధారణంగా పోతపాలు త్రాగే బిడ్డల పళ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందనీ, అదీ ముందరి పై పళ్లతో ఆ ప్రక్రియ ప్రారంభమౌతుందనీ నిపుణులు చెప్తారు. అయితే ఇదెలా సంభవిస్తుంది? కొందరు పసివాళ్లు పాలు, పళ్లరసం, చక్కెర నీళ్లు లేక సోడా వంటివి ఉన్న సీసాను నోట్లో పెట్టుకుని నిద్రలోకి జారుకుంటారు. పులిసే గుణమున్న ఈ ద్రావకాల్లో పిండిపదార్థం ఉంటుంది, దాని మూలంగా సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఫలితంగా, సూక్ష్మజీవులు శిశువుల పళ్లను ప్రాముఖ్యంగా సూక్ష్మజీవులు రాత్రంతా పళ్లకు తాకే అవకాశం ఉంటే, పళ్లకు హానిచేయగల ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. బాగా పాడైపోయిన పళ్లున్న బిడ్డలు చాలా త్వరగా పళ్లను పోగొట్టుకుంటారు, అది వారి శాశ్వత పళ్ల పెరుగుదలపై చాలా చెడు ప్రభావాన్ని చూపించగలదు.

తల్లిదండ్రులు తమ బిడ్డల సుకుమారమైన పళ్లను ఎలా కాపాడవచ్చు? ప్రాముఖ్యంగా తల్లి పాలలో సూక్ష్మజీవులు ఉండవు, వాటిలో విరుగుడు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి గనుక తల్లిపాలు సిఫారసు చేయబడుతున్నాయి. అయితే బిడ్డకు సీసాతో పాలను ఇవ్వవలసిన పరిస్థితుల్లో, బిడ్డకు 18 నెలలు నిండిన వెంటనే సీసాతో పాలను ఇవ్వడం మానుకోవాలని నిపుణులు చెప్తారు. సీసాను కేవలం పాల కోసమే ఉపయోగించాలి గానీ బిడ్డ దాన్ని ఎప్పుడూ నోట్లో పెట్టుకుని ఉండేలా అనుమతించకూడదని కూడా వాళ్లు గట్టిగా సిఫారసు చేస్తున్నారు. అంతేగాక, బిడ్డ సీసాను నోట్లో పెట్టుకుని నిద్రకు ఒరిగేలాగైతే దానిలో నీళ్లు మాత్రమే నింపడం మంచిది. పాలు త్రాగిన ప్రతిసారి శుభ్రమైన మెత్తని బట్టతో బిడ్డ పళ్లను శుభ్రపర్చడం మంచిది.

త్వరగా పళ్లు పాడైపోవడాన్ని నివారించవచ్చు. సరైన దంతసంరక్షణ, అవును, చివరికి పసిబిడ్డలకు కూడా ఎంతో ఆవశ్యకం!

(g00 11/22)