కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పీడకలలా వెన్నంటే దృశ్యాలు, మిణుకుమిణుకుమంటున్న ఆశాకిరణాలు

పీడకలలా వెన్నంటే దృశ్యాలు, మిణుకుమిణుకుమంటున్న ఆశాకిరణాలు

పీడకలలా వెన్నంటే దృశ్యాలు, మిణుకుమిణుకుమంటున్న ఆశాకిరణాలు

“నా చుట్టూవనాలు ఊగిపోతున్నాయి, అగ్నిజ్వాలలు ఎగిసెగిసి పడుతున్నాయి. నేను పరుగులు తీస్తుండగా చుట్టూ ప్రజలు రోదిస్తూ, ప్రార్థనలు చేస్తూ, సహాయానికై ప్రాథెయపడుతున్నారు. లోకాంతం వచ్చేసిందనే అనుకున్నాను.”— జి. ఆర్‌., భూకంపం నుండి బ్రతికి బయటపడిన వ్యక్తి.

అవిశ్రాంతంగా కదులుతున్న మన భూమి యొక్క లోపలి రాతిపొరల్లో ప్రతి సంవత్సరం లక్షల భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే, వాటిలో అత్యధికం మన దృష్టికి రానేరావు. * అయినా, సగటున ప్రతి సంవత్సరం సంభవిస్తున్న 140 భూకంపాలు, “భారీ,” “పెను,” “తీవ్ర” భూకంపాలని పేర్కొనదగినంత పెద్దవి. చరిత్రంతటిలో, ఇవి కోటాను కోట్లమంది ప్రాణాలను బలిగొన్నాయి, లెక్కించలేనంతటి ఆస్తి నష్టాన్ని కలిగించాయి.

బ్రతికి బయటపడినవారిపై కూడా భూకంపాలు భావోద్రేకపరంగా తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదాహరణకు, 2001 తొలిభాగంలో ఎల్‌ సాల్వడార్‌లో రెండు భూకంపాలు ఘోరమైన విధ్వంసాన్ని సృష్టించాయి. తర్వాత, ఆ దేశ వైద్యశాఖకు చెందిన మానసిక ఆరోగ్య సలహా కమిటి సమన్వయకర్త ఇలా పేర్కొన్నాడు: “ప్రజలు దుఃఖం, నిరాశ, ఆగ్రహం వంటి వాటివల్ల వచ్చే మానసిక సమస్యల బారినపడుతున్నారు.” కృంగుదలతో, చింతతో బాధపడుతున్న రోగుల సంఖ్యలో 73 శాతం పెరుగుదల ఉందని ఎల్‌ సాల్వడార్‌లోని ఆరోగ్య కార్యకర్తలు నివేదిస్తున్నారంటే అందులో ఆశ్చర్యం ఏమీలేదు. వాస్తవానికి, పునరావాస శిబిరాల్లో ఉన్నవారి అవసరాల్లో నీరు మొదటి స్థానాన్ని తీసుకుంటే, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స రెండవ స్థానాన్ని తీసుకుందని సర్వేలు సూచించాయి.

భూకంపాల మూలంగా కలిగేది మరణం, నాశనం, నిస్పృహ మాత్రమే కాదు, చాలాసార్లు ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రజలు తమ అసాధారణ మంచితనాన్ని, స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించేలా వారిని కదిలించాయి. వాస్తవానికి, పాడైపోయిన భవనాలను బాగుచేయడానికీ ఛిన్నాభిన్నమైన జీవితాల పునరుజ్జీవనానికీ కొందరు అవిరామంగా కృషి చేశారు. మిణుకుమిణుకుమంటున్న అలాంటి ఆశాకిరణాలు అత్యంత భయంకరమైన దృశ్యాల మధ్య కూడా ప్రకాశించాయి, అదెలాగో మనం చూద్దాం. (g02 3/22)

[అధస్సూచి]

^ ప్రతిరోజు వేలసంఖ్యలో సంభవించే అత్యల్ప భూకంపాలు కూడా వీటిలో భాగమే.

[2, 3వ పేజీలోని చిత్రాలు]

2, 3 పేజీలు: గ్రీసులోని ఏథెన్స్‌లో, కూలిపోయిన ఒక భవనం లోపల తన తల్లి చిక్కుకుపోయిందని వ్యాకులతతో ఉన్న ఒక యువతి గ్రహిస్తుంది. ఈ లోపల, ఐదేళ్ళ తన కూతురు కాపాడబడిందని తెలుసుకుని ఒక తండ్రి అత్యానందభరితుడయ్యాడు

[చిత్రసౌజన్యం]

AP Photos/Dimitri Messinis