కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రేడియోధార్మిక పరమాణు ధూళి ఆందోళన కల్గిస్తున్న విషయం

రేడియోధార్మిక పరమాణు ధూళి ఆందోళన కల్గిస్తున్న విషయం

రేడియోధార్మిక పరమాణు ధూళి ఆందోళన కల్గిస్తున్న విషయం

అణ్వాయుధాల పరీక్షలు 1950లలో జరిగిన తర్వాత, పరమాణు ప్రతిచర్యల మూలంగా వెలువడే ఉత్పాదకమైన స్ట్రోన్షియమ్‌ 90 (ఎస్‌ఆర్‌90) పిల్లల పాలపళ్లలో ఉన్నట్లు కనుగొనబడిందని కెనడా వార్తాపత్రికయైన గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ నివేదిస్తుంది. ఆ కాలంలో, అది పిల్లల్లో క్యాన్సర్‌ వ్యాధి ఎక్కువగా రావడానికి కారణమైందని పేర్కొనబడింది.

దశాబ్దాల తర్వాత ఇప్పుడు, యూ.ఎస్‌. రేడియేషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన శాస్త్రజ్ఞులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న అంతర్గత-వైద్య నిపుణురాలైన డా. జానెట్‌ షెర్మన్‌, “1990 తర్వాత జన్మించిన పిల్లల పాలపళ్లలో కనుగొనబడిన ఎస్‌ఆర్‌90 మోతాదు, భూ ఉపరితలంపై అణ్వాయుధ పరీక్షలు నిర్వహించబడిన కాలంలో ఉండిన మోతాదుకు చేరుకుంటుంది” అని వివరిస్తోంది.

ఎస్‌.ఆర్‌.90 ఎక్కడి నుండి వస్తోంది? గతంలో జరిగిన అణు దుర్ఘటనలు, సరిగ్గా పనిచేస్తున్న అణు కర్మాగారాల రేడియేషన్‌, లేక చాలా సంవత్సరాల క్రితం చేయబడిన బాంబు పరీక్షలు కారణమై ఉండవచ్చునని కొంతమంది శాస్త్రజ్ఞులు అంటున్నారు. * దానికి కారణం ఏదైనప్పటికీ, కలుషితమైన చెట్లనుండి వచ్చే ఆహారపదార్థాలను తినడం ద్వారా, కలుషితమైన గడ్డిని తినే ఆవులు ఇచ్చే పాలను త్రాగడం ద్వారా ఎస్‌ఆర్‌90 మానవుల్లోకి ప్రవేశిస్తోంది. ఎస్‌ఆర్‌90 రసాయనపరంగా చూస్తే కాల్షియం వంటిదే కాబట్టి, మానవుల ఎముకల్లో ఈ రేడియోధార్మిక పదార్థం నిల్వ ఉండిపోవడం వల్ల ఎముకల కాన్సర్‌, లుకేమియా వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతోంది.

భావి తరాలు రేడియేషన్‌కు గురవ్వడాన్ని గురించి కూడా గ్లోబ్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ వార్తాపత్రిక ఇలా వివరిస్తుంది: “[అణు వ్యర్థపదార్థం] రియాక్టర్‌ కోర్‌లోకి నింపబడినప్పటి కంటే దానిలోనుండి బయటికి తీయబడినప్పుడు పది లక్షల రెట్లు రేడియోధార్మిక శక్తిని కల్గివుంటుంది. రియాక్టర్‌ కోర్‌ నుండి అప్పుడే తీయబడిన తాజా ఫ్యూయల్‌ బండిల్‌ ఎంత ప్రాణాంతకమైనదిగా ఉంటుందంటే, ఆ ఫ్యూయల్‌ బండిల్‌కు ఒక మీటరు దూరంలో నిలబడి ఉన్న వ్యక్తి రేడియేషన్‌ విషం వల్ల కేవలం ఒక్క గంటలో మరణిస్తాడు.”

రేడియో ధార్మిక పరమాణు ధూళి మానవజాతికి పెనుభూతంలా కనిపిస్తుంటే, సురక్షితమైన భవిష్యత్తు కోసం నిరీక్షించడం వాస్తవికంగా ఉంటుందా? భూమి, దానిపైనున్న జీవరాశి సృష్టించబడినప్పుడు, అంతా “చాలమంచిదిగ” ఉండిందని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:31) మన భూగ్రహం త్వరలోనే పరదైసుగా మారుతుందన్న బైబిలు వాగ్దానాన్ని మనం సంపూర్ణంగా నమ్మవచ్చు. రేడియేషన్‌ మూలంగా కలుషితమైన ఆహారపదార్థాలు, నీరు గతించిన విషయాలై ఉంటాయి.​—కీర్తన 65:9-13; ప్రకటన 21:1-4.(g01 2/22)

[అధస్సూచి]

^ యుక్రేయిన్‌లో, 1986లో సంభవించిన ఛెర్నోబిల్‌ అణు కేంద్ర దుర్ఘటన తర్వాత, జర్మను పిల్లల పాలపళ్లలో ఎస్‌ఆర్‌90 శాతం పదిరెట్లు ఎక్కువగా ఉంది.

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫోటో: U. S. Department of Energy photograph