కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ ఐక్యత కేవలమొక కల కాదు

ప్రపంచ ఐక్యత కేవలమొక కల కాదు

ప్రపంచ ఐక్యత కేవలమొక కల కాదు

కేరళలోని ఒక వ్యక్తి, ఈ పత్రికను గురించి వ్రాస్తూ, “మీ తేజరిల్లు! పత్రిక మిగతా పత్రికలన్నింటిలోకెల్లా విశిష్టమైన పత్రిక. ఇది చర్చించని అంశమంటూ ఏదీ లేదని నేను భావిస్తున్నాను. నేను ముఖ్యంగా ప్రకృతిని గురించిన ఆర్టికల్‌లను చదివి ఆనందించాను” అని ఈ పత్రిక ప్రకాశకుడికి వ్రాశాడు.

ఆ వ్యక్తికి తేజరిల్లు! ఆకర్షణీయంగా అనిపించడానికి ఒక కారణం ఉంది. “వివిధ జాతీయతలకు చెందిన ప్రజలు తాము సహోదరులమని భావించేలా సహాయపడడంలో తేజరిల్లు!కు మరే పత్రికా సాటిరాదని నా అభిప్రాయం. మరే పత్రికా తేజరిల్లు!లా ప్రపంచ ఐక్యత అనే ఆలోచనను వృద్ధిచేయడం లేదు. నేను చదివే అనేక పత్రికలతో పోల్చితే, తేజరిల్లు! విలువైన పత్రిక అని నిశ్చయంగా నేను చెప్పగలను” అని ఆయన అంటున్నాడు.

ఆ పాఠకుడు పేర్కొన్న విషయాలు, “ఇది రాజకీయంగా ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటూ, ఒక జాతిని మరో జాతికంటే ఎక్కువని ఘనపర్చదు” అని తేజరిల్లు! ఉద్దేశాన్ని గురించి దాని ప్రతి సంచికలోను 4వ పేజీలో కనిపించే మాటలతో పొందికగా ఉన్నాయి. అంతకంటే ప్రాముఖ్యంగా, జీవితాన్ని గురించిన ప్రాముఖ్యమైన ప్రశ్నల సమాధానాల కోసం సృష్టికర్త వైపు చూడమని పాఠకులను తేజరిల్లు! నిర్దేశిస్తుంది.

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషూర్‌ కూడా అదే నిర్దేశిస్తుంది. దానిలో ఉన్న 16 పాఠాల్లో కొన్ని: “దేవుడెవరు?,” “భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?,” “దేవుని రాజ్యమంటే ఏమిటి?” ఈ బ్రోషూర్‌ గురించిన మరింత సమాచారం కావాలంటే, ఈ క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పూరించి, ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రిక యొక్క 5వ పేజీలోని చిరునామాల్లో మీకనుకూలమైన చిరునామాకు వ్రాసి అడగవచ్చు.(g01 7/22)

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్‌ను గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపించండి.

□నాతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేయడానికి నన్ను ఈ చిరునామాలో సంప్రదించండి.