కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! అతని ప్రాణాన్ని ఎలా కాపాడింది?

తేజరిల్లు! అతని ప్రాణాన్ని ఎలా కాపాడింది?

తేజరిల్లు! అతని ప్రాణాన్ని ఎలా కాపాడింది?

“నాకుటుంబానికి నేను భారంగా ఉండకూడదనుకున్నాను, దానికి పరిష్కారం ఆత్మహత్యేనని నేను నిర్ణయించుకున్నాను” అని నేపాల్‌లో ఉన్న ఒకాయన వ్రాశాడు. ఆయనిలా కొనసాగిస్తున్నాడు: “నేను ఒక తాడు సిద్ధంచేసుకుని, స్థలాన్నీ రోజునూ నిర్ణయించుకున్నాను. ఆ రోజుకి సరిగ్గా వారం ముందు ఫిబ్రవరి 22, 2000, తేజరిల్లు! (ఆంగ్లం) సంచిక వచ్చింది.”

“ఆత్మహత్య​—⁠ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?” అనే ముఖచిత్ర శీర్షికతో మొదలయ్యే ఆర్టికల్‌లు ఉన్న సంచిక అది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “దాన్ని నా చేతుల్లోకి తీసుకోవడానికి నా ఒంట్లోని సత్తువనంతటినీ, దాన్ని చదవడానికి నాలో మిగిలివున్న ధైర్యాన్నంతటినీ కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఆత్మహత్యకు దారితీసే 10 ప్రమాదకర పరిస్థితుల గురించిన వివరణ నాపై ప్రగాఢ ముద్ర వేసి నా మనస్సుని మార్చింది.” ఆయనిలా ముగించాడు: “నా కోసం మీరు చేసిన దానికి నా కృతజ్ఞతను వ్యక్తపర్చకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఆర్టికల్‌ను వ్రాయడానికి మీరు చేసిన కృషి నా ప్రాణాన్ని కాపాడింది!”

నేడు ఆత్మహత్యల రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో జీవితానికి ఎలాంటి సంకల్పం లేదని అనేకమంది భావించడం ఒక కారణం. భవిష్యత్తులో నిజంగానే మంచి జీవితం ఉందని తెలుసుకునేందుకు, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే బ్రోషూరు చాలామందికి సహాయపడింది. ఈ బ్రోషూరు గురించి మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పూరించి, ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రిక 5వ పేజీలోని చిరునామాల్లో మీకనుకూలమైన చిరునామాకు మీరు వ్రాయవచ్చు. (g01 10/8)

జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే బ్రోషూర్‌ను గురించి మరింత సమాచారాన్ని నాకు పంపించండి.

□నాతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేయడానికి నన్ను ఈ చిరునామాలో సంప్రదించండి.