కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

మీకు తెలుసా?

(సూచించబడిన బైబిలు లేఖనాలనుండి ఈ క్విజ్‌కు సమాధానాలు కనుక్కోవచ్చు, సమాధానాల పూర్తి లిస్ట్‌ 16వ పేజీలో ఇవ్వబడింది. అదనపు సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన “లేఖనాలపై అంతర్దృష్టి” [ఆంగ్లం] అనే ప్రచురణను చూడండి.)

1.యెహోవా దినమందు వెండి విగ్రహాలను, సువర్ణ విగ్రహాలను గబ్బిలములకు పారవేయడాన్ని గురించి యెషయా ఎందుకు మాట్లాడతాడు? (యెషయా 2:20, 21)

2.తమ పొలాల ఓరలను పూర్తిగా కోయకూడదని ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పబడింది? (లేవీయకాండము 19:9)

3.ఒక వ్యక్తి తన దాసుని కంటికి హాని కలిగిస్తే లేక తన దాసుని పన్ను ఊడగొడితే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతను ఏమి చేయాలి? (నిర్గమకాండము 21:26, 27)

4.ఒక నరహంతకుడు ఎప్పుడు మాత్రమే ఆశ్రయ పురమును వదిలివెళ్ళవచ్చు? (సంఖ్యాకాండము 35:25)

5.కొర్నేలి దేవునికి ప్రార్థించడానికీ పేతురు అతనిని కలిసేందుకు రావడానికీ మధ్య ఎంత సమయం గడిచింది? (అపొస్తలుల కార్యములు 10:30-33)

6.“భేదములను ఆటంకములను కలుగజేయు” వారికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోబడాలని పౌలు చెప్పాడు? (రోమీయులు 16:17)

7.యోబు తన యథార్థత విషయంలో రాజీపడేటట్టు చేయడానికి ప్రయత్నిస్తునప్పుడు సాతాను యోబు ఆరోగ్యంపైకి ఎలాంటి విపత్తును తీసుకువచ్చాడు? (యోబు 2:7)

8.మొదటిసారి మన్నా తిన్నప్పుడు, సబ్బాతు నియమమును మొదటిసారిగా ఆచరించడం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారు? (నిర్గమకాండము 16:1)

9.ఏహూదు, మోయాబురాజైన ఎగ్లోనును దేనితో చంపాడు? (న్యాయాధిపతులు 3:16)

10.యోహాను సందేశాలు వ్రాసి పంపించిన ఏడు సంఘాలు ఏ రోమన్‌ మండలంలో ఉండేవి? (ప్రకటన 1:4)

11.యేసు తరచూ ఏ జంతువుతో పోల్చబడ్డాడు? ఎందుకు? (యోహాను 1:29)

12.భూమి మీద, నేలనుంచి వేరుచేయబడ్డ నీటి సముదాయాలను సూచించడానికి ఏ పదం ఉపయోగించబడింది? (హబక్కూకు 2:14)

13.ఓడలోకి నీరు రాకుండా ఉండడానికి నోవహు ఏ పదార్థాన్ని ఉపయోగించాడు? (ఆదికాండము 6:14)

14.క్రీస్తు సింహాసనాసీనుడైన తర్వాత పరలోకంలో ఏమి జరిగింది? (ప్రకటన 12:7)

15.తన ఆఖరి పస్కాపండుగ ఆచరణకు ఏర్పాటు చేయమని యేసు ఏ ఇద్దరు శిష్యులను పంపించాడు? (లూకా 22:7-13)

16.యేసు యెరూషలేములోకి విజయోత్సాహంతో ఏ జంతువుపై స్వారీ చేస్తూ వస్తాడని ప్రవచించబడింది? (జెకర్యా 9:9)

17.సోమరులు ఏ పురుగు నడతను అనుకరించాలని ఉద్బోధించబడ్డారు? (సామెతలు 6:6)

18.యేసును కాపాడడానికి ప్రయత్నిస్తూ పేతురు తన కత్తిని ఉపయోగించినప్పుడు ఏమి జరిగింది? (యోహాను 18:10)

19.ఆచారరీత్యా కలుషితం కాకుండా ఉండడానికి పరిసయ్యులు ఏ కీటకాన్ని వడగట్టడానికి అతిజాగ్రత్తను పాటించేవారు? (మత్తయి 23:24)

20.యెహోవా కంటే తన కుమారులను గొప్ప చేసింది ఎవరు? (1 సమూయేలు 2:22, 29) (g02 4/8)

క్విజ్‌కు సమాధానాలు పేజీలోని 16

1.అలాంటి విగ్రహాలకు, గౌరవించబడే ప్రముఖస్థానంలో ఉంచబడే అర్హతలేదు. అవి చీకటితో, అపరిశుభ్రతతో ఉన్న ప్రదేశంలో పడవేయబడడానికే తగినవి.

2.దరిద్రులు, పరదేశులు పరిగె ఏరుకోవడానికి

3.దాసుణ్ణి స్వతంత్రున్ని చేయాలి

4.ప్రధాన యాజకుడు చనిపోయినప్పుడు

5.నాలుగు రోజులు

6.వారిని ఒక కంట కనిపెట్టి, వారికి దూరముగా ఉండాలి

7.అతను యోబు శరీరాన్నంతటినీ కప్పివేసిన బాధగల కురుపులతో మొత్తాడు

8.సీను అరణ్యములో

9.రెండంచుల కత్తి

10.ఆసియా

11.గొర్రెపిల్ల. యేసు వహించిన త్యాగపూరితమైన పాత్రను బట్టి అలా పోల్చబడ్డాడు

12.సముద్రము

13.కీలు

14.యుద్ధము జరిగింది, దాని ఫలితంగా సాతాను పరలోకమునుండి పడద్రోయబడ్డాడు

15.పేతురు, యోహాను

16.గాడిద

17.చీమ

18.ఆయన ప్రధానయాజకుని దాసుడైన మల్కు కుడిచెవిని తెగనరికాడు

19.దోమ

20.ప్రధాన యాజకుడైన ఏలీ