కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విని నేర్చుకోండి

విని నేర్చుకోండి

విని నేర్చుకోండి

“మనకు తెలిసినదానిలో 85 శాతం మనం వినడం ద్వారానే నేర్చుకున్నాము” అని టొరొంటో స్టార్‌ వార్తాపత్రికలోని ఒక నివేదిక చెప్తోంది. మనం మన సమయాన్ని చాలామట్టుకు వినడంలోనే గడుపుతున్నప్పటికీ, “మన ధ్యాస ప్రక్కకు మళ్ళించబడుతుంది లేదా మనం వేరే విషయాల్లో నిమగ్నమవుతుంటాము లేదా విన్నవాటిలో 75 శాతం విషయాల్ని మరిచిపోతుంటాము.” గమనార్హమైన ఈ గణాంకాలు మన వినికిడి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవలసిన అవసరతను ఉన్నతపరుస్తాయి.

“సమాజంలోని అనేక సమస్యలకు మూలకారకం సరైన వినికిడి సామర్థ్యాలు లేకపోవడమే” అని ఆ నివేదిక తెలుపుతోంది. ఇది తరచూ ఆత్మహత్యలకూ స్కూల్లో జరిగే దౌర్జన్యాలకూ కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడానికీ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికీ ఒక కారణంగా ఉంటోందని స్పీచ్‌ పాథాలజిస్ట్‌, సంభాషణల నిపుణురాలు అయిన రిబెక్కా షాఫిర్‌ విశ్వసిస్తోంది.

ప్రజలకు వివిధ రకాలైన వినికిడి శైలిలు ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొందరు, ప్రజలకు సంబంధించిన విషయాలను వినడానికి ఇష్టపడేవారై ఉంటారు, వారు ఒక కథకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలన్నింటిని వినడానికి ఇష్టపడతారు. ఇతరులు ఒక వృత్తాంతానికి సంబంధించిన సంఘటనలను వినడానికి ఇష్టపడతారు, అవతలి వ్యక్తి అసలు విషయాన్ని త్వరగా తెలియజేయాలని వీరు కోరుకుంటారు. “కాబట్టి, ప్రజలకు సంబంధించిన విషయాలను వినడానికి ఇష్టపడేవారికీ, వృత్తాంతానికి సంబంధించిన సంఘటనలను వినడానికి ఇష్టపడేవారికీ మధ్యన సంభాషణ జరిగినప్పుడు, ఆ సంభాషణ విఫలమయ్యే అవకాశం ఉంది” అని స్టార్‌ అంటోంది.

కాబట్టి మంచి కారణంతోనే యేసు, ‘మీరు ఎలా వింటున్నారనే దానికి’ అవధానం ఇవ్వవలసిన అవసరం ఉందని నొక్కిచెప్పాడు. (లూకా 8:​18) శ్రద్ధగా వినడం మంచి మర్యాదలను చూపిస్తుంది. అది మంచి సంభాషణలో ఒక ప్రాముఖ్యమైన భాగం. సంభాషించేటప్పుడు ఎలా వినాలనేదానికి ఆచరణాత్మకమైన సలహాలలో, అవధానాన్ని మళ్ళించేవాటిని నిర్లక్ష్యం చేయడమూ కొద్దిగా ముందుకు వంగడమూ కళ్ళలోకి చూస్తూ తల ఊపుతూ చెబుతున్నదానికి చురుగ్గా ప్రతిస్పందించడమూ ఇమిడి ఉన్నాయి. మనం నేర్చుకునేది ఎక్కువగా మనం సరైన విధంగా వినడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, మనమందరం శ్రద్ధగా వినడం విషయంలో కృషి చేస్తూనే ఉండాలి. (g02 4/8)