కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అది ఆమె విశ్వాసాన్ని బలపరచింది

అది ఆమె విశ్వాసాన్ని బలపరచింది

అది ఆమె విశ్వాసాన్ని బలపరచింది

న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఒక స్త్రీ, విల్‌ దేర్‌ ఎవర్‌ బి ఎ వరల్డ్‌ వితవుట్‌ వార్‌? (యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా?) అనే 32 పేజీల బ్రోషూరు గురించి ఇలా వ్రాసింది: “నేనీ బ్రోషూరు విషయంలో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను, దాన్ని చదివి నేనెంతో ఆనందించాను. నేను యూదురాల్ని కాకపోయినా, యెహోవాసాక్షిగా ఉన్న తల్లి నన్ను పెంచినా, ఏ ఇతర సాహిత్యమూ నన్ను ఇంతగా కదిలించలేకపోయింది!

“మొదట్లో దాన్ని చదవడానికి నేను సంకోచించాను, ఎందుకంటే ఆ బ్రోషూరు ఎక్కువగా యూదుల ఆసక్తిని రేకెత్తించడానికి వ్రాయబడింది కాబట్టి దాన్ని చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని నేను తలంచాను. అది తప్పని తేలింది. ప్రతి విషయం స్పష్టంగా, సరళంగా, సహేతుకంగా అందించబడింది.”

చరిత్రలో కొందరు ప్రజలు నిజంగా ఘోరమైన బాధలను అనుభవించారు. అది యూదుల విషయంలోనూ వాస్తవమే, ప్రాముఖ్యంగా గత శతాబ్దంలోని నాజీల మారణకాండలో వారలాంటి బాధలను అనుభవించారు. విల్‌ దేర్‌ ఎవర్‌ బి ఎ వరల్డ్‌ వితవుట్‌ వార్‌? అనే బ్రోషూరును చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. “దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తాడు?” “సత్య దేవుణ్ణి తెలుసుకోవడం​—⁠అంటే ఏమిటి?” “ప్రపంచ దేశాలను శాంతి వైపుకి ఎవరు నడిపిస్తారు?” అనే విషయాలు అందులో చర్చించబడ్డాయి.

ఈ క్రిందనున్న కూపన్‌ను నింపి అందులో ఉన్న అడ్రసుకి లేదా ఈ పత్రికలోని 5వ పేజీలోని అనుకూలమైన అడ్రసుకి పోస్టులో పంపించడం ద్వారా మీరు మరింత సమాచారాన్ని పొందవచ్చు.(g01 6/22)

విల్‌ దేర్‌ ఎవర్‌ బి ఎ వరల్డ్‌ వితవుట్‌ వార్‌? అనే బ్రోషూరు గురించిన మరింత సమాచారాన్ని పంపించండి

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం చేయడానికి నన్ను కలవండి.