కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బహుశా ఈ సారైనా ఆయన మారుతుండవచ్చు”

“బహుశా ఈ సారైనా ఆయన మారుతుండవచ్చు”

“బహుశా ఈ సారైనా ఆయన మారుతుండవచ్చు”

ఉత్సాహంగా, ఆకర్షణీయంగా ఉండే రొక్సానా * నలుగురు పిల్లల తల్లి. ఆమె దక్షిణ అమెరికాలో మంచి పేరుప్రతిష్ఠలున్న ఒక సర్జన్‌ భార్య. “నా భర్త ఆడవాళ్ళతో ఆహ్లాదకరంగా, మగవాళ్ళతో వాళ్ళ అభిరుచికీ తాహతుకూ అనుకూలంగా ఉంటాడు” అని ఆమె చెబుతుంది. కాని రొక్సానా భర్తలో, ఆయన సన్నిహిత స్నేహితులు కూడా చూడని చీకటి కోణమొకటి ఉంది. “ఇంట్లో ఆయన రాక్షసుడు. ఆయనలో తీవ్రమైన అసూయ ఉంది.”

రొక్సానా తన వృత్తాంతాన్ని చెబుతుండగా, ఆమె ముఖంలో ఉద్వేగం స్పష్టంగా కనబడుతోంది. “మేము పెళ్ళి చేసుకున్న కొన్ని వారాలకే సమస్య ప్రారంభమైంది. మమ్మల్ని చూడడానికి మా తమ్ముళ్ళు, మా అమ్మ వచ్చినప్పుడు, నేను వారితో కబుర్లు చెబుతూ నవ్వుతూ చాలా ఆనందంగా గడిపాను. కాని వాళ్ళలా వెళ్ళగానే, నా భర్త అదుపులేని కోపోద్రేకంతో, చాలా క్రూరంగా నన్ను సోఫా మీదికి నెట్టేశాడు, ఏమి జరిగిందో నేను నమ్మలేకపోయాను.”

విషాదకరంగా, రొక్సానా కష్టాలకు అది ఆరంభం మాత్రమే. సంవత్సరాలపాటు ఆమె పదే పదే దెబ్బలు తిన్నది. ఆ దౌర్జన్యం పునరుక్తమవుతున్నట్లుగా అనిపిస్తుంది. రొక్సానా భర్త ఆమెను కొడతాడు, ఆ తర్వాత క్షమించమని బాగా వేడుకొని, మరోసారి అలా ఎన్నడూ చేయనని వాగ్దానం చేస్తాడు. కొంతకాలం వరకు ఆయన ప్రవర్తనలో మార్పు కనిపించినా, హఠాత్తుగా ఆ దుర్భర పరిస్థితి మళ్ళీ ఆరంభమమవుతుంది. “నేను ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా, బహుశా ఈ సారైనా ఆయన మారుతుండవచ్చు అనుకొని, ప్రతిసారి తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళేదాన్ని” అని రొక్సానా చెప్పింది.

రొక్సానా తన భర్త దౌర్జన్యం ఏదో ఒకరోజు ఇంకా అధికమవుతుందని భయపడుతుండేది. “నన్ను, పిల్లల్ని చంపి తనూ చనిపోతానని ఒకసారి బెదిరించాడు” అని ఆమె అంది. “ఒకసారైతే నా గొంతు దగ్గర కత్తెర పెట్టాడు. మరొకసారి తుపాకితో బెదిరించాడు, దాన్ని నా చెవి దగ్గర గురిపెట్టి ట్రిగ్గర్‌ నొక్కాడు, దాంట్లో బుల్లెట్లు లేవు కాబట్టి సరిపోయింది, కాని నేను భయంతో దాదాపు చచ్చినంత పనయ్యింది.”

మౌనంగా సహించే వారసత్వం

రొక్సానాలాగే, ప్రపంచవ్యాప్తంగా కోట్లకొలది స్త్రీలు, దౌర్జన్యంగా మగవారిచేత హింసించబడుతున్నారు. * వారిలో చాలామంది తమ బాధలను మౌనంగా సహిస్తుంటారు. దాని గురించి ఫిర్యాదు చేస్తే ప్రయోజనమేమీ ఉండదని వారనుకుంటారు. ఎంతైనా, అత్యాచారం చేసే భర్తల్లో చాలామంది, “నా భార్య ఊరికే కంగారు పడుద్ది” లేక “ఆమె గోరంతలను కొండంతలు చేస్తుంది” అని ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేస్తారు.

అనేకమంది స్త్రీలు, అతి సురక్షితమైన స్థలమని భావించాల్సిన తమ స్వగృహాల్లోనే, ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ జీవించడం విషాదకరమైన విషయమే. కానీ, తరచుగా సానుభూతి, బాధితులపై కాకుండా దుష్కృత్యాలు చేసేవారిపై చూపించడం చింతించాల్సిన విషయం. నిజమే, ఒక గౌరవనీయుడైన వ్యక్తి తన భార్యను కొడతాడంటే కొందరు నమ్మలేరు. అనిత అనే ఒక స్త్రీ మంచి పేరు ప్రతిష్ఠలున్న తన భర్త చేత హింసింపబడుతున్న విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడినందుకు ఆమెకు ఏమి జరిగిందో చూడండి. “మాకు తెలిసిన ఒకాయన నాతో, ‘గౌరవనీయుడైన అంత మంచి మనిషిని మీరెలా నిందించగలుగుతున్నారు?’ అన్నాడు. మరొక వ్యక్తి, నేనే ఏదో విధంగా ఆయనను రెచ్చగొడుతున్నట్లనిపిస్తోందని అన్నాడు! నా భర్త నిజస్వరూపం తెలిసాక కూడా, నా స్నేహితులు కొందరు నా నుండి తప్పించుకొని తిరగడం ఆరంభించారు. ‘మగవాళ్ళు అలాగే ఉంటారు’ కాబట్టి నేనే సర్దుకుపోవాలి అని వాళ్ళు భావించారు.”

అనిత అనుభవములో చూపించిన విధంగానే, భార్యలమీద అత్యాచారం జరుగుతుందనే చేదు నిజాన్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టంగానే ఉంటుంది. ఒక వ్యక్తి తను ప్రేమిస్తున్నానని చెప్పే స్త్రీతోనే ఇంత కౄరంగా ప్రవర్తించడానికి కారణమేమిటి? అలాంటి హింసకు గురవుతున్న బాధితులకు ఎలా సహాయం చేయవచ్చు? (g01 11/8)

[అధస్సూచీలు]

^ ఈ సీరీస్‌లోని పేర్లు మార్చబడినవి.

^ మగవాళ్ళు కూడా చాలామంది దౌర్జన్యానికి బాధితులవుతున్నారని మేము అంగీకరిస్తున్నాము. కాని ఎక్కువగా స్త్రీలు గాయపడుతున్నారనీ అవికూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయని జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే, అత్యాచార బాధిత స్త్రీల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చించబడింది.

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇంట్లో జరిగే హింసలు అనేక విధాలు

‘స్త్రీలపై దౌర్జన్యాన్ని నిర్మూలించడం విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రకటన’ ప్రకారం, “స్త్రీలపై దౌర్జన్యం” అనే మాట, “బహిరంగంగా లేక ఇండ్లలో లింగ భేదాల కారణంగా జరిగే హింసాత్మక చర్యను, అలాంటి చర్యతో శారీరకంగా, లైంగికంగా లేక మానసికంగా హాని కలుగజేయడాన్ని, స్త్రీని బాధపెట్టడాన్ని, అలాంటి చర్యలతో భయపెట్టడాన్ని, బలాత్కారం చేయడాన్ని లేక నిరంకుశాధికారం చూపడాన్ని” సూచిస్తుంది. ఈ దౌర్జన్యంలో, “కుటుంబంలో మరియు సాధారణ సమాజంలో జరుగుతున్న శారీరక, లైంగిక, మానసిక హింసలతోపాటు, కొట్టడం, ఆడపిల్లలపై అత్యాచారం చేయడం, వరకట్న సంబంధమైన దౌర్జన్యం, వైవాహిక బలాత్కారం, స్త్రీలకు సున్నతి మాత్రమేగాక స్త్రీలకు హానికలిగించే అలాంటి ఇతర ఆచారాలు” ఉన్నాయి.