కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిత్తు కాగితాలను కొనే దుకాణంలో దొరికింది

చిత్తు కాగితాలను కొనే దుకాణంలో దొరికింది

చిత్తు కాగితాలను కొనే దుకాణంలో దొరికింది

ఇండియాలోని చెన్నైలో, తమిళం మాట్లాడే ఒక యువకుడు ఆగస్టు 8, 1999 తేజరిల్లు! సంచికను ఆ దుకాణంలోనే చూశాడు. దాంతోపాటు లభించిన ఇతర సంచికలను కూడా పరిశీలించిన తర్వాత, వాటి గురించి తన అభిప్రాయాన్ని ఇండియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వ్రాసిన ఒక ఉత్తరంలో వ్యక్తం చేశాడు.

తేజరిల్లు! ఒక అద్భుతమైన పత్రిక, ఎంతో సమాచారాన్ని అందజేస్తుంది, ఎంతో ఉపయోగకరంగా ఉంది. అందులో తెలియజేయబడిన విషయాలు చాలా సహాయకరంగా ఉన్నాయి. మీకు నా అభినందనలు” అని అతను వ్రాశాడు.

తరువాత ఆ యువకుడు ఇలా కోరాడు: “బుద్ధి వికాసాన్ని కలిగించే, ప్రపంచ నలుమూలలా ప్రయాణించే ఈ పత్రిక నా వ్యక్తిగత గ్రంథాలయంలో కూడా ఉండాలని నా కోరిక. ఇప్పటి వరకు ప్రచురించబడిన పత్రికలను చదివిన తరువాత, రానున్న పత్రికలను కూడా నేను పొందాలని ఇష్టపడుతున్నాను.”

ప్రతి పత్రిక నాలుగవ పేజీలో వివరించబడినట్టు తేజరిల్లు! అనేక విషయాల గురించి జ్ఞానోదయం కలిగిస్తుంది. అంతేకాకుండా, అది ఎందుకు ప్రచురించబడుతోందో, అందులో ఇలా చెప్పబడింది: “అతి ప్రాముఖ్యంగా, ఈ పత్రిక ప్రస్తుత దుష్ట అరాచక విధానం స్థానంలో రానున్న శాంతిభద్రతలతో కూడిన ఒక నూతనలోకాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానమందు నమ్మకాన్ని దృఢపరుస్తుంది.”

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషురు, మనము దేవుని అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలో చూపిస్తూ బైబిలునుండి సమాచారాన్ని అందిస్తూ, పైన పేర్కొన్న, దేవుని ఆ సంకల్పాన్ని నొక్కి చెబుతుంది. క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పూరించి, ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రిక 5వ పేజీలోని చిరునామాల్లో మీకనుకూలమైన చిరునామాకు పంపించడం ద్వారా మీరు ఈ బ్రోషురును గురించి మరింత సమాచారాన్ని కోరవచ్చు. (g02 3/22)

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషురును గురించి మరింత సమాచారాన్ని నాకు పంపించండి.

□నాతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేయడానికి నన్ను ఈ చిరునామాలో సంప్రదించండి.