కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

తప్పుడు ప్రచారం జూలై-సెప్టెంబరు 2000 సంచికను చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. మీకు వినబడిన ప్రతి మాటనీ నమ్మాలా?” అనే వ్యాస పరంపరను బట్టి మీకు కృతజ్ఞతలు. నేను నివసిస్తున్న చోట, రొమేనీయులను (జిప్సీలను) ఎగతాళి చేయడం చాలా సాధారణమైపోయింది. వాళ్ళు దొంగతనాలు చేస్తారని అపోహ. వాళ్ళు ఎలా దొంగతనాలు చేస్తారనే దాన్ని గురించి ప్రజలు హాస్యోక్తులు చెప్పుకుంటారు. అలాంటి హాస్యోక్తులు చెప్పుకోవడం సముచితం కాదని ఈ వ్యాస పరంపర ద్వారా నేను గ్రహించాను. అలా చెప్పుకునేవారితో ఇక మీదట చేరకూడదని నేను నిర్ణయించుకున్నాను.

కె. ఎమ్‌., చెక్‌ రిపబ్లిక్‌

(g01 3/8)

విదేశంలో నివసించడం “యువత ఇలా అడుగుతోంది . . . నేను విదేశంలో నివసించాలా?” (జూలై-సెప్టెంబరు 2000) అనే ఆర్టికల్‌ను బట్టి మీకు చాలా కృతజ్ఞతలు. నేను ఈ ఫీచర్‌ని క్రమంగా చదువుతుంటాను. ప్రమాదమని మీరు చెప్పే కొన్ని సూచనలు అతిశయోక్తిగా చెప్తున్నట్లు నాకు అనిపిస్తుండేది. మరొక విశ్వవిద్యాలయానికి బదులుగా ఎక్స్‌చేంజ్‌ స్టుడెంట్‌గా మా పాఠశాల తరపున గత సంవత్సరం నేను విదేశానికి వెళ్ళాను. అది ఆసక్తికరమైన అనుభవమే అయినప్పటికీ, ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే అది అంత మంచిది కాదు.

ఎం. పి., ఇటలీ

ఈ ఆర్టికలూ, “యువత ఇలా అడుగుతోంది . . . నేను విదేశంలో విజయవంతంగా ఎలా నివసించగలను?” (ఆంగ్లం) (జూలై 22, 2000) అనే ఆర్టికలూ నాకు “తగినవేళ అన్నము”లా ఉంది. (మత్తయి 24:​45) ఒక విదేశ భాషను నేర్చుకునేందుకు, ఒక సంవత్సరం విదేశానికి వెళ్ళి ఉండాలని అప్పటికే నిర్ణయించుకున్నాను. మీరు ఇచ్చిన సూచనలకూ, ఆచరణాత్మక సలహాలకూ నేను నిజంగా కృతజ్ఞురాలిని.

ఐ. జెడ్‌., స్విట్జర్‌ల్యాండ్‌

(g01 3/8)

చిరునవ్వు “చిరునవ్వు మంచిది!” (జూలై-సెప్టెంబరు 2000) అనే విలువైన ఆర్టికల్‌ను ప్రచురించినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ ఆర్టికల్‌ చెప్పే విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నా చిరునవ్వు యథార్థమైనదిగా ఉండాలంటే నేను అన్నివేళలా అనుకూలంగా ఆలోచించాలని అది నాకు గుర్తు చేసింది. అవును చిరునవ్వు ఇతరులను స్నేహితులనుగా చేసుకునేందుకు సహాయపడుతుంది. అది మానసిక సంఘర్షణలను తొలగించుకునేందుకు కూడా సహాయపడుతుంది.

పి. సి., చైనా

(g01 3/8)

టైలు “టైలు​—⁠అప్పుడూ ఇప్పుడూ” (జూలై-సెప్టెంబరు 2000) అనే ఆసక్తికరమైన శీర్షికకు నా మెప్పుదలను తెలియజేయాలనుకున్నాను. నేను ముగ్గురు పిల్లల తల్లిని. యెహోవాను ప్రేమించడం వాళ్ళకు నేర్పుతున్నాను. మా పెద్ద కుమారుడికి 13 ఏండ్లు. దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో అసైన్‌మెంట్‌ ఉన్నప్పుడు టై కట్టుకోవాలంటే వాడికీ రాదు, కట్టివ్వడం నాకూ తెలియదు. నా భర్త, అవిశ్వాసి, ఆయనెన్నడూ టై కట్టుకోలేదు. టైని ఎలా కట్టుకోవాలో ఇంత సరళంగా మాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతలు.

ఎమ్‌. బి., అమెరికా

నాకు 11 ఏండ్లు. ఈ పత్రికలోని చిత్రాలు, టై కట్టుకోవడమెలాగో నాకు నేర్పించాయని చెబితే మీకు వింతగా అనిపిస్తుండవచ్చు. నా బీరువాలో ఉన్న టైలన్నింటినీ నేనిప్పుడు కట్టుకోగలను!

ఏ. పి., ఇటలీ

(g01 2/22)

అనకొండలు అనకొండలు ఉన్న ప్రాంతంలో నేను నివసిస్తున్నాను. ప్రజలు తరచూ ఈ పాములను గురించిన కథలను చెబుతుంటారు. అయితే వాటిని నమ్మాలా వద్దా అన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టం. “అనకొండలు​—⁠అవి ఏమైన మర్మాలను వెల్లడిచేస్తున్నాయా?” (ఆంగ్లం) (మే 22, 2000) అనే ఆర్టికల్‌ అనకొండలను గురించిన కథల్లో వాస్తవమేమిటో కల్పితమేమిటో గ్రహించేందుకు సహాయం చేసింది, ఈ అద్భుత సృష్టిని గురించి నాకున్న సందేహాలన్నింటికీ అది జవాబులనిచ్చింది.

జె. ఎస్‌. పి., బ్రెజిల్‌

(g01 2/8)