కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

శరీర అలంకరణ “బైబిలు ఉద్దేశము: శరీర అలంకరణ​—⁠సహేతుకత అవసరం” (అక్టోబరు - డిసెంబరు 2000) అనే ఆర్టికల్‌కు ప్రతిస్పందనగా నేను వ్రాస్తున్నాను. శరీరాన్ని అభిరుచి మేరకు అలంకరించుకోవడం మూలంగా అందంగా కనిపిస్తాము, అది నిజంగా ఒక కళ. సమాజం నా పైరూపం ఆధారంగా నా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటుండవచ్చు, ఫలాని తరహా వ్యక్తని నిర్ధారణకు రావచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను ప్రేమపాత్రురాలినని నాకు తెలుసు. ఇతరులు నా పచ్చ బొట్లపై అవధానం నిలపకుండా నేను అంతరంగంలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నానన్న దాన్ని చూడాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.

కె. ఎమ్‌., అమెరికా

ఆ ఆర్టికల్‌ ఒక వ్యక్తి శరీర అలంకరణ చేసుకోవడానికి శ్రద్ధ చూపించాలని నిర్ణయించుకుంటాడా లేక వద్దని నిర్ణయించుకుంటాడా అన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఒప్పుకుంది. అయితే ఒకరు అంతరంగంలో అందమైన వ్యక్తని ‘అణుకువతోను స్వస్థబుద్ధితోను తనను తాను అలంకరించుకోవడం’ ద్వారా చూపించవచ్చు. (1 తిమోతి 2:9) ఒక క్రైస్తవుడు తన స్వంత మనస్సాక్షిని మాత్రమే కాక “ఎదుటివాని మనస్సాక్షిని” కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా బైబిలు స్పష్టం చేస్తోంది. (1 కొరింథీయులు 10:29)​—ఎడి. (g01 4/8)

లైంగిక వేధింపు “యువత ఇలా అడుగుతోంది . . . లైంగిక వేధింపుతో నేనెలా వ్యవహరించేది?” (అక్టోబరు - డిసెంబరు 2000) అనే ఆర్టికల్‌కు నా అభినందనలు. నేను అనైతిక ప్రవర్తనలో పాల్గొనలేదు కాబట్టి స్కూల్లో నాకెన్నో పేర్లు పెట్టారు. హైస్కూలు అయిపోయిన తర్వాత వేధింపు ఆగిపోతుందని నేననుకున్నాను, కానీ అనేకమంది అమ్మాయిలు అసభ్యమైన వ్యాఖ్యానాలు చేశారు. నా క్రైస్తవ నమ్మకాలను అందరికీ తెలిసేలా చేయడం, అలాంటి ప్రతిపాదనలను నిరోధించేందుకు నాకు సహాయం చేసింది. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.

హెచ్‌. సి., జాంబియా (g01 4/22)

ఈ ఆర్టికల్‌ చాలా సహాయపడింది. మా థర్డ్‌-గ్రేడ్‌ తరగతిలోని ఒక అబ్బాయి నన్ను తదేకంగా చూస్తూనే ఉంటాడు. ఏం చెయ్యాలో నాకిప్పుడు అర్థమయ్యింది.

హెచ్‌. కె., అమెరికా (g01 4/22)

సరిగ్గా సమయానికి వచ్చింది! నేను ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపును అనుభవిస్తున్నాను. భావోద్రేకపరంగా నేను తీవ్ర మనస్తాపానికి గురౌతున్నాను. నేనిక భరించలేనని అనుకున్నప్పుడు ఈ ఆర్టికల్‌ కనిపించింది. ఉద్యోగ స్థలంలోని ప్రజలతో ఎలా వ్యవహరించాలో నాకిప్పుడు తెలుసు.

ఎల్‌. టి., అమెరికా (g01 4/22)

నర్సులు నేను దాదాపు మూడు సంవత్సరాలుగా నర్సుగా పని చేస్తున్నాను. వ్యాధులతో బాధలతో ప్రత్యక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సులభమైన పని కాదు. “నర్సులు​—⁠వాళ్లు లేకుండా మనం ఏమి చేయగలం?” (జనవరి - మార్చి 2001) అనే ఆర్టికల్‌ల పరంపరను చదవడం ద్వారా ఇతరులు మా పనిని అర్థం చేసుకుని కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉందో! అంతకన్నా ప్రోత్సాహకరంగా ఉన్నదేమిటంటే, త్వరలోనే నర్సుల అవసరం ఏమాత్రం ఉండదన్న బైబిలు వాగ్దానం.​—యెషయా 33:24.

జె. ఎస్‌. బి., బ్రెజిల్‌ (g01 7/8)

నేనూ నా భర్తా అవుట్‌పేషెంట్‌ నర్సింగ్‌ సర్వీసును నడుపుతాము. ఈ ఆర్టికల్‌ల పరంపర మాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. మా వృత్తి పట్లా మా పేషెంట్ల పట్లా మా వైఖరిని మెరుగుపర్చుకునేందుకు అది సహాయం చేసింది. చాలా అద్భుతంగా వ్రాశారు!

ఎస్‌. ఎస్‌., జర్మనీ (g01 7/8)

చాలా సున్నితమైన విషయంపై ఆర్టికల్‌లు వ్రాసినందుకు కృతజ్ఞతలు. ఎన్నో రీతుల్లో పరిణతి సాధించేందుకు నర్సింగ్‌ నాకు సహాయం చేసింది. జీవిత సంకల్పమేమిటి అన్న దాని గురించి ఆలోచించేందుకు కారణమయ్యింది, బైబిలు అధ్యయనం చేసేందుకు దారి తీసింది. నేను పొందిన ప్రశంసలన్నింట్లోకెల్లా ఈ తేజరిల్లు! సంచిక ఇచ్చిన ప్రశంస చాలా గొప్పది. నేను దాన్నుండి చాలా కాలంపాటు ప్రోత్సాహాన్ని పొందుతాను!

జె. డి., చెక్‌ రిపబ్లిక్‌ (g01 7/8)

ఈ ఆర్టికల్‌ల పరంపరకు మీకు కృతజ్ఞతలు. నేను చాలా సంవత్సరాలుగా రిజిస్టర్డ్‌ నర్సుగా పనిచేస్తున్నాను. నా పేషెంట్‌ల పట్ల నేనెంత సహానుభూతితో ఉంటానంటే వారికి కళ్ళ మందిస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులు ఈ తేజరిల్లు! సంచికకు సానుకూలంగా ప్రతిస్పందిస్తారని నా గట్టి నమ్మకం.

ఎల్‌.ఎ.ఆర్‌., అమెరికా (g01 7/8)