మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
మంచి ఆరోగ్యం “అందరికీ మంచి ఆరోగ్యం—అది సాధ్యమేనా?” (జూలై-సెప్టెంబరు 2001) అన్న శీర్షిక నుండి నేను పొందిన ఓదార్పు, ప్రోత్సాహం చెప్పలేనంత అపారమైనవి. నేను మానసిక వ్యాధితో బాధపడుతున్నాను, గతంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకునేదాన్ని. ప్రతిరోజు నేను, ‘నాకు ఈ రోజు ఎలా గడుస్తుంది?’ అని ఆలోచించేదాన్ని. ఈ పత్రిక ‘మీ కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాను’ అని ప్రకటన 21:4 నందు యెహోవా చేసిన వాగ్దానాన్ని నాకు గుర్తు చేసింది.
సి. టి., జపాన్ (g02 2/8)
అద్భుతమైన ఆర్టికల్‌లను అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రకృతి వైద్యం చేసే నేను, అనారోగ్యం లేకుండా ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. అప్పుడు, వైద్యునిగా నేను చేస్తున్న పని ఆపుచేసి, నాకు ఇష్టమైన మరో పనిని అంటే వ్యవసాయాన్ని చేపట్టగలుగుతాను!
బి. సి., అమెరికా (g02 2/8)
మాత్‌లు నాకు పద్నాలుగేళ్ళు, నేను “అందమైన మాత్” (జూలై-సెప్టెంబరు 2001) అనే ఆర్టికల్ చదివినప్పుడు చాలా ముగ్ధురాలినయ్యాను. మాత్‌లు చూడ్డానికి భయంకరంగా ఉంటాయని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, కానీ ఈ ఆర్టికల్ చదివాను కాబట్టి, ఇకముందు వాటిని కొట్టిచంపేముందు మరోసారి ఆలోచిస్తాను!
డి. ఎస్., అమెరికా (g02 2/8)
నేను ఈ ఆర్టికల్ చదువుతుండగా నా కాళ్ళ దగ్గరకు ఒక మాత్ వచ్చి వాలింది. అంత అందమైన మాత్‌ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రకృతి నిజంగా అద్భుతమైనది, దాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవునియెడల మన ప్రేమ మరింత అధికమవుతుంది.
జి. పి., ఇటలీ (g02 2/8)
యెహోవా చేసిన మాత్‌ల అందాన్ని, వైవిధ్యాన్ని గుర్తించకుండా, నేను అవి అనాసక్తమైన పురుగులని అనుకునేదాన్ని. ఈ ఆర్టికల్ చదివాక, నేను మొక్కలకు నీళ్ళు పోస్తుండగా ఒక అందమైన మాత్ నా దగ్గరకు వచ్చింది. వాటిని సృష్టించినందుకు, నన్ను మరింత శ్రద్ధతో పరిశీలించే వ్యక్తిగా చేసిన ఆ ఆర్టికల్‌ను అందించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాను.
సి. యస్., అమెరికా (g02 2/8)
విద్వేషం మా అన్నయ్య ఇటీవలే నన్ను కలవడానికి వచ్చాడు. ఆయన, తాను ఒక మూఢవిశ్వాసినని బహిరంగంగా అలా తెలియజేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. ఆయన వివిధ జాతుల గురించి మాట్లాడుతూ వాటిపట్ల తనకున్న తృణీకారాన్ని తీవ్రంగా వ్యక్తం చేశాడు. నేను ఆయనకు సహాయపడాలనుకున్నాను, కానీ ఈ విషయం గురించిన సంభాషణను ఎలా మొదలుపెట్టాలో నాకు తెలియదు. నేను “విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయండి” అన్న పరంపరగల అక్టోబరు-డిసెంబరు, 2001 తేజరిల్లు! శీర్షిక చూసిన వెంటనే, అది నా ప్రార్థనకు జవాబేనని గుర్తించాను.
ఎల్. బి., అమెరికా (g02 3/22)
మీరు వ్రాసినది, ఒక సహేతుకమైన వ్యక్తి అంగీకరించతగినదిగా లేదు. “అపరిపూర్ణ మానవులు చెడు ప్రవృత్తులతో లోపాలతో జన్మించారని బైబిలే చెబుతోంది. (ఆదికాండము 6:5; ద్వితీయోపదేశకాండము 32:5) నిజమే, ఆ మాటలు మానవులందరికీ వర్తిస్తాయి” అని మీరు అన్నారు. కానీ ఈ లేఖనాలు నిర్దిష్టమైన సమయాల్లో, నిర్దిష్టమైన ప్రదేశాల్లో రెండు ప్రత్యేకమైన గుంపులను ఉద్దేశించి చెప్పబడ్డాయి. వాటిని మానవులందరికీ అన్వయించడం ఎంతమాత్రం కుదరదు.
డి. సి., చెక్ రిపబ్లిక్
“తేజరిల్లు!” ప్రతిస్పందన: నిజమే, ఈ మాటలు జలప్రళయానికి ముందు జీవించిన ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి నిర్దిష్టమైన అన్వయింపును కలిగి ఉన్నాయి. కానీ, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని బైబిలు పదే పదే స్పష్టం చేస్తోంది. (రోమీయులు 3:23; 5:12; యోబు 14:4; కీర్తన 51:5) కాబట్టి, ఇశ్రాయేలీయులు, జలప్రళయానికి ముందు జీవించిన ప్రజలు మానవ అపరిపూర్ణతకు ఉదాహరణలుగా పేర్కొనబడ్డారు. (g02 3/22)
నవహో నవహో స్త్రీ అయిన సాండీ యాసీ జోసీ చెప్పిన “దేవుని నామము నా జీవితాన్నే మార్చేసింది!” (అక్టోబరు-డిసెంబరు 2001) అనే ప్రోత్సాహకరమైన, అద్భుతమైన ఆర్టికల్ కోసం నేను మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఆమె మాటలు నా హృదయాన్ని తాకాయి, నేను ఏడ్చేలా చేశాయి. ప్రేమా సంతోషాలను కనుగొనడానికి, తన మానసిక కృంగుదలను అధిగమించడానికి ఆమె చేసిన ప్రయాణం గురించి చదవడం, నాకు నిరీక్షణను ఇచ్చింది. యెహోవా దేవుడు మనందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను గ్రహించాను!
ఏ. ఎస్., అమెరికా (g02 3/22)